Sunday, July 26, 2020

నేను నా పురుషార్ధం కోసం గుర్తు పెట్టుకున్న విషయాలను వ్రాస్తున్నాను . దీనితో మన పురుషార్ధంను ముందుకు తీసుకువెళ్లవచ్చు .


ఈ నెల మురళి బుక్ 196 పేజీలో  మనకు కూడా నచ్చిన పాయింట్స్ని పంపమన్నారు . నేను నా పురుషార్ధం కోసం గుర్తు పెట్టుకున్న విషయాలను వ్రాస్తున్నాను . దీనితో మన పురుషార్ధంను ముందుకు తీసుకువెళ్లవచ్చు .
1.      సదా సాక్షి స్థితిని ధారణ చెయ్యాలి . సాక్షి అనగానే మనకు ఈ రెండు అక్షరాలలో ధర్మ రహస్యము మరియు ఆనంద రహస్యము దాగి వున్నాయి అని గుర్తుకు  రావాలి .
2.      నేను నిమిత్తం అనే భావనయే  మన పురుషార్ధంను ముందుకు తీసుకువెళ్ళుతుంది.
3.      నేను ఆత్మను  అని ఎక్కువ సార్లు వ్రాసుకోవడం చేసుకుoటే మనము తప్పక అత్మిక స్థితిని పొందగలము . బ్రహ్మ బాబా కూడా మొదటిలో నేను ఆత్మను అని వ్రాసుకునేవారు .
4.      ఫాలో ఫాదర్ అనే దానిని మరిచిపోకూడదు .
5.      నేను – నా బాబా అనే మాట తప్ప వేరే ఏ ఇతర మాటలను మన బుద్ధిలో వుంచుకోకూడదు .
6.      శ్రీమతంను అనుసరించాలి . శ్రేష్ఠమైన బుధ్ధిని కలిగివుండటం . సాకారములో నిమిత్తముగా మనకు వున్న టీచర్ లో ఎలాగా అయితే మామ్మ నిరాకారుడను చుసేవారో, అలాగే మనము కూడా తయారు అవ్వటానికి ప్రయత్నo చెయ్యాలి .
7.      మనసా సేవ మరియు మన స్థితిని పెంచుకునే దాని పై మన ధ్యాసను కేంద్రికృతము చెయ్యాలి .
8.      డ్రామాలో అలసిపోయి ఆగిపోయే వాళ్ళు కనిపిస్తారు , వారిని చూసి మనము ఆగిపోకూడదు. కొంత మంది మనలను దాటుకుని వెళ్ళిపోవటం మనకు కనబడుతుంది . వారిని చూసి కూడా బాధ పడకూడదు. స్వచింతనతో మెట్టు ఎక్కుతూ వెళ్లిపోవాలి . పరచింతన చేస్తూ మెట్టు దిగకూడదు .
9.      సమయం దగ్గరకు వచ్చేసింది . మన జీవిత లక్ష్యాన్ని ఇంటికి తిరిగి వెళ్ళలి అన్న దాని పై వుంచాలి .
10.   ఎప్పుడు ఎవర్ రెడీగా వుండాలి .
11.   ఎవరి పాత్ర వారిది . ఒకరి పాత్ర ఒకరు పోషించలేరు అన్న విషయాన్ని గ్రహించుకుంటు డ్రామా అనే డాలును, జ్ఞాన – యోగం అనే ఖడ్గమును  చేతపట్టుకుని ముందుకు సాగాలి .
12.    తండ్రి ఫై నిశ్చయబుద్ధితో వుండాలి .
13.   ఏకరస స్థితి మరియు ఏకాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి .
14.   ధనము ఎక్కువగా వస్తూ  వుంటే మాయ వచ్చేస్తుంది . దాని వలన తండ్రి వారసత్వమును పొందలేము . అందుకే వున్న దానిలో తృప్తిని పొందటానికి ప్రయత్నo చేయండి .వినాశి ధనము గురించి పరుగులు తీయకూడదు .  అవినాశి జ్ఞాన సంపాదన కోసము పరుగులు తీయ్యలి .
15.   నేను అనేది ఏమి లేదు . నేను అనేది బిందువు , పరమాత్మ బిందువే , డ్రామా కూడా బిందువే అనే సత్యాన్ని సదా మన బుద్ధిలో దృఢంగా కూర్చో పెట్టుకోవాలి.
16.   ప్రకృతి ఆటను రెందు మాటలుగా గుర్తు పెట్టుకోవాలి . 1 ఒకటి బిందువుగా 2. రెండవది లైట్ అనగా జ్యోతిగా
17.   బాబా ఎవరికీ ఇచ్చిన హోం వర్క్ వారు పూర్తి చెయ్యడానికి ధ్యాస వుంచండి . వాటిని పూర్తి చెయ్యండి . పక్క వారి హోం వర్క్ గురించి ఆలోచించకండి . మనది మనము పూర్తి చేసుకోవాలి .
18.   బృహిటి సింహానాధికారిగా శరీరము నుంచి వేరుగా అయ్యే అశరీర స్థితిని అభ్యాసం చెయ్యండి .
19.   మాయాజీత్ స్వరూపాన్ని ధారణ లో ఎక్కువగా చెయ్యాలి  .
20.   నేను శరీరాన్ని కాదు . చైతన్యవంతమైన శక్తిని అవినాశి ఆత్మను అన్న దానిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆశరిర స్థితిని అభ్యాసం చెయ్యాలి .
21.   ఆత్మను సంతుష్టముగా  చేసుకోవాలి. అది జరగక పోతే యోగము కుదరదు అని తెలుసుకోండి .సదా స్వయాన్ని సంతుష్ట ఆత్మగా అనుభవము చేయ్యoడి. జ్ఞాని – యోగీ ఆత్మల గుర్తు సంతుష్టత అని మర్చిపోకండి .
22.   నేనే లోక వినాశకుడను / విశ్వ కళ్యాణ కారి ఆత్మను అన్న స్థితిలో స్థితమై వుండాలి .
23.   మన దృషి ద్వారా అందరికి పరమాత్మ యొక్క సందేశం అందే విధముగా ధారణ చేయటం .
24.   నా సర్వ సంభందములను శివ పరమాత్మతోనే జోడించాలి .
25.   నథింగ్ న్యూ అని గ్రహించుకుని వహ్ డ్రామా , వహ్హ బాబా , వహ్హ నేను , వహ్హ నా భాగ్యము అనే దానిని ప్రతి సంఘటనలో గుర్తుపెట్టు కోవాలి .
26.   అచోల్ ఆడోల్ స్థితినిలో స్థితులై వుండాలి .
27.   తపస్యా సంవత్సరం అనగా తీవ్ర పురుషార్ధం చెయ్యాలి . తపస్సు అంటే సంతుష్టతకు రూపము . దృష్టిలో, వృత్తిలో  , ముఖంలో నడవడికలో కనిపించాలి . అలా మనము తయారు అయ్యామా లేదా అని చెక్ చేసుకోవాలి . సంతుష్ట మని అనగా మచ్చ లేని మణి అని అర్ధం . అందరమూ మన పురుషార్ధంను సంతుష్ట మణిగా అయ్యేందుకు కొనసాగించాలి.
28.   కంట్రోలింగ్ పవర్ ను , రూలింగ్ పవర్ తగ్గకుండా వుండాలి అంటే 3 శబ్దంములు అయిన ఏమిటి ? ఎందుకు ? కావాలి అనే వాటిని సమాప్తం చేసుకోవాలి అన్న విషయాన్ని గ్రహించుకోవాలి .
29.   సంతుష్టతలో స్వచ్చత ఎంత వుంది అని రోజులో చెక్ చేసుకోవాలి . ఇక్కడ 3 ప్రాకారాల ఆత్మల సంభందము గురించి ఆలోచించాలి . 1 ) బ్రహ్మణ పరివరములోని ఆత్మలు 2 ) మీ వద్దకు వచ్చే జిజ్ఞాసు ఆత్మలు 3. ) లౌకిక పరివారములోని ఆత్మలు
30.   సదా స్వయాన్ని నిశ్చయ బుద్ధి, విజయి ఆత్మగా అనుభవము చెయ్యటం . మూడు నిశ్చయాలు జత జత లో వుండేటట్టు చూసుకోవాలి అవి తండ్రి , మీరు , డ్రామా . ఎప్పుడు అయితే నిశ్చయ బుద్ధితో వుంటారో వారే విజయీ ఆత్మలు .
31.   బాబా పిల్లలకు ఎప్పుడు బోధిస్తూన్న నిరాకారి, నిర్వికారి , నిరహంకారి స్థితిలో స్థితము అవ్వటానికి ప్రయత్నo చెయ్యాలి .
32.   బ్రహ్మ బాబా తన ప్రతి పిల్లల ముఖము ఫై చూడాలని అవుకుంటున్న రెండు విషయాలను మనము ధారణ సదా చెయ్యాలి .అవి ఒకటి – సదా ఆత్మిక చిరునవ్వు , రెండవది – నోటి ద్వారా సదా మధురమయిన మాటలు వినాలని అనుకుంటున్నారు .
33.   సర్వుల పై సదా శుభ భావన , శుభ చింతన , శుభ కామననే వుంచటం వలన పురుషార్ధం ముందుకు సాగుతుంది .
34.   మన ఆత్మ కోల్పోయిన అష్ట శక్తులను ,దివ్య గుణాలను , పదహారు కళలను నింపుకోవటానికి ప్రయత్నo చేయటం వలన .
35.   జ్వాలాముఖి స్వరూపంలో నేను అనే దానిని కూడా ఆహుతి చేసుకోవడానికి ప్రయత్నం చేయటము .
36.   రోజులో ఎక్కువ సమయం అంతర్ముఖంగా వుండటానికి ప్రయత్నం చేయటం .
37.   బాబా పిల్లలకు మెడలో జ్ఞాన , గుణాల మాలను ఏదయితే వేసారో దానిని మాత్రమే సదా ధరించి వుండాలి . ఏ ఇతర మాలను తిప్ప రాదు .
38.    స్మృతిలో కూర్చున్నప్పుడు సైలెన్స్ ద్వారా శక్తి లభిస్తే వున్నది అని అనుభవము అవుతుంది .
39.   యోగి జీవితంలో వున్న మూడు సర్టిఫికెట్లు మనము పొందామా లేదా అని చెక్ చేసుకోవాలి . 1. స్వయం సంతుష్టత 2. తండ్రి సంతుష్టత 3. లౌకిక – అలోకిక్ పరివారముతో సంతుష్టత. ఈ మూడు సర్టిఫికెట్ ఎప్పుడు ప్రాప్తిని పొందుతామో వారిని సంతుష్ట మణులని అంటారు .
40.   వ్యక్త రూపంలో వుంటూ  అవ్యక్త స్థితిని ధారణ చెయ్యాలి .
41.   ప్రత్యక్ష ఫలాన్ని భుజించటం అంటే మన మనస్సు , బుద్ధి ద్వారా సదా ఆరోగ్యంగా వుండటం . ఎవర్ హెల్త్ , ఎవర్ వెల్త్ , ఎవర్ హ్యాపీ స్థితి పొందటం .

No comments: