Sunday, July 26, 2020

ప్రతి దినము మురళితో నూతన జీవితం . స్పార్క్ TELUGU ANUVADAMU


ప్రతి దినము మురళితో నూతన జీవితం . స్పార్క్
పూణే లోకల్ అధ్యాయం ,
విడుదల2.2 విడుదల
తేదీ : 25th  జున్  2011
స్పార్క్

పేజీ
ప్రతి దినము మురళితో నూతన జీవితం
విషయ సూచిక 

ప్రశ్నలు ............................................................................................ 3 
మురళి మహత్యము .............................................................................5 
మురళి మురళి మురళి ......................................................................... 8 
మురళి క్లాస్ కి ముందు ......................................................................... 9 
మురళి క్లాస్ సమయం లో మురళి వేనే విధానం ......................................... 11 
మురళి క్లాస్ సమయం  లో మురళి పాయింట్స్ వ్రాసుకునే విధానం ................. 16 
ఆస్ట్రల్ బ్రాడ్ కాస్ట్ టూల్ ......................................................................... 19 
మురళి క్లాస్ తరువాత ఏమి చేయాలి .......................................................21 
మురళి ఎందుకు మిస్ అవ్వకూడదు .......................................................24 
పిల్లల్లు క్లాస్ కి రాలేకపోవటానికి ఏమి ఏమి కారణాలు చెప్పుతారు ? దానికి ఉపాయాలు ఏమిటి ?..........28


పేజీ 2
ప్రతి దినము మురళితో నూతన జీవితం
ఈ మెన్నుల్ స్పార్క్ పూణే అధ్యాయం లో 2011  సంవత్సరం లో నేను బాబా ను అనుసరిస్తాను అనే  ప్రాజెక్ట్ ప్రతి దినము మురళితో నూతన జీవితం అనే దాని ఫై ఆధార పడి తయారుఅయింది. మీరు కూడా ఈ ప్రాజెక్ట్ లో చేరాలి అనుకుంటే, ఈ మానుల్ తో పాటు ప్రాజెక్ట్ ప్రపోసల్ పూర్తిగా చదివి అందులో వున్న ప్రాజెక్ట్ విషయాలను విస్తృతంగా తెలియచేయాలి. ఇంకా ఎక్కువ విషయాలు తెలియ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చిన వారిని సంప్రదించండి.

నెంబర్
ప్రాజెక్ట్ కాంటాక్ట్
పేరు
   మొబైల్
ఇమెయిల్ id
1
గైడ్
బి.కే. అనురూప్ మరాతే
, మీరా సొసైటి పూణే
09421019387
anuroopmarathe@gmail.com
2
ఫెసిలిటేటర్
బి.కే. రాకేష్ భాయ్,
మీరా సొసైటి పూణే
09823547921
bkrakesh.dh@gmail.com
3
కోఆర్డినేటర్
బి.కే శివాని వాటర్ నిరోలి , బి.కే షీతల్ , నారాయణ్ గావ్
09503217962
09096351430
bksheetal30@yahoo.co.in
4
జాయింట్ కోఆర్డినేటర్






ఎవరికైతే ఈ సేవ కేంద్రంలో ఈ ప్రాజెక్ట్ లో పని చేయటానికి ఇష్టం ఉందొ , వారిని ఎక్కడ వున్నా నిమిత్ భాయి మరియు బెహన్ జాయింట్ కోఆర్డినేటర్ని  చేస్తారు .
పేజీ 3
ప్రతి దినము మురళితో నూతన జీవితం

(1)                   ప్రశ్నలు


ప్రతి దినము మురళితో నూతన జీవితం ప్రాజెక్ట్ మొదలు పెట్టె ముందు క్రింద వున్న ప్రశ్నలను పూర్తి చేయండి. దాని వలన వర్తమానం లో వున్న మీ ఆత్మిక స్థితిని మీకు మీరు  పరిశీలన చేసుకునేందుకు మురళి ఎంతగానో ఉపయోగపడుతుంది. అనగా నా ఆత్మిక స్థితి ఎక్కడ వరుకు వచ్చింది అని తెలుస్తుంది. నేను ఏ వైపు ఎంతగా అబ్యాసం చేస్తున్నానో , ఇంకా ఎంతగా  నా స్వ వున్నతి కోసం అబ్యాసం చేయాలో మీకు మీరే అంచనా వేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో మేలు చేస్తుంది.
          1 ) రోజు మీరు మురళి వింటున్నారా ?                        అవును              లేదు
నేను రోజు వినటం లేదు అంటే ఇప్పుడు వినాలి అని అనుకుంటున్నారా ?  అవును              లేదు
అది కాదు అంటే ఏమి చేయాలనీ అనుకుంటున్నారు ? ..................................................
2) ప్రతి రోజు మురళి క్లాస్ లో కి మీ టీచర్ కన్నా ముందు వచ్చి కూరుచుంటున్నారా ?
     అవును           లేదు
3) ప్రతి రోజు మురళి క్లాస్ లో కి స్వచ్చమైన యూనిఫామ్, తెల్లని వస్త్రాలు ధరించి బాబా పిల్లలుగా వస్తున్నారా ?
అవును         లేదు
4) ప్రతి రోజు మురళి క్లాస్ లో మురళి వినే విధి విధానాలు మీకు తెలుసా ? అవును         లేదు
మీకు విధానాలు తెలిస్తే ? ( పాయింట్స్ లో మీరు ఏమి విధానాలను పాటిస్తున్నారో వ్రాయండి .)
1…………………………………………………………………………………………………………………………………..
2……………………………………………………………………………………………………………………………………
పేజీ 4
5) ప్రతి రోజు మురళి క్లాస్ లో మురళి వినేటప్పుడు అతీద్రియ సుఖాన్ని పొందుతున్నారా ?
అవును         లేదు
6) ప్రతి రోజు మురళిని ఎన్ని సార్లు చదువుతున్నారు / వింటున్నారు ? ( సంఖ్య రాయండి )
7) ప్రతి రోజు మురళి పాయింట్స్ ని నోట్ బుక్ లో నోట్ చేసుకుంటున్నారా ?  అవును         లేదు
వ్రాసుకోకపోతే ఎందుకు వ్రాయలేదు  కారణమ్ ఏమిటి ?
8) ప్రతి రోజు మురళి విన్న తరువాత 10 నుండి 20 నిముషాలు మీ గురించి మీరు విచార మదన సాగరంలో మునిగిపోతున్నారా ?అవును         లేదు
విచార మదన సాగరం చేయక పోవటానికి కారణం ఏమిటి ?.........................................................
9) ప్రతి రోజు మురళి వినటంలో మీకు ఏమి ప్రాప్తిస్తుంది అని భావిస్తున్నారు ?
1………………………………………………………………..
2……………………………………………………………………
3……………………………………………………………………
4…………………………………………………………………
5……………………………………………………………………




పేజీ 5
( 2 ) మురళి వినటం వలన/చదవటం వలన కలిగే మహత్యం
జీవన్ ముక్తి స్థితి పొందటానికి ఆధారం – మురళి
1.      పరమాత్మ, బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించి దాని ద్వారా మురళి అందరి ఆత్మల విశ్వ కళ్యాణం కోసం వినిపిస్తున్న మహావాక్యాలు , భగవాను వాచా !
2.      తియ్యని తియ్యని హృదయ రాముని బాబా  తో ఎవరు అయితే మురళి  నేర్చుకుంటారో వారి స్థితి బాబా శిక్షణ లో చాలా ఉన్నతంగా ఉంటుంది. అది బాబా వరదానం.
3.      ప్రతి రోజు మురళి వింటున్న బ్రాహ్మణ పిల్లలకు  తండ్రి అయిన పరమాత్మ, తల్లి అయిన బ్రహ్మ పాలన లభిస్తుంది.
4.      మురళి ప్రతి బ్రాహ్మణ చరిత్రను , 84 జన్మల కధను వినిపించే పుస్తకం.
5.      మురళి అనేది  పరమాత్మ ప్రతి ఒక్క ఆత్మకి ప్రేమతో వ్రాసిన  ప్రేమ లేఖ.
6.      మురళి అంటే శివ పరమాత్మ స్వయంగా  గీతలో ఉన్నవాటికి అర్ధాలను అందరికి అర్ధం అయ్యే విధంగా చెప్పిన  మాటలు.
7.      మురళి అనేది బ్రాహ్మణులూ ఎలా జీవించాలో , బ్రాహ్మణులుగా ఎలా తయారు అవ్వాలో శివ పరమాత్మ తెలియ చేసిన పుస్తకం. ( మేము బ్రాహ్మణులము అని చెప్పటానికి భాష మురళి )
8.      మురళి ఈ జీవిత సాగరాన్ని ఒడ్డుకు చేర్చుకోవటానికి నావకు చుక్కాని వంటిది. ( మురళి దేహాభిమానం లో నుంచి దేహీ అభిమానంలోకి రావటానికి జీవితం అనే పడవ ప్రయాణానికి నావ వంటిది. )
9.      మురళి పరమాత్మే స్వయంగా రచించిన గీత
10.  మురళి పరమాత్మే స్వయంగా అమ్మలా లౌకిక పరివారానికి , అలౌకిక పరివారానికి పడిన జోల పాట.
11.  బ్రాహ్మణులు చదువు నేర్చుకోవటానికి పరమాత్మ పాఠశాలలో వున్న మహోన్నతమైన పుస్తకమే మురళి .
12.  మురళి అనేది బ్రాహ్మణ పిల్లలకు  జ్ఙాన సాగరుని కవచం.
13.  మురళి అనేది తండ్రి అయిన శివ పరమాత్మ జ్ఙానము , అంతే కాదు బ్రహ్మ బాబా అనుభవాలతో పిల్లల ఆత్మలకు శక్తి రావటం కోసం పెడుతున్న భోజనం.
14.  మురళి జ్ఙానము అన్ని ఆత్మలకు ఆత్మకు భోజనము వంటిది .
15.  మురళి అనేది ఆత్మకు మాయతో జయించడానికి పరమాత్మ ఇచ్చిన ఒక గొప్ప ఆయుధం మరియు వరము.
16.  మురళి అనేది పరమాత్ముని యొక్క వారసత్వాన్ని పొందడానికి అనుమతి ఇచ్చిన  పత్రం.
17.  మురళి అనేది భగవంతుని శక్తులు అనే ఖజానాను  ఆత్మలో నింపుకోవటానికి వున్న కోశాగారము  !
18.  మురళి అనేది పరమాత్మ - ఆత్మలతో మాట్లాడడానికి ఎన్నుకున్న భాష .
పేజీ 6

19.  పరమాత్మతో  అడుగులో అడుగు వేసుకుంటూ నడిచే భాగ్యాన్ని కలిగించే బేరర్ చెక్కు మురళి.
20.  మురళి బ్రహ్మాండానికి వెళ్ళటానికి టికెట్.
21.  పరమాత్మ ఇస్తున్న అతీన్ద్రియ సుఖము అనే ఊయలను ఊగే సాధనం ఈ మురళి.
22.  5000 సంవస్సరాల  సంపాదనకు   ఆధారం మురళి.
23.  గోపి గోపికల ఆనందం కోసం మురళీధరుడు వినిపిస్తున్న దివ్యమైన స్వరమే మురళి.
24.  మురళి అనేది బాప్ దాదా హృదయం నుంచి వచ్చే సంగీతం.
25.  మురళి అనేది పరమాత్మను కలుసుకోవటనికి ఆత్మల భక్తి కి ఫలము.
26.  పరమాత్ముని వేదం మురళి.
27.  బ్రాహ్మణులు ఫరిస్తా స్వరూపాన్ని పొందటానికి చేసే  అంతరిక్ష ప్రయాణమే ఈ మురళి .
28.  బాప్ దాదా ప్రతి రోజు పిల్లల తో ప్రేమతో కలవటానికి ఏర్పాటు చేసిన సంభాషణ ఈ మురళి . మురళి మిస్ అయితే బాబా ప్రేమను ఆ రోజు మిస్ అయినటే.
29.  మురళి అనేది బాప్ దాదా కు పిల్లల ఫై వున్న ప్రేమకు గుర్తు.
30.  మురళి అనేది బ్రాహ్మణ జీవితానికి ఒక నియమము.
31.  మురళి అనేది ఆత్మకు సంజీవని వంటిది ! మూర్తులను ప్రకాశవంతం చేసేది !
32.  మురళి సమస్యలకు సమాధానం !
33.  పరమాత్మను గుర్తించటానికి ఉపయోగించే సాధనమే మురళి !
34.  మురళి ఈశ్వరుని ఆశీర్వాదం . బ్రాహ్మణుల శరీరము , మనస్సు ఆరోగ్యముగా ఉండడానికి మందు.
35.  సత్య యుగానికి సంభందించిన సంసంస్కారాన్ని తెలిపేది మురళి.
36.   పరమాత్మ తన పిల్లలైన సేవ చేసే పిల్లలను శబాష్ అని చెప్పటానికి  మురళి ఉపయోగపడుతుంది.
37.  పిల్లల కోసం బాబా పాడిన సంకీర్తనే మురళి.
38.  బ్రాహ్మణ సంఘటనను తయారు చేసే సూత్రము మురళి .
39.  బ్రాహ్మణ సంస్కారాన్ని పరివర్తన చేసుకోవడానికి ఆధారం మురళి .
40.  జీవన్ ముక్తికి దారి చూపించేది మురళి.
41.  బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేయటానికి పరమాత్మ తెరిచి వుంచిన పుస్తకమే మురళి.
పేజీ 7

42.  మహాభారతానికి నాంది మురళి.
43.  ఈశ్వరుని వారసత్వాన్ని ఎలా తీసుకోవాలో తెలిపేది మురళి .
44.  ఈశ్వరుని వారసత్వాన్ని తీసుకోవటానికి పాటించే మర్యాదలను తెలిపేది మురళి.
45.  ఆత్మ అవినాశి అన్న జ్ఙాన యజ్ఞం ను తెలిపేది మురళి.
46.  ఆత్మకు మరణం లేదు అని . ఏది శాశ్వతం కాదు అని తెలియచేసేది మురళి.
47.  ఆజ్ఙాన అంధకారంలో నడుస్తున్న పిల్లలకు జ్ఙానము అనే వెలుగు లోకి తీసుకు రావడానికి పరమాత్మ ఇస్తున్న చేతి కర్ర మురళి.
48.  ఆత్మ లో దివ్యమైన బుద్ధిని తెరిపించే తాళము మురళి.
49.  బ్రాహ్మణ సంస్కారాన్ని తెలిపే మాటలే   మురళి.
50.  తండ్రి శివ పరమాత్మ  స్మృతి తప్ప వేరే ఏది మనస్సు లో లేకుండా ఉంచేది మురళి.
51.  మనుష్యల నుంచి దేవి దేవతలుగా తయారు అవటానికి చదువుకునే శ్రేష్ఠ మైన చదువే మురళి.
52.  మురళి  జ్ఙాన సూర్యుని ఆకాశ గంగ మరియు వెలుగు.
53.  మురళి అనేది  సత్య నారాయణి సత్యమైన కధ.
54.  కర్మకి , అకర్మకి , వికర్మకి కల తేడాలను తెలియచేస్తూ , గీత లోని ఆధ్యాత్మిక రహస్యాలను తెలిపేదే మురళి.
55.  వేదాలను , శాస్త్రాలను , ఖురాన్ అన్నీ మతల సారాంశం ఒక్కటే అని  వివరంగా తెలిపేది మురళి.
56.  మురళి ఈశ్వరుని సేవ ఎలా తెలియచేయాలో తెలుపుతుంది.
57.  మురళి పరమ శిక్షకునికి , శిక్షకుడు అని తెలియ చేస్తోంది.
58.  జ్ఙానరత్నాలను సంపాదించుకునే అమూల్యమైన భండారమే మురళి.
59.  పరమాత్మ ఆత్మలకు ఆత్మికస్థితి లోకి వెళ్ళటానికి మార్గం చూపించేదే మురళి.
60.  పతితులను పావనులుగా చేయటానికి శివ పరమాత్మ చెప్పిన అమూల్యమైన మహా వాక్యాల  గంగ  ఈ మురళి.
61.   పరమాత్ముని ఇంద్రజాలమే ఈ మురళి.
62.  మురళి అనేది ఆత్మకు జ్ఙాన అమృతము .శివ బాబా చెప్పుతున్నారు ( బ్రహ్మ అంటే అమ్మ  ద్వారా ) బ్రహ్మ ముఖము ద్వారా పిల్లలు అయిన మీరు అందరూ జ్ఙాన అమృతము అనే పాలను త్రాగుతున్నారు. దీని వలన మీలో ఏవి అయితే పాపా కర్మలు ఉన్నాయో అవి భస్మము అయిపోతూ , ఆత్మను కంచన కాయగా , దృఢంగా మాయజీత్ లుగా తయారు చేసుకోనందుకు ఉపయోగ పడుతుంది.
(25.9.2014 )








పేజీ 8
మురళి మురళి మురళి
మురళి లో ఎదో తెలియని నిజమైన  మహత్యం ఉంది.
మురళి అనేది పరమాత్మయే స్వయంగా వచ్చి వినిపించింది.స్వయంగా పరమాత్మతోనే తయారుచేయబడింది.
మురళి ఎప్పుడు మిస్ అవ్వకండి.
మురళి చదువుకోవటం వలన బుద్ధికి భోజనం దొరుకుతుంది.
మనకు అదృష్టాన్ని సంపాదించుకొనే మార్గం చూపించే చదువే మురళి .
మురళి చదవటంతో మన జీవితం సత్యంగా మారిపోతుంది.
మురళి రోజు చదివేవారి దగ్గరకు మాయ రావటానికి భయపడుతుంది.
మాయను జయించడానికి కవచంగా మురళి ఎంతగానో దోహదం చేస్తోంది .
పరమాత్ముని ఛత్రఛాయ మురళి చదవటంతో మనకు ప్రాప్తిస్తుంది. దాని వలన మాయ ముఖాన్ని మనము చూడవలసిన అవసరం రాదు.
ఇంతకు ముందు ఎప్పుడు కని , విని ఎరుగని ఆనందం మురళి చదవటం లో అనుభూతి చెందుతాము.
మురళి చదవటంతో మొడుబారిన  మన జీవితం పచ్చదనంతో నిండిపోతుంది.
దేవి దేవతల సంస్కారాలను మన ఆత్మలో నింపుకోవటానికి వున్నచదువే మురళి.
మురళి రోజు వినటం వలన మన ఆత్మ లో వున్న వికారాలను భస్మం చేసుకోగలిగే శక్తిని పొందుతాము.
మాయా రావణుడు తో ఎలా యుద్ధం చేయాలో తెలిపేది మురళి ( మన ఆత్మ లో వున్న వికారాలు ఫై మనకు మనం యుద్ధం చేయటం. అంతే కానీ ఎదుటివారి ఫై పగ, ద్వేషాల ను చూపించటం కాదు. )
మురళి ఆత్మకు జ్ఙానము అనే లోతులకు తీసుకువెళ్లి జ్ఙానరత్నాలను ఖజానాను ప్రసాదిస్తుంది.
మురళి ప్రతి రోజు వినటం వలన మన జీవితంలో సుఖ శాంతులు లభిస్తాయి.
మురళి చదవటం మరియు వినటం వలన ఆత్మ లో  జ్యోతిని వెలిగించుకోవచ్చు.
మన జీవితాలలో మురళి చదవటం వలన పరివర్తన కలుగుతుంది. ( లౌకిక జీవనం నుంచి అలౌకిక జీవనం లోకి రావటానికి పరివర్తన కలిగించేది.)
అన్నీ  వ్యవస్థలకు సారాంశమే మురళి.
మురళి చదవటం మరియు వినటం వలన మన జీవితం లో మాయ తో వచ్చే గొడవలు అన్ని మాయం అయిపోతాయి.
మురళి తో ఆత్మకు భగవంతుడు ఇచ్చే  జ్ఙానమును అర్ధం చేసుకోగలిగే శక్తి లభిస్తుంది.
మురళి సత్య యుగానికి మెట్లు ఎలా ఎక్కాలో దానికి ధారణ మార్గం చూపుతుంది.

పేజీ 9
(3)     మురళి క్లాస్ కి వెళ్లేముందు ఏమి చేయాలి  ?
·       ఎంత సమయం వీలు అయితే అంత సమయం , అమృత వేళ నుంచి క్లాస్ ఆఎంతవరుకు నిశ్శబ్దంగా ఉండాలి  ! ఇలా చేయటం వలన వ్యర్ధమైన సంకల్పాలు రాకుండా మనస్సు ఆధీనంలో ఉండటమే కాకుండా క్లాస్ లో మురళి ఫై శ్రద్ధ వస్తుంది .
·       ఇంటి నుంచి క్లాస్ కి బయలు దేరే ముందు ఒక బాబా స్వమానం తీసుకునుని, మననం చేసుకుంటు బయటకు రావాలి. దాని వలన  వ్యర్ధమైన సంకల్పాలు రావు.
·       మురళి క్లాస్ కి 30 నిమిషాలు ముందు చేరుకోవాలి. 30 నిమిషాలు చాల పవర్ ఫుల్ గా యోగం చేసుకోవాలి. యోగ సమయంలో ...
ü పవర్ ఫుల్ యోగ సమయంలో సంఘటనలో చార్టును తయారు చేసుకుని నింపాలి.
ü బుద్ధి కి ఏకాగ్రత రావటం వలన మురళి తో ఆనందాన్ని పొందుతారు.
ü మురళి వినే సమయంలో ఎటువంటి వ్యర్థ సంకల్పాలు రాకుండా విముక్తి పొందుతారు.
ü సేవ కేంద్రం లో వాయుమండలం యోగం తో చాల పవర్ ఫుల్ గా తయారుఅవుతుంది.
·       ఎంతవరుకు వీలు అయితే అంత వరుకు స్వచ్ఛమైన యూనిఫామ్ లో రావాలి. మనము అందరము సాధారణ యూనివర్సిటీ లో చదవాడని వెళ్ళటం లేదు. గోడ్లీ యూనివర్సిటీ లో చదువుకోవటానికి వెళ్లుతున్నాము. అందుకోసం శ్రేష్ఠమైన మనియు స్వచ్ఛమైన వస్త్రాలు వేసుకుని రావాలి. అందువలన
ü స్వచ్ఛమైన వాతావరణాన్ని తయారుచేసేందుకు నిమిత్తముగా అవుతాము.
పేజీ 10
ü అందరూ తెల్లని వస్త్రాలలో క్లాస్ కి వస్తే మనస్సు ముందు వాళ్ళు వీళ్ళు ఏమి వస్త్రాలు వేసుకుని వచ్చారు అన్ని ద్రుష్టి మనకు రాదు. అందరి లోను ఆత్మానుభూతి  కలిగి సహోదరి - సోదరి భావము కలుగుతుంది.
ü సంఘటన స్వరూపం లో చదువుకోవటాని మన్నస్సు లగ్నం చేస్తోంది.
ü భగవంతుని నుంచి క్రమశిక్షణ నేర్చుకుంటాము.
ü అందరిలోనూ ఒకే రకమైన క్రమశిక్షణ , భావము అనే ప్రకాశము జ్ఙానము లో ఉన్నవారి ఫై ప్రభావం పడి వారిలోను మార్పు వస్తుంది. సేవ తొందరగా జరుగుతుంది.

·        విద్యాలయానికి సంబంధిచిన బ్యాడ్జీ మరచిపోకుండా పెట్టుకుని క్లాస్ కి రావాలి. బాబా చెప్పుతున్నారు కొని సమయాలలో మన బ్యాడ్జీ  కూడా సేవ చేస్తోంది . అందరికి నేను ఈశ్వరుని సంతానాన్ని అందరి తో కలిసి పని చేయాలి అన్న ఉత్సహం వస్తుంది.
·        మన మనస్సు ఎప్పుడు మధువనం లోనే ఉండాలి. హిస్టరీ హాల్ లో కానీ డిమాండ్ హాల్ లో కానీ స్థితిలై ఉండాలి.ప్రతి రోజు దీని ద్వారా బాప్ దాదా వచ్చి చెప్పే మురళిని పవిత్రమైన వాతావరణంలో వినటానికి అవకాశం లభిస్తుంది.

పేజీ 11
(4)    మురళి క్లాస్ లో మురళి వినే యధార్థ మైన విధి
మురళిని వినిపించటానికి వతనం నుంచి బాప్ దాదా కిందకు వచ్చి పెద్ద అక్కయ్యలతోను, చిన్న అక్కయలతోను చెప్పిస్తున్నారు అని మన బుద్దితో చూడాలి. అంతేకాని అక్కయ్యలే చెప్పుతున్నారు బాబా కారు అని అనుకుని వారి దేహాన్ని చేస్తే వెంటనే మనము దేహాభిహనంలో కి వెళ్లి  మన బలహీనతలకు వసము అయిపోతాము.అందుకే  ఆత్మ ఆత్మాభిమానిగా అయ్యి  పరమాత్మాభిమానిగా అయ్యే ఉత్సహంగా ఉండాలి.
·       భగవంతుని విద్యార్థులకు సంకల్పం ( అవ్యక్త వాణీ – 31 / 12 / 1970 )

ü నేను ఈశ్వరీయ విద్యార్థిని అనే స్మృతిలో ఉంటున్నాను. అందుకే నన్ను నేను పరివర్తన చేసుకుంటున్నాను. నేను సాధారణమైన విద్యార్థిని కాను, సాధారణమైన చదువు చదువుకోవటం లేదు. అయినప్పటికీ డైరెక్ట్ గా తండ్రి ప్రతి రోజు దూర దేశం నుంచి వచ్చి చదువు చెపుతున్నారు.
ü నేను శ్రీ మతాన్నిపరమాత్మ నుంచి నేర్చుకుంటున్నాను. శ్రీ మతము అడుగు జాడలో అడుగు వేసుకుంటూ శ్రేష్ఠ మైన భాగ్యాన్ని పొందుతున్నాను.శ్రేష్ఠ మైన పదవిని పొందాలి అంటే శ్రీ మతమును అనుసరించాలి. ( శ్రీమతము అంటే శ్రేష్ఠమైన బుద్ధి ) అనేక జన్మల భాగ్యము శ్రీ మతము తో లభిస్తుంది.
ü నా కోసం తండ్రి  టీచర్ అయ్యి వచ్చారు. నేను తండ్రికి విశేష విద్యార్థిని, అందుకే నా కోసం తండ్రి వచ్చారు.
ü నా కోసం తండ్రి  టీచర్ అయ్యి వచ్చారు. నేను తండ్రికి విశేష విద్యార్థిని, అందుకే నా కోసం తండ్రి వచ్చారు. ఎక్కడ నుంచి వచ్చారు ? ఎవరు వచ్చారు ? ఏమి చదువు చదివిస్తున్నారు ? ఇక్కడ క్లాస్ లో శ్రేష్ఠ సంకల్పాలు ధారణ  చేసే చదువును చదువుకోవాలి.
ü పేజీ 12
ü ఎవరు మురళి చదువుతున్నారు అన్నది చూడకూడదు. ఎవరి కోసం తండ్రి చదివి వినిపిస్తున్నారు అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వ్యక్తిని చూడకుండా , ఆ వ్యక్తి లో అవ్యక్తమైన నిరాకారుడను చూడాలి.
·       నడుముని నిటారుగా పెట్టి మురళి క్లాస్ లో బాబా చెప్పే మాటలు వినటానికి కూర్చోవాలి.  అప్పుడు మనకి ఏఏ ఇతర ఆలోచనలు రావు. కేవలం శివ బాబా చెప్పే మురళి ఫై నే మనస్సు ఉంటుంది.
·       నేను ఆత్మాభిమానిగా తయారుఅవుతున్నాను అన్న సంకల్పం చేస్తూ, నేను ఆత్మను నా చెవులు , కర్మఇంద్రియాలు  అన్ని బాబా చెప్పే మహా వాక్యాలను వినటానికి సిద్ధపడుతున్నాయి. నేను కర్మేద్రియజీత్ ఆత్మను అన్న స్వమానములో స్థితులు అయి వున్నాను.
·       మురళితో స్నేహం చేసే పిల్లలు మురళిని ఎలా వింటారు ? ( అవ్యక్త బాప్ దాదా  -  year……….. )
ü దేహం తో వున్న మనస్సును , బుద్దిని వదిలి  అశరీరి స్థితి ని అనుభవం చేస్తారు. శరీరములో వున్న ఆత్మను విదేశీ ప్రదేశముగా భావిస్తూ, నేను నా బాబా అనే స్థితి లో మురళి వింటారు.
ü ఏ దేహధారి కూడా స్మృతిలో కి రాకుండా ఉంటూ, బాబా వినిపిస్తున్న  మురళి తో ఆనందం తో  నాట్యం చేస్తారు.
ü స్వయంగా భాగ్య విధాత తండ్రి అడుగులో అడుగు వేస్తున్నాను అన్న ఆత్మిక స్థితి నషా లో ఉంటారు.
ü మురళీధరుడు మురళి ని వినిపిస్తున్నాడు అన్న సత్యం తెలుసుకుంటే , మన ఆత్మిక స్థితి దేహాన్ని వదిలి ధరణి ఫై ఫై కి ఎగిరిపోతూవున్న లైట్ మైట్ స్థితి ని అనుభవం చేస్తారు.
ü పేజీ 13
·       మురళి వాక్యాలను బాబా తన పిల్లలకు ఎలా అలంకరణ చేసి అనుభవం చేయిస్తారు ( అవ్యక్త్ బాప్ దాదా మహావాక్యములు ఇయర్ ..............
ü మురళీధరుడు అయిన బాబా మనకు రాజా గా మారటానికి ఏ విధమైన ధారణ చేయాలో చాల వివరంగా అనుభూతి చేయిస్తారు.
ü అప్పుడప్పుడు మూలవతనానికి , అప్పుడప్పుడు సూక్ష్మ వతనానికి ,భావిష్యతులో వెళ్లబోయే సత్య యుగము లోకి వెళ్లి అనుభూతి చెందాలి.
ü అప్పుడప్పుడు లైట్ హౌస్ గా , మైట్ హౌస్ గా మారి దుఃఖంలో వున్న అన్ని ఆత్మలకు సుఖ శాంతుల కిరణాలను ప్రసరింపచేస్తున్నాను.ప్రతి రోజు కనీసం ముగ్గురుకు అయిన యోగ దానం చేయాలి బాబాని మనతో పెట్టుకుని.
ü మురళీధరుడు బాబా తో మురళి వింటూ అతేన్ద్రియ సుఖము అనే ఊయలను వుగాలి.
ü మురళిదరుని మురళి తో మన ఆత్మ ఆవినాశీ అనే అనుభూతిని చెందుతూ, శరీరమును  మరియు మనస్సును ఆరోగ్యముగా తయారు చేసుకునే అనుభూతి లో కి వెళ్లి పోతాము.

·        మురళి తో మస్తీ చేయడం వలన కలిగే ప్రయోజనాలు. ( అవ్యక్త బాప్ దాదా .................. )
ü  మురళి మస్తీ తో మస్తకం లో  రాజులు గా ఎలా తయారు అవ్వాలో అందుకు తయారు అయ్యే విధానం తెలుపుతూ మనకు తిలకం దిద్దిన అనుభూతి పొందుతాము .
ü  బేగంపూర్ కి బాదుషా గా అనుభూతి చెందుతాము.
ü  స్వరాజ్య అధికారి ఆత్మగా అనుభూతి చెందుతాము.
ü  విధి ద్వారా సిద్ధి వస్తుంది. ఎంత విధి రాత పూర్వకంగా నడుస్తామో అంత సిద్ది స్వరూపాన్ని పొందుతాము.
పేజీ 14
ü  సత్య యుగ పదవిని పొందటానికి ఆధారం.

·        రెండు రకాల పిల్లలు ( అవ్యక్త బాప్ దాదా - ఇయర్ ..........................)
ü  ఒకరు యదార్ధమైన విధి పూర్వకంగా మురళిని వింటారు / వినిపిస్తారు. ప్రతిదీ మురళి అనుసారంగా నడుస్తారు.
ü  రెండవ వారు నియమంతో వింటారు ఏది అర్ధం అయిందో అది చేస్తారు.
ü  మొదట మీకు మీరు ప్రశ్న  వేసుకొండి. నేను ఏ నెంబర్ లో వున్నాను ? ఫస్ట్ నెంబర్ లేక సెకండ్ నెంబర్ ?
ü  మురళీధరుడు అయిన తండ్రి ఇస్తున్న రివార్డ్ ( బహుమతి ) అంటే మురళి లో ప్రతి మాట పిల్లలకు రివార్డ్ ( బహుమతి ).



·        శ్రేష్ఠమైన స్థితిని పొందటానికి ఆధారం. ( అవ్యక్త బాప్ దాదా - ఇయర్ ..........................)
ü  మురళి గురించి అందరూ చెపుతారు విధి పూర్వకంగా వింటే దానితో సిద్ధి పొంది 84 జన్మల పుస్తకం లో శ్రేష్ఠమైన ప్రాప్తి లభిస్తుంది.
ü  సాధన చేసే కొద్దీ ఎలా పర్ఫెక్ట్ గా తయారు అవుతామో , అదేవిధంగా విధి పూర్వకంగా ఎవరు అయితే మురళి వింటారో వారి స్థితి గతి చాల చాల శ్రేష్ఠంగా మారుతుంది.
ü  బ్రాహ్మణ జీవితానికి మురళి అనేది ఊపిరి . ఊపిరి లేకపోతే జీవితం ఉండదు.

·      
చివరి నుంచి తొందరగా ముందుకు ( లాస్ట్ ఐస్ సో ఫాస్ట్ ) వెళ్ళటానికి సహజమైన విధానము ( అవ్యక్త బాప్ దాదా ఇయర్ ........... )
ü  చివరి నుంచి తొందరగా ముందుకు  ( లాస్ట్ ఐస్ సో ఫాస్ట్ ) వెళ్ళటానికి మార్గం చెప్పుతున్నారు. దానితో ఫాస్ట్ గా వెళ్ళగలరు.

పేజీ 15
ü  దూరం ఎక్కువ వున్నసమయం తక్కువ వున్నా విధి రాత అనే ఆటలో లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకుని గోల్ఫ్ కొట్టాలి.
ఏమి ఆలోచించకుండా ముందుకు నడు , శ్రేష్ఠమైన విధి తో శ్రేష్ఠమైన నెంబర్ ని పొందు. ఇక్కడ మంచి రహదారి ( రిఫైన్ దారి  )  ఉంది.
శ్రమ చేసేముందు అన్నింటినుంచి ముక్తిని పొందండి. అప్పటివరుకు ఆత్మకు మురళి అనే భోజనాన్ని తినిపించండి. అది అంతా సహజంగానే జరిగిపోతుంది. 

పేజీ 16



(5 ) మురళి క్లాస్ లో మురళి వ్రాసుకునే యధార్ధమైన విధి
·       గీతలు కొట్టి వున్న డైరీలో పాయింట్స్ వ్రాసుకోవాలి.
·       మురళి అంత కాదు. మురళి లో  బాబా చెప్పిన ముఖ్యమైన పాయింట్స్ తీసి వ్రాసుకోవాలి.
·       ముఖ్యమైన శబ్దాలను అండర్ లైన్ చేసుకోవాలి.
·       అందమైన చేతి వ్రాతలో వ్రాసుకోవాలి , ఎవరైనా ఆత్మలు మన డెయిరీని చదివితే వారికీ అర్ధం అవ్వాలి మనము ఏమి వ్రాశామో! దానితో వారు కూడా అర్ధం చేసుకుంటారు.
·       పాయింట్స్ని వ్రాయటమే కాదు. దానితో పాటు వీలు అయితే చిత్రాలను కూడా అందరిని అర్ధం అయేలా తయారుచేయండి. ఎందుకు చిత్రాలు తయారుచేయడం అంటే మన బుద్ధి లో చిత్రాలు తొందరగా గుర్తు ఉంటాయి.
·      పేజీ 17
 నమూనా 1  ( తయారుచేసుకునే విధానము )
బాప్ దాదా మురళి లో ప్రతి రోజు నాలుగు యుగాలు ( సత్య యుగము , త్రేతా యుగము , ద్వాపర యుగము మరియు కలి యుగము ) మూడు లోకాలు ( మూల వతనము , సూక్ష్మ వతనము , స్థూలవతనము ) గురించి ఎక్కడో , అక్కడ చెపుతూనే ఉంటారు. దాని పాయింట్స్ ను కింద ఇస్తున్న చిత్ర అనుసారంగా మీకు మీరు వేసుకోవాలి.







సూక్ష్మ వతనము పాయింట్స్                         పరంధామము పాయింట్స్





                                                                        సాకార లోకం పాయింట్స్

 సంగమ యుగము పాయింట్స్
                                   



                                                                                                        సత్య యుగం పాయింట్స్

కలి యుగం పాయింట్స్  
                                                                                                    ద్వాపర యుగం పాయింట్స్
                      త్రేత యుగం పాయింట్స్







పేజీ 18
నమూనా 2 ( తయారుచేసుకునే విధానము 2)

డైరీ లో పెన్ను తో  పేజీలో నాలుగు భాగాలుగా విభజించండి.ఫై భాగాలను మళ్ళి రెండు భాగాలుగా చేయండి. మన చదువులో ముఖ్యమైన విషయాలు - జ్ఙానము , యోగము , ధారణ , సేవ . ఈ నాలుగు విషయాలకు సంభందించిన పాయింట్స్ ని కింద గీసిన భాగాలలో వ్రాయవచ్చు. ఈ విధంగా ఒకే పేజీ లో మనము మురళిలోని ముఖ్య పాయింట్స్ ని రాసుకోవచ్చు.
మొదటి పత్రము                                                                             రెండవ పత్రము


జ్ఙానము
·       ………..
·       ………..
·       …………
·       …………..
యోగము
·       ………….
·       ………..
·       …………..
·       …………….
ధారణ
·       ……………
·       …………..
·       …………..
·       ………….
సేవ
·       …………..
·       ………….
·       ………….
·       ……………
మహా వాక్యము : తీయనైన పిల్లలు
.........................................
....................................
ప్రశ్న :....................
సమాధానము :...........................
..................................
....................................
వరదానం :...........................
.........................................
వివరణ :...........................
....................................
స్లోగన్ :...........................
...................................


పేజీ 19

(6 ) అట్రాల్ బ్రాడ్కాస్ట్ టూల్ :
బాప్ దాదా ఎప్పుడు అయితే మధువనంలో మురళి చెప్పేవారో , బాప్ దాదా ముందు కేవలం 20 నుండి 24 మంది మాత్రమే కూర్చొనే వారు. అందులో ఎక్కువ చదువు రాని మాతలే ఉండేవారు. అతి తక్కువ మంది అక్కయ్యలు , అన్నయ్యలు వున్నారు . అయినప్పటికీ బాప్ దాదా అనుకునేవారు అయిన ముందు అనేక వేల మంది కూర్చొని మురళి వింటున్నారు అని. మురళి చెప్పే సమయంలో విశ్వం లో ని ప్రతి పిల్లవాడు మురళి వింటున్నారు అన్న భావన తో చెప్పే వారు. ఆ కారణం తో నే ఇప్పటికి ప్రపంచమంతటా ఏ కుల , మత , వర్గ , జాతి విబేధం లేకుండా బాబా తన పిల్లలకు మురళి వినిపిస్తూనే వున్నారు.అందువలన అయన మహత్యము టచ్ అవుతుంది అంతేకాదు బాప్ దాదా ప్రేమ కూడా అనుభవం అవుతుంది. ప్రేమ వలన విధి తో దూరం దూరం గా కంటికి కనిపించనంతగా  వున్నా పిల్లలకు కుడా బాబా మాటలు వినపడతాయి. ఇప్పటికి అవ్యక్త బాప్ దాదా మధువనంలో మురళిని నడిపిస్తున్న సమయంలో దూర - దూరం లో వున్నా దేశ - విదేశ పిల్లలు చాల జాగ్రత్తగా మురళిని వింటున్నారు.
ఈ విధానం పేరే అట్రాల్ బ్రాడ్కాస్ట్ అని పెట్టారు. ఎందుకుకంటే చాల మంది RJ / DJ రేడియో / టీ.వీ. మాట్లాడాలని /వినాలని / చదువుకోవాలని / చదివి చెప్పాలని అనుకుంటారు. ఆ సమయం లో వారు ఒంటరిగా అవుతారు. కానీ బుద్ధి లో విశ్వ విద్యాలయం గురించి ఉంటుంది. అది దేశం అంతా వింటుంది అని, అందరిని మన ముందు ఉంచుకుని చెప్పేటప్పుడు మన పైన మనకు అటెన్షన్ చాలా ఉంటుంది. ఏకాంతంలో ( స్టూడియో ) నుండి దేశ విదేశాలకు రేడియో ద్వారా బ్రాడ్ క్యాస్ట్ అవుతుంది .మనము చాలా తేలికగా రేడియో ను ఉపయోగించి అందరికి బాబా జ్ఙానమును పంచుతున్నాము. మనకు టెన్షన్ లేకుండా రేడియో పని చేస్తోంది.

పేజీ 20
విధంగా మనము మురళి క్లాస్ లో చదవాలి. అప్పుడు మనకు అనుభవం అవుతుంది. కోటి మంది ఆత్మలు మీ నోటి నుండి వచ్చే బాప్ దాదా మహావాక్యాలు వింటున్నారు అని. విధంగా ప్రయోగం ప్రతి బ్రాహ్మణ పరివారములో అందరూ చేయచ్చు. అమృతవేళ తరువాత ఫ్రెష్ అయిన ఎవరికీ వారే ఒంటరిగా ఎదో ఒక గదిలోకి వెళ్లి కూర్చోవాలి. లేక ఎదో ఒక మురళి ( సాకార అవ్యక్త వాణి ) మురళి లో ని ఒక పేరా ని గట్టిగా చదవాలి.మురళి చదివే సమయంలో ఊహించుకోవాలి. లక్షల మంది ఆత్మల ముందు మీరు బాప్ దాదా మురళి చదివి వినిపిస్తున్నారు. అంతేకాక మీ గది నుండి కోటి మంది ఆత్మలకు బాప్ దాదా యొక్క మహా వాక్యాలు బ్రాడ్కాస్ట్ అవుతున్నాయి. మరియు ఆత్మలందరికి బాబా సందేశం అందుతుంది. విధంగా మురళీ చదవటం మరియు సేవ చేయడం రెండు ఒకే సారి జరుగుతున్నాయి.
దాది జానకి అనేక సార్లు తన అనుభవం చెపుతూనే వున్నారు. అప్పుడు పూణే నా సొసైటీ సెంటర్ లో 16 సంవత్సరాల సేవ లో , అక్కడ మురళీ చెప్పే సమయంలో మురళీ చెప్పుతున్న అనుభవం కలుగుతుంది. సభలో వెయ్యి మంది మురళిని వింటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం డైమండ్ హాల్ లో 20000  మంది వున్న సభలో మురళీ వినిపిస్తున్నాను. మహారాష్ట్ర లో ఓకే కన్య విధంగా ప్రతి రోజు అమృతవేళ తరువాత ఒంటరిగా ఒక గదిలో కూర్చొని చేసేది.మరియు 14 దినములు తరువాత ఆమెకు అనుభవం అయింది చాల మంది ఆమె దగ్గరకు జ్ఙానమును వినటాని వచ్చేవారు . కొన్ని రోజులకే ఆమె స్థానిక సేవా కేంద్రానికి టీచర్ గా అయ్యిపోయింది.చాల మందికి లేఖలు వ్రాసే మహత్యమును ప్రాప్తి చేసుకుంది. విధంగా ప్రకారం ప్రయోగం కొంత లో కొంత 7 రోజులు పెట్టుకుని చూడండి. మీకు కూడా మురళీ చదవడంలో చాల అనుభూతి కలుగుతుంది. సహజంగానే సేవా కుడా పెద్దదిగా జరిగిపోతుంది.

పేజీ 21
( 7 ) మురళీ క్లాస్ తరువాత ఏమి చేయాలి ?

·        మిమల్ని మీరు చెక్ చేసుకొండి. విధి పూర్వకంగా రోజు మురళీ విన్నారా ? విధిని పూర్తీ రోజంతటా ప్రతి కర్మను సిద్ధి స్వరూపంలో కి అవ్వటానికి ప్రయత్నం చేసారా ? లేక పొతే మాములుగా అవుతారా ?
·        మురళీ విన్న తరువాత 10 నిముషాలు విచార సాగర మధనం చేయాలి.
·        రాత్రి మురళీ చదువుకుని పొడుకోవాలి.
·        ఎన్ని సార్లు మురళీ చదువుతారో, అన్ని సార్లు మురళీ పాయింట్స్ ప్రతి సారి ఒక్కక్క అర్ధాన్ని తెలియచేస్తుంది. దానితో జ్ఙానము లోతులోకి వెళ్ళుతున్న అనుభూతి పొందుతాము.
·        పిల్లలు మురళిని మంచిగా 4  - 5 సార్లు చదవాలి లేక వినాలి . అప్పుడు మురళీ బుద్ధిలో కూర్చోటుంది మరియు ఆనందముతో ఎగిరిపోతారు.

మురళితో ప్రతి రోజు ఉండే హోంవర్క్ ( అవ్యక్త బాప్ దాదా )
ü  బాప్ దాదా కోరుకుంటున్నారు . ప్రతి రోజు మహావాక్యాలను వినటమే హోమ్ వర్క్.
ü  ప్రతిరోజు మురళీ లో తండ్రి చెప్పుతున్నారు. ఏదియైతే తండ్రి పిల్లలకు చెప్పిన వాటిని అన్నింటిని చేసినట్టు అయితే వాళ్ళు ఎక్కడికి వెళతారు. వారే తండ్రి యొక్క వినయమైన ఆజ్ఞకారి పిల్లలు.
ü  ఏమి చేయాలి, రోజు మురళీ చదవాలి. కొంతమంది తెచ్చేస్ చాల దూరం నుండి చదువు చెప్పటానికి వస్తారు .

పేజీ 22
ü  తండ్రి యొక్క ప్రేమ మురళితోనే లభిస్తుంది.ఆ ప్రేమతో నా బాబా నా బాబా అని అంటూ ఉంటారు. వాళ్ళ తోలి ప్రేమ తండ్రితోనే, తండ్రి యొక్క మురళితోనే ఏర్పడాలి.

మురళీ పాయింట్స్ ఎందుకు గుర్తు ఉండవు ? ఏమి చేయాలి ? ( అవ్యక్త బాప్ దాదా ...... )
ü  వ్యర్ధ సంకల్పాలు ఎక్కడ ఉన్నాయో దానికి అక్కడ గుర్తు ఉండే సంకల్పం అంటే ఙ్ఞనము యొక్క మాధుర్యం వివరించండి. మీరు ఎప్పుడు అయితే మురళిని గుర్తు పెట్టుకుంటారో అక్కడ వ్యర్ధ సంకల్పాలు కు స్థానం లేదు .

ü  మురళి వినాలని , చదవాలని అనుకుంటున్నారు. అది చాలా అవసరం. ఇది బ్రాహ్మణ నియమము అయినప్పటికీ వినటానికి ఎంత మంది వున్నారు. మనస్సు లో మురళీ మాటల మననము అవ్వవు. ఆలోచిస్తారా? చెప్పుతారు ఈ రోజు మురళీ చాలా బాగుంది. ఆలోచించండి దానిలో ఏమి ఉంది. వరదానం చాలా బాగుంది కానీ గుర్తు లేదు.

·       వరదానము యొక్క మహత్యము దానితో కలిగే ఫలితమును స్వీకరించంచడానికి ఏ విధానం పాటించాలి. ( అవ్యక్త బాప్ దాదా ...............) 
ü ఎవరు ఎవరు పిల్లలు ఎక్కడ వున్న ఇండియా లో వున్న విదేశాలలో వున్న కానీ వరదానము అందరికి ఒక్కటే. బాప్ దాదా ఇస్తారు. వరదానము తో సుఖం ప్రాప్తి చెందేలా చేస్తారు. కానీ ఇక్కడ రెండు రకాలైన పిల్లలు వున్నారు.ఒక రకం పిల్లలు వరదానమును  తీసుకుని చాలా ఆనందాన్ని పొందుతారు. కానీ వెనుక వచ్చే నెంబర్ వారు తీసుకుంటారు.కేవలము వరదానము చూసి ఆనందం పొందక పొతే , వివరించడానికి అక్కడ ఏమి ఉండదు. ఈ వరదానం నాది అని చెప్పటానికి , వరదానం యొక్క ఫలితాన్ని తీసుకుంటారు. వరదానము యొక్క లాభాన్ని తీసుకుని
పేజీ 23
వరదానము నుంచి ఫలాన్ని తీసుకుంటారు. మధ్య మధ్య లో ఫలాన్ని స్వీకరిస్తూన్న అనుభూతి పొందకపోతే కేవలము ఆనందం మాత్రమే పొందుతాము.
ü వరదానము యొక్క ఫలము ఇచ్చే సమయములో ఎవరైనా బీజాన్ని తీసుకుంటే వారికీ ఫలము దక్కటానికి నీరు , ఎండ కావాలి అప్పుడు బీజము మొక్క అయ్యి ఫలాన్ని అందిస్తుంది. అందువలన ఇక్కడ ప్రతి పిల్లలకు వరదానము యొక్క ఫలము తప్పకుండా లభిస్తుంది. దానిని విస్తరింప చేస్తూ వెళ్ళండి. మన మన్నస్సు వరదానము అనే ఫలము ద్వారా వృద్ధిని పొందుతూ ముందుకు సాగుతాము, ఇక్కడ తండ్రి చెప్పుతున్నారు వరదానము అనే ఫలాన్ని తీసుకోవటానికి చాలా చాలా సార్లు వరదానము అనే స్మృతిలో కి వెళ్లి అనుభూతి చెందాలి. ఫలాన్ని తీసుకుంటున్నాను బీజాన్ని కాదు.
ü అనేక సార్లు సూర్యరశ్మి లేదు కానీ స్మృతిలో వున్నారు. అప్పుడు మొక్కకి నీరు పోయాలి / ఇవ్వాలి . మరియు స్వరూపంలో స్థితితులై ఉండాలి. ఎండను ఇవ్వాలి.ఈ విధంగా చేస్తే ఫలము లభిస్తుంది. ఫల అనుభూతిని చెందడంలో స్వయం లో శక్తి చాలా నిండుతుంది. ఇతరులను కుడా ఆ ఫలముతో శక్తి ని అనుభవం పొందుతారు.
పేజీ  24
( 8  ) మురళిని ఎవరు మిస్ అవ్వకూడదు.
·        ప్పుడు సమయం కొంతే మిగిలి ఉంది. దాని వలన మురళిని ఎప్పుడు మిస్ అవ్వకండి. తండ్రి పరంధామము నుండి వస్తున్నారు. సూక్ష్మ వతనం నుండి బ్రహ్మ బాబా వస్తున్నారు. అంతేకాక అనేకమైన మహావాక్యాలను మనకు తెలియచేస్తున్నారు. అందువలన మురళీ ఏ రోజు కూడా మిస్ అవ్వకండి.

·        మన బాప్ దాదా ప్రేమతో హృదయ పూర్వకంగా మాట్లాడే మాటలు మురళి .అందుకే మిస్ అయితే ప్రేమ కూడా మిస్ అవుతుంది. ప్రేమ మిస్ అయితే మనము మూడు లోకాలకు యజమానులు కాదు.రెండు లోకాలకు మాత్రమే యదార్ధ శక్తిని పొందుతాము. అంటే పరంధామం పాయింట్స్ మిస్ అవుతాము.

·        అందుకే మురళీ, మురళీ, మురళీ ఎందుకంటే ప్రతి రోజు నాలుగు సబీజెక్ట్స్ చదువుకోవటానికి దానికి మార్గాన్ని చెప్పుతున్నారు/ చూపిస్తున్నారు. అయినప్పటికీ ఒక్కక్క సారి మురళిని ఈ కారణం ఆ కారణం చెప్పుతూ ఉంటే ఎలా వింటాము. ఏది ఏమైనా సరే దానికి పరిష్కారం తయారు చేసుకొండి. (ఇయర్ ………. )

·        మురళీ మిస్ అయితే హృదయ పూర్వక ప్రేమ మిస్ అయినట్టే. మురళిని మిస్ చేయలేదు కానీ బాప్ దాదా యొక్క హృదయ పూర్వక ప్రేమను , వరదానాన్ని మిస్ చేశాను. మురళీ చదువుతూ కూడా పిల్లలు బాబా హృదయ పూర్వక ప్రేమను తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి. నేను మురళీ చదివేటప్పుడు బాబా హృదయ పూర్వక ప్రేమను పొందుతున్నానా లేదా ? అని.

పేజీ  25
·        కొంతమంది ఫోన్ లో వినాలి అని అనుకుంటారు. చదవలేరు వినటం మాత్రం తప్పని సరి. చదవలేని వారు వినవచ్చు. కానీ మురళీ లో హాజరును తప్పని సరిగా వేంచేయించుకోవాలి.
·        తండ్రి రోజు పరంధామం నుండి వస్తున్నారు. చాలా దూరం నుండి వస్తున్నారు. పిల్లల కోసం వస్తున్నారు. ఎలాగైతే  తండ్రి మురళిని పిల్లలకు చెప్పటం మిస్ ఎవ్వరో అలాగే పిల్లమైన మనము వినడం మిస్ అవ్వకూడదు.
·        కొంతమంది మధువనానికి వస్తారు కదా ! వచినప్పుడు ఫారం నింపండి. దానిలో వ్రాయండి ప్రతి రోజు మురళీ విన్నారా ? ఎన్ని సార్లు విన్నారు ? ఎన్ని సార్లు మిస్ అయ్యారు. సరేనా ! ఏ కారణం తోనూ మురళీ వినటం మిస్ అవ్వకూడదు.
·        ప్రతి రోజు భోజనం చేయడం అయితే మిస్ అవ్వరుగా ! అదే విధంగా ఇక్కడ కూడా భోజనం ఉంది. మీరు తీసుకునేది శరీరానికి సంభందించింది. నేను ఇచ్ఛేది ఆత్మకు భోజనము. మీకు నచ్చిందా ! భోజనం తినేటప్పుడు నియమం ఉంది . అలాగే ఇక్కడ కూడా నియమం ఉంది. బ్రాహ్మణులు ఎప్పుడు మురళిని వినేవారు , సేవ చేసేవారు. ( ఇయర్ ........................ )

వి..పి లను అటెన్షన్ లో వుంచుకోవాలి.
·       మన జోన్స్ అందరిని ఒక చోటుకు తీసుకురావాలి. అందరూ మనకు దగ్గరగా వుండాలి.దానిలో వి..పి లు ఎవరు అయితే వున్నారో వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారు రోజు మురళిని వినాలని అనుకుంటే ఫోన్స్ ద్వారా వరదనాన్ని , స్లోగన్ మరియు చివరిలో మురళి సారాంశాన్ని వినిపించాలి. విధంగా ఫోన్స్ లో వినిపిస్తూ కనెక్షన్స్ లో వుండాలి.


పేజీ - 26
కనెక్షన్స్ లో లేకపోతె ఒక నెలలోనే మర్చిపోతారు. మురళిని కూడా మర్చిపోతారు. కనెక్షన్స్ ఉంటే స్నేహ సంబంధాలు బాగా పెరుగుతాయి. ఎప్పుడు మధువనము వచ్చిన వారితో సంబంధాలు వుంటాయి. లేకపోతే మంకు వర్గీకరణ చేయటం కూడా కష్టం అవుతుంది. కనెక్షన్స్ ఉంటేనే వారిని లాగగలము. ( ఇయర్ ..........)

·       రోజు ఆశ్రమానికి రాకపోతే ఫోన్ చెయ్యండి. అక్కడ చెవిలో పెట్టుకునే ఫోన్ వుంది కదా దానితో చెయ్యండి.అక్కడ వున్న కనెక్షన్ టీచర్ చెప్పి సమయం ఫిక్స్ చేసుకొండి. సమయంలో ఫోన్ చేస్తాను అని. సమయంలో రోజు మహా వాక్యము, మురళి లో ఏమి చెప్తారో వరదానము, స్లోగన్ మరియు మొదలు ఏమి చెప్పారో అది వినండి. ఏమిటి ? బాప్ దాదా ఎందుకు చెప్పుతున్నారు. మీరు చేయకపోతే బాబా చేయిని మీరు వదిలేస్తారు.
·       రోజుల్లో జనాలు ఎలా వున్నారు.అంటే మాటలు చాల మార్చేస్తూ ఉంటారు.గవర్నమెంట్ మారుతుంది , మనుషులూ మారుతూ ఉంటారు. ఇందుకే అనేక మందితో అనేక మాటలు వస్తూ వుంటాయి. దానితో వ్యర్ధ మాటలు వస్తాయి. వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేయటానికి సమర్ధమైన సంకల్పాలు చేయాలి. వ్యర్ధాన్ని సమాప్తం చేయటానికి చాల బెస్ట్ సంకల్పం కావాలి .రోజు రోజు లో వరదానం వినాలి. వరదానంలో ఏది ఉంటే శ్రేష్ఠమైన సంకల్పాన్ని చెయ్యండి.ఎక్కడ అయితే వ్యర్ధము వుందో అక్కడే శ్రేష్ఠమైన సంకల్పాలు కావాలి. వ్యర్ధ మైన దాన్ని బెస్ట్ చేయటానికి మనకి ఇక్కడ వరదానము మరియు స్లోగన్ మరియు మొదటి వాక్యాలు మనస్సుని మార్చటానికి ఉపయోగించండి. Year …..

పేజీ 27
పిల్లలు క్లాస్ కు రావడానికి / రాలేకపోవడానికి ఏమి ఏమి కారణాలు చెప్పుతారు. దానికి ఉపాయాలు.
1 . నాకు సమయం కుదరటం లేదు : -
సమయం గురించి తీసుకుంటే రోజులో 24 గంటలు వుంటాయి. 4 గంటలు రోజులో నా కోసం ఇవ్వలేరా ? అని తండ్రి అడుగుతున్నారు. నాకు కూడా సంవత్సరాలు సంవత్సరాలు చెప్పే సమయం లేదు.
2 . ఇంటిలో చాల పని వుంది : -  
తండ్రిది చాల పెద్ద ఆత్మిక ఇల్లు, ఆ ఇంటిలో చాల మంది ఆత్మిక పిల్లలు ఉంటారు. చాల పని ఉంటుంది. మరి దాన్ని తండ్రి ఎలా చేస్తున్నారు. బాబా ఫై మీరు భారం వేస్తె తప్పకుండా మన పనులలో బాబా సహయోగం ఇస్తారు. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటే మీకు తప్పకుండా సమయం దొరుకుతుంది. మన ఇల్లు అంటే బాబా ఇల్లు. ఆఫీస్ అంటే లౌకిక ఇల్లు అని.
3 . పిల్లలు  చిన్న చిన్న వాళ్ళు :
 లేక ఒకరు ఎక్కువగా ఉంటే , వారి అందరి కోసం టైం తీస్తాము కదా! అదేవిధంగా బాబా కూడా మంకు ఒక పిల్ల వాడు, ఆ పిల్లవాడి సంభళన కోసం మనము సమయం 2  - 3  గంటలు ఇవ్వలేమా ?
4 . అతిధులు వచ్చారు : -
తండ్రి చెప్పుతున్నారు మీరు నాకు అతిధులు నేను మీ అతిధి లాగా మీ దగ్గరకు వచ్చాను.మన జన్మను ఎలా నియంత్రించాలో చెప్పటానికి వచ్చాను. ఎవరి ఎవరినో చూస్తూ నియంత్రిచుకునే విషయాలను మర్చిపోకూడదు. బాబా అతిధి అని మర్చిపోకండి. ఆయనే మనలను ఉన్నత స్థితికి తీసుకువెళ్లేది. మిగిలిన అతిధులను మర్చిపోయిన పరవాలేదు.
5 . గృహస్థ ధర్మంలో వున్నాము ఏమి చేయాలి ?
 బాబా కూడా ఆత్మిక గృహస్థ ధర్మంలోనే వున్నారు. మీరు చెప్పవచ్చు. నాకు చాల మంది పిల్లలు వున్నారు. బాబా చెప్పుతున్నారు నాకు లెక్క లేనంత మంది పిల్లలు వున్నారు.
6 . ఆరోగ్యం బాగోలేదు : -
 నేను సర్జన్ వచ్చాను . అనారోగ్యాన్ని దూరం చేయటానికి , ఈ జన్మలో దైతే ఇంత చేస్తానా ? 21 జన్మల వరుకు ఆరోగ్యంగా ఉండేలా మీ రోగాలను దూరం చేస్తాను. చేయటానికి వచ్చాను. ఈ జన్మ కోసం కాదు. మరి మీరు ఏమి చేయాలనీ అనుకుంటున్నారు.
పేజీ 28
7 . మిత్రుల దగ్గరకు / తెలిసిన వాళ్ళ దగ్గరకి వెళ్ళాలి :-
ఇక్కడ వాళ్ళు మీకు ఒక్క జన్మకు మాత్రమే, మిత్రులు తెలిసిన వాళ్ళు కూడా. కానీ నేను ఎప్పటికి బంధువుని. అన్ని సంభందాలు నాతోనే వున్నాయి . మీకు ఏ సమస్య వచ్చిన నేను వచ్చేస్తాను సహాయం చేయడానికి మీకు వున్నా అన్ని సంబంధాలకు సుఖాని ఇచ్చేది నేను. స్వచ్ఛమైన తండ్రిని , మీ గురువును , మీ టీచర్ ని , మీ స్నేహితుడని , మీ పుత్రుడను , మీ తల్లిని అని సంబంధాలు నాతోనే అన్న విషయాన్ని మర్చిపోకండి.

8 . నిద్ర వస్తుంది :-
అర్ధ కల్పం మొత్తం నిద్రలోనే వున్నారు. నేను మిమ్మలను మేల్కొల్పటానికి వచ్చాను . నిద్రను జయించక పోతే మీ ఆత్మలు ఆత్మిక స్థితిని ఎలా పొందుతాయి ?నిద్ర పోతున్న మీకు జ్ఙానామృతాన్నీ వినిపించి మేల్కొల్పటానికి తండ్రి వచ్చారు. తండ్రి వచ్చి లేపిన తరువాత తొందర తొందరగా చదువుకోవాలి. టీచర్ లేకుండా ఎలా చదువుకోగలరు. అందుకే మీకు టీచర్ గా వచ్చాను. మీరు అందరూ విశ్వానికి జ్యోతిని ఇచ్చే పిల్లలు. అందరిని నిద్ర లేపే వారు. కుంభకర్ణుని కూడా నిద్ర ఉంచి లేపి జ్ఙానామృతాన్నీ త్రాగించగలరు. నిద్రలేపుతారుగా ?
9 . ఎప్పుడు అలారం మ్రోగిందో తెలియ లేదు :-
అదేవిధం గా అంతిమ సమయంలో వినాశన సమయంలో అలారం ఎప్పుడు మ్రోగింది అని అంటారా ?అప్పుడు పశ్చత్తాపపడతారు కళ్లలోనుంచి నీళ్లు వస్తాయి. అందుకే అంతిమ సమయంలో ఏమి సంపాదించుకోలేము అని గ్రహించాలి. తమోప్రధాన స్థితి లో నిద్ర పోతే అంతిమ సమయం ఎప్పుడు వచ్చేసిందో కూడా మనకు తెలియదు.
10 . వింటూనే వున్నారు :-
మీరు వినేదానికి మాయ అండర్ వెయిట్ చేసి లేపేస్తోంది . మాయ ఎవరు అయితే తండ్రిని స్మృతి ని చేయరో వారిపై మాయ పంజా విసురుతుంది. మిమల్ని కింద పడేసి మాయమైపోతుంది. అందుకే తండ్రి తోడులో ప్రతి కార్యము చేయాలి.
11 . ఇల్లు చాల దూరము :-
తండ్రి చెప్పుతున్నారు నేను మీకోసం ఎంత దూరం నుంచి వస్తున్నాను. ఎంత దూరం నుంచి వస్తే అంత పదవికి కావలసిన సంపాదన దొరుకుతుంది.
12 . రావటానికి వెళ్ళటానికి తీసుకు వెళ్ళేవాళ్ళు లేరు :-
ఈ మాటతో మన జీవితాన్ని నాశనము చేసుకుంటున్నాము. బాబా సంవత్సర నుండి వెళ్లి రావటం లేదా ? ప్రతి రోజు రాక పొతే వారానికి ఒక్కసారి వెళ్ళవచ్చు . మీకు వాహనం దొరికితే రోజు వెళ్ళండి. మీ పురుషార్థం మీరు చేసుకొండి. వాహనం లేక పోయిన నడిచి వస్తే ఆ పురుషార్థం ఎక్కడికి పోదు.


పేజీ 29
13 . పరిస్థితులు వలన రాలేక పోయాను :-
రాలేని పరిస్థితులను కలగ చేసుకోకండి.మన పనులతో పరిస్థితులను మార్చుకోవచ్చు.మనము శ్రేష్ఠ కర్మలు చేస్తుంటే వాళ్ళు తప్పకుండా వారి పురుషార్థం కోసం క్లాస్ కి అటెండ్ అవ్వటం అవశ్యము.
14 . బంధనాలు వున్నాయి :-
తండ్రి అంటున్నారు నేను కూడా ఈ డ్రామా లో బంధింపబడి వున్నాను. అయినా నేను సమయానికి వస్తున్నాను. మిమ్మల్ని భంధనలా నుండి విముక్తులను చేయటానికే వచ్చాను. లేకపోతే మీమల్ని ఎలా ముక్తులను చేయగలను. ధైర్యము ఉంటే తండ్రి సహయోగం మీకే లభిస్తుంది.
15 . ఆ అక్కయ్య క్లాస్ నేను చెయ్యను :
ఎక్కడ ఆమె క్లాస్ చేస్తుందో అది బాబా చేయిస్తున్నారు. ఎవరైనా కానీ క్లాస్ చెప్పని, మీ నియమాలతో దానిని ఉల్లంగించకూడదు. గుర్తువుంచుకొండి మన టీచర్ ఆత్మిక తండ్రి అని ! అక్కయ్యలు నిమిత్తము మాత్రమే !
16 మురళి అంత ఒక్కటే కదా ! మేము ఇంటి నుండి కూడా చదువుకుంటాము :-
విద్యార్థి ఎప్పుడు కూడా ఇంటిలో కూర్చొని చదువు కుంటాను అని చెప్పారు.అందరితో కలసి వింటే ఆ మజా వేరు. సంఘటన శక్తి లభిస్తుంది.

17 . ఏమి చేయాలి పొట్ట నింపుకోవటానికి చెయ్యక తప్పదు :
ఈ జన్మ పొట్ట నింపుకోవటం కోసం ఆలోచిస్తున్నారు. కానీ ఎక్కడ 21  జన్మల సంపాదన లభిస్తుంది . అని ఆలోచించారా ? చాల చాల ఆసక్తి ఉండదా ? దానికి సమయం తీయాలి అని అనిపించదా ? పొట్టకి 2  రోటీలు సరిపోతాయి. కానీ ఆత్మకు ?

18 . నాకు తోడు లేరు ?
ఆత్మ ఒంటరిగానే జన్మ తీసుకుంది. మరణంతో ఒంటరిగానే వెళ్ళిపోతుంది.తండ్రి మన జతలో ఎప్పటికి ఉంటారు. ఏ నిమిషంలోనూ, జతలోనూ వదలరు. శివ బాబా మన అందరితో సహయోగంలో ఉంటారు. అందుకు రావటానికి వెళ్ళటానికి తోడు వెతుకోవాల్సిన ఆవరసం లేదు.
19 . ఏమి చేయాలి , వర్షం పడింది :
కాలాలు మారుతూనే వుంటాయి. ప్రకృతిని  ఆధీనంలో వుంచుకోవాలి. లేకపోతే ప్రకృతి వశంలోకి వెళ్ళిపోతారు. మన తండ్రి ఎప్పుడు ఎవరికి వశం చేయరు. తండ్రి జ్ఙానం అనే వర్షాన్ని కురిపిస్తున్నారు అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

పేజీ ౩౦ :
20 . అలసిపోయాను :-
శరీరం పని చేసే ముందు తేలిపోతుంది అలిసిపోయాము అని.మన తండ్రి మన జన్మల అలసటను దూరం చేయటానికి వచ్చారు. ఈ అవకాశాన్ని దూరం చేసుకోకపోతే మన అలసటను ఎలా దూరం చేసుకోగలం.పని చేసుకో బాగా అలిసిపోతే మరుసటి రోజు క్లాస్ కి రా!లేకపోతే ఎక్కువ అలసిపోకుండా పని చెయ్యి మరుసటి రోజు క్లాస్ కి వెళ్లాలని.
21 .ఒకరితో నాకు బాగా అనిపించదు :-
తండ్రి అంటున్నారు దేహంలో వున్న  అన్ని సంబంధాలను మర్చిపో! మనకు ఇప్పుడు వున్న సంబంధాలను చూడాలని అనుకుంటున్నారా లేక పెద్ద పెద్ద సంబంధాలను చూడాలని అనుకుంటున్నారా ! వారు అందరూ మీ చేతులు వదిలేస్తారు. కాని తండ్రి నా చెయ్యి ఎప్పుడు వదలరు. అందుకే ఎవరి గురించి ఆలోచించకూడదు.

22. ఇరుగు - పొరుగు చెప్పారు :-
మీకు సిగ్గుగా అనిపించటం లేదా ఈ పనులు చేయటం లో , మేము చాలా మంచి కార్యాలు చేస్తున్నాము. సత్యమైన మార్గంలో నడవటానికి ఎందుకు భయము ?మేము శివ బాబా ని చూడాలని అనుకుంటున్నాము. వారు మమ్మల్ని స్వర్గానికి రాజులుగా చేస్తారు. ఎలా ఎదో ఒక్కటి చెప్పండి. భగవంతుడు తిట్టి నా కానీ మేము తండ్రిని వదిలి ఉండలేము అని.
23 . రాత్రి లేటు అయింది పొడుకోవటానికి , అందుకే కళ్ళు తెరవలేక పోయాము అమృత వేళలో :-
ఎలాగైతే వ్యాపారస్తుడు లేటుగా పొడుకుని మళ్ళి సంపాదించాలనే ఉత్సాహం తో ఉదయము అతని కళ్ళు తెరుచుకుంటాయో అదే విధంగా మీ సంపాదన కోసం మీ కళ్ళు తెరుచుకోవాలి.తండ్రి స్మృతిలో నిద్రపోతే తండ్రి సహాయం లభిస్తుంది.
24. హృదయంలో ఉంటుంది చెయ్యాలని కానీ చెయ్యలేక పోతున్నాను :
తండ్రి తో ఉంటూ ఇలా అనకూడదు. క్లాస్ కి వచ్చే హృదయం వుండి క్లాస్ కి అటెండ్ అయితే తండ్రి కూడా మీకు బాదుషా పదవి ఇవ్వటానికి హృదయం ఉంటుంది.
25. ఇంటిలో పని వాళ్ళు రాలేదు:-
పని ప్రతి రోజు పూర్తీ రోజు అంతటిలో ఉంటుంది. తండ్రి చెప్పుతున్నారు నేను కూడా వినయ పూర్వకమైన సేవ చేస్తాను. తండ్రి స్మృతి లో పని తొందరగా అయిపోతుంది.
పేజీ 31 :

26. ఏమి చేయాలి పెళ్ళికి వెళ్ళాము :-
చాలా పెళ్లిళ్లు ఉదయం జరుగుతాయి . మీరు పెళ్లిళ్లకు వెళ్ళాలి అంటే ఉదయం క్లాస్ కి వచ్చి తరువాత వెళ్ళవచ్చు. పెళ్ళికి వెళ్ళాలి అనుకుంటే , ఇక్కడ తండ్రితో వున్న పెళ్ళికి సెలవు ఇచ్చి వెళ్ళండి.
27. ఈ రోజు పండగ ఏమి చెయ్యాలి ?
అన్నిటి కంటే పెద్ద పండుగ ఇప్పుడు నడుస్తోంది. దానిని వదిలి ఏ పండుగ జరుపుకుంటున్నారు.
28. నేను మర్చిపోతే నాకు సిగ్గుగా అనిపిస్తోంది :-
మరచిపోవడం మానవుల సహజం, మరచిపోవటం అన్న సాధనాన్ని వదిలేయి. యోగిగా క్లాస్ కి రా. ఒక వేళ క్లాస్ కు రాకపోతే నీ నుంచి మర్చిపోతున్నాను అన్నది ఎలా పోతుంది.
29. మోసం సరి కాదు :
మోసం చేయకుండా , చేసుకోకుండా ఉండటానికి సాధనం క్లాసుకు రావటము . అందుకే తండ్రి క్లాస్ కు తప్పకుండా రావాలి.

ఓం శాంతి !

సారాంశము : -
బాబా క్లాస్ మనము ఎక్కడ చేసిన మొదటిగా రావలసిన అనుభవం నాకు డైరెక్ట్ గా బాప్ దాదా చదువు చెప్పుతున్నారు. మధువనంలో నేను క్లాస్ చేస్తున్నాను. నేను ఎప్పుడు వరదానము, స్లోగన్ , ధారణ పాయింట్స్ గట్టిగా చదువుతున్నానో, అప్పుడు కూడా అనుభవం చేసుకోవాలి. బాబా నా ద్వారా కోటి ఆత్మలకు మురళిని వినిపిస్తున్నారు. అంటే ఆత్మల విశ్వకళ్యాణం కోసం నన్ను ఉపయోగించుకున్నారు అన్న ఆనందం లో కి వెళ్ళిపోవాలి.బాబా తోడు తప్ప వేరు ఎవ్వరు తోడు అవసరం లేదు . నా బాబా నా బాబా అనే మంత్రాన్ని ఇక్కడ తండ్రి గురు స్థానంలో ఉపదేశించారు. మురళి మనము ఎప్పుడు మిస్ అవ్వకూడదు, పరమాత్మ ఇస్తున్న జ్ఙాన గంగ లో స్నానం చేసి మన కర్మ ఫలాల మురికిని వదిలించుకుని వికర్మ జీతులుగా , నిరాకరి , నిర్వికారి , నిరహంకారి , బాప్ సమన్ సేవ ధారి ఆత్మలుగా మన స్థితిని తయారు చేసుకోవాలి.

జ్ఙాన భోజనం చేయాలి. జ్ఙాన భోజనం చేయటం అంటే మనలో వున్న వికారాలను తొలిగించుకోవటానికి సాధనాలు అయిన అష్ట శక్తులను , అనాది గుణాలను , 16 కళలను తిరిగి ఆత్మలో నింపుకోవటం. 4 సబ్జక్ట్స్ ప్రతి రోజు సాధన చేయాలి. ఏది చేసిన బాబా తోడులో చేయాలి. అంతే కాదు నేను నిమిత్తము అని అనుకోవాలి. ప్రతి ఒక్కరిని ఆత్మిక దృష్టితో చూడాలి. బ్రాహ్మణులూ అనగానే మన ముఖము లో ప్రసన్నత కనిపించాలి.అందరిని బాప్ సమానంగా ప్రేమించాలి. ఎవరి దేహం చూడకూడదు . ఆత్మిక స్థితిలో ఉండడానికి ప్రయత్నము చేయాలి. అందరితో స్నేహముగా వుండాలి. ఎవరిని ద్వేషించకూడదు. బాబా మురళి చెప్పుతున్నది ఒక్కరికి ఒక్కరు సహయోగాన్ని ఇచ్చుకుంటూ సేవను ముందుకు తీసుకు వెళ్ళమని .అందరూ కలిసి కట్టుగా బాబా పిల్లలు గా సేవ చేయాలి. ఎవరి టాలెంట్ వారిది . ఎవరి సేవ పాత్ర వారిది డ్రామా లో. నేను రోజు మురళి వినేశాను, చదివేసాను అంటే సరిపోదు. నేను ఎంత వరుకు నా ఆత్మలో ప్రేమను , పవిత్రతను , శాంతి ని , సుఖాన్ని , ఆనందాన్ని ,జ్ఙానాన్ని నింపుకుంటూ అందరికి పంచుతున్నాను అని చెక్ చేసుకోవాలి . మీరు పరివారం లో ఎవరి పైనా కోపాన్ని చూపించకూడదు. బాబా మనలను ఎంతగా ప్రేమిస్తూ మనలో పరివర్తన  తెస్తున్నారో అలాగే మీకు నచ్చని వారిలో కూడా ప్రేమతో స్వయం పరివర్తన వచ్చేలా చేసి బాబా పిల్లలుగా చేయాలి .అందరము విశ్వ కళ్యాణి కారులుగా మారిపోవాలి. ఎక్కువగా లైట్ మైట్ హౌస్ స్థితిని , సిద్ది స్వరూప స్థితిని , నిశ్చల స్థితిని ధారణ చేస్తూ మాయ జీతులుగా అవ్వాలి.నరుడు నుంచి నారాయణుడు  గా, నారి నుంచి లక్ష్మి గా మారటమే మన లక్ష్యం దానిని మర్చి పోవద్దు  . సత్య  యుగ స్థాపనకు కలిసి మెలసి కృషి చేద్దాం . సమయం ఎంతో లేదు. మన యుద్ధం పంచవికారాల పైన దాని పై సాధన చేయటానికే   మురళి మహావాక్యాలు. శ్రీమతము అనగా శ్రేష్ఠ మైన బుద్దిని కలిగి వుండడము. తండ్రి పిల్లలుగా మనము తండ్రిని ప్రత్యక్షము చేయాలి. ప్రత్యక్షత అంటే మన నడవడికతో స్వయం శివ బాబా కనపడాలి.  బాబా కు ట్రస్టీలుగా ఉంటూ సేవ చేయాలి. తమోప్రధాన స్థితి నుంచి సతో ప్రధానముగా తయారుచేసుకోవటానికి బాబా రోజు చదివిస్తున్నారు .
ఓం శాంతి ! ఓం శాంతి ! ఓం శాంతి !



ఏమి అయిన అడగాలని అనుకుంటే : -
స్పార్క్ - స్పిరిట్యుయల్ అప్లికేషన్స్ రీసెర్చ్ సెంటర్
బెహతర్ విశ్వ నిర్మాణ్ అకాడమీ ,
జ్ఙాన్ సరోవర్ , అబూ పర్వతము -307501
రాజస్థాన్ , ఇండియా
మొబైల్ : +91941003497 , +919414082607
ల్యాండ్ లైన్ :02974 -238951
- మెయిల్ :bksparc@gmail.com
sparc@bkivv.org








No comments: