Wednesday, July 29, 2020

ఎపిసోడ్ :10 " ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "


ఎపిసోడ్ :10
ఆత్మిక దృష్టితో సూక్ష్మ స్థూల వైద్య రహస్యము "
ప్రశాంతమైన వాతావరణము లో నా మనస్సు శాంతి ని స్వీకరిస్తుంది . నేను తెలియకుండానే నా జననము గురించి ఆలోచిoచటము మొదలు పెట్టాను . నేను ఎక్కడ నుంచి వచ్చాను ఈ భూమి మీదకు ? ఎలా వచ్చాను ? ఇక్కడ చాల జాగ్రత్తగా వినండి . నాతో పాటు మీరు మీ ఆలోచనను మీ గురించి మీరు తెలుసుకోవటములో నిమగ్నము  చేయండి . మనము అందరము వాడుక భాషలో ముల్లోకములు వున్నవి అని మాట్లాడుకుంటాము . వాటి గురించి ఇక్కడ వివరముగా చూద్దాం.
ముల్లోకములు మూడు :
1.     సాకార లోకము ( ప్రస్తుతం మనము నివసిస్తున్న భూలోకము )
2.    సూక్ష్మ లోకము
3.    బ్రహ్మ లోకము / శాంతి ధామము ( ఆత్మల ఇల్లు – పరంధామము )
నేను మీకు ముందు ముందు వీటి గురించి తెలియజేస్తాను . ఇప్పుడు మన ఆత్మ జననము గురించి తెలుసుకుందాము . ఆత్మల ఇల్లు అయిన పరంధామము నుంచి మన ఆత్మ జన్మ తిసుకునే సమయాను సారముగా భూలోకానికి జన్మ తీసుకోవడానికి వస్తాయి . నేను ఒక అనాథను అంటూ జీవి పుట్టుక ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాడు . ఎప్పుడు అయితే జన్మ తీసుకోవడానికి శరీరములోకి ప్రవేస్తాడో , ఆ సమయములో తనకు అంటు ఎవ్వరు వుండరు ? తానూ ఒక అనాధగానే జన్మను తీసుకుంటాడు . ఎప్పడు అయితే జన్మను తీసుకుంటాడో తనకు తెలియకుండానే బంధనాలు అనే “ పద్మవ్యూహం”  లో చిక్కుకుపోతాడు . ఎప్పడు అయితే బంధనాలలో చిక్కుకుంటాడో అప్పుడు తన ఉనికిని మరిచిపోతాడు అంటే తాను ఒక ఆత్మను మరియు తన స్వధర్మం అయిన శాంతిని . అలౌకిక తండ్రి అయిన పరమాత్మను . తన అలౌకిక ఇల్లు అయిన పరంధామమును మర్చిపోతారు . ఎప్పుడు అయితే ఆత్మ తన పాత్రను అభినయించటానికి వస్తుందో అప్పుడు తెలియకుండానే జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఆత్మలో శక్తిని కోల్పోతాడు . అశాంతి లోకి వెళ్ళిపోతాడు . జన్మ తీసుకోవటo అంటే తన కర్మలను అనుభవించటానికి శరీరం అనే రధాన్ని ఏర్పాటు చేసుకోవడము  అని మనకు తెలిసిన విషయమే అని నేను అనుకుంటున్నాను . ఇక్కడ నాకు బాగా అర్ధం అయిన విషయము ఏమిటి అంటే జన్మ తీసుకుని రావటం తో నా అలౌకిక తండ్రి అయిన పరమాత్మని , నా అలౌకిక ఇల్లు  అయిన పరంధామమును మర్చిపోయాను . ఎప్పుడు అయితే ఈ సత్యాన్ని మర్చిపోయి నా ఆత్మకు రధముగా పంచతత్వాలతో నిర్మాణము చేయబడిన శరీరాన్ని నిమిత్తంగా చేసుకుంటానో , నాకు తెలియ కుండానే జన్మ – జన్మకు ఆత్మ శక్తిని కోల్పోతూ పంచవికారాలు అనే మాయలో చిక్కుకుపోతుంది.
మీకు అందరికి పరంధామము అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది అని అనుకుంటున్నాను . అసలు పరంధామము అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాము . పరంధామము అంటే మన అలౌకిక తండ్రి మరియు మన ఆత్మల అందరి ఇల్లు . పరంధామమును నేను అనుభూతి చెందాలని అని అనుకుంటున్నాను . మరి మీరు ? మీకు ఏమి అని అనిపిస్తుంది ?. ఎవరు అయితే ఆత్మల ఇల్లు గురించి తెలుసుకోవాలని అనుకుంటూ వున్నారో వారు అందరూ , నాతో కలిసి బిందు స్వరూపాన్ని గుర్తుచేసుకోoడి. “ నేను ఆత్మను ““ నేను ఆత్మను ““ నేను ఆత్మను “ నా స్వరూపము బిందు స్వరూపము . నేను చైతన్యవంతమైన శక్తిని . నిరాకారి , నిర్వికారి , నిరహంకారి ఆత్మను . నేను ఎప్పుడు అయితే నేను ఆత్మను అని అనుకుంటునానో , నా శరీరానికి అతీతంగా వెళ్ళుతూ వున్నాను . ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళుతున్నాను . దూరంగా చాల దూరముగా వెళ్ళుతున్నాను . నేను ఎక్కడకి వెళ్ళుతున్నను చాల చాల దూరముగా నా అలౌకిక తండ్రిని వెత్తుకుంటూ నా తండ్రి అయిన పరమాత్మను వెత్తుకుంటు మన ఆత్మల ఇల్లు అయిన పరంధామమును చేరుకుంటునాను.
      నేను దివ్యమైన , అనాది స్వరూపము అయిన బిందు స్వరూపాన్ని స్వీకరిస్తూ .. మన ఆత్మల ఇంటికి చేరుకున్నాను . అక్కడ శాంతి తప్ప ఏమి లేదు . ఏ సంకల్పము కానీ , ధ్వని కానీ లేదు . ప్రకాశమే , ప్రకాశం . బిందు స్వరూపములో మన అలౌకిక తండ్రిని జ్యోతిర్బిoదు స్వరూపములో ఆయన ఇస్తున్న ప్రకాశాన్ని అనుభూతి చెందుతూ పరమాత్మ కింద నేను ఆత్మల బిందు స్వరూపములో వున్న ప్రకాశ కూటమిలో ఒకరిగా చేరిపోయాను . ఎప్పుడు అయితే ప్రకాశ కూటమిలో చేరిపోయనో , ఆ క్షణం నేను అన్న మాట కూడా సమాప్తం అయిపోయింది . లౌకిక బంధనాల నుంచి నాకు ముక్తి కలిగింది . అలౌకిక తండ్రి ఇల్లు అయిన శాంతి ధామములో బిందు స్వరూపమునై నిశ్చింతగా పరమాత్మ పోలికతో ఆయన బిడ్డగా శాంతి స్థితిలో ప్రకాశాన్ని వేదజల్లుతున్నాను అన్న అనుభూతిని పొందుతున్నాను . ఇప్పుడు నా కర్మేద్రియములో ఒక్కటి అయిన నా కళ్ళ ముందు శాంతి మరియు ప్రశాముతో నిండిన శాంతి ధామము మాత్రమే కనబడుతుంది . అత్యద్బుతమైన దృశ్యము . పరమాత్మ ఆయన యొక్క ప్రకాశమును పిల్లలమైన మన ఆత్మల వైపు ప్రసరింప చేస్తున్నారు . ఆ ప్రకాశములో ఆత్మలమైన మనము అందరమూ పరమాత్మ కింద బిందు స్వరూపములో కూటమిగా చేరుకుని ప్రకాశము తో వున్నాము . ఈ సుందరమైన దృశ్యము నాకు ఎలా అనిపిస్తుంది అంటే లింగాకారంలో పరమాత్మ – ఆత్మల ప్రకాశముతో నిండిన కూటమిగా వుంది .నా ఆత్మకు ఎదో తెలియని ఆనందము కలుగుతుంది . మరి మీకు ? పరమాత్మ ప్రకాశాన్ని చూస్తూనే వుండిపోవాలని వుంది . మరి మీకు ఏమి అనిపిస్తుంది ? పరమాత్మ – నేను ఇక్కడ ఇంక ఎవ్వరు లేరు . నా సర్వ సంభందములు అన్ని పరమాత్మనే జోడింప బడ్డాయి. నా భాద్యత పూర్తిగా అలౌకిక తండ్రి అయిన పరమాత్మదే అయిపోయింది .   
మిగిలిన విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం ! ఒక ధారణ పాయింట్ ని మీకు అందజేస్తున్నాను .నచ్చిన వారు ప్రయత్నం చేయవచ్చు లేక పోతే వదిలి వేయండి 
ఆత్మల ఇల్లు ఏది ? ఆత్మల ఇల్లు పరంధామము / శాంతి ధామము . ఆత్మ యొక్క స్వధర్మము శాంతి దానిని ధారణ చేయండి . “ నేను శాంతి స్వరూప ఆత్మను ” అనే దానిలో స్థితులు అయ్యి వుండండి . మీలో వచ్చే మార్పును మీరే గమనించుకోoడి.
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్
వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ , అందరికి ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను .  నేను ఒక ఆక్యూపుంచరిస్ట్ గానే కాదు ,ఒక తత్వవేత్తగా  నా చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి . మిగిలినవి వదిలివేయండి . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది . 

మీ శ్రేయోభిలాషి-------- > అస్త్ర  అగ్ని జ్వాలా    
ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్




No comments: