ఎపిసోడ్ : 1 " ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "
ఎపిసోడ్ : 1
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ –
స్థూల వైద్య రహస్యము "
" మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది " అని మన పెద్ద వాళ్ళు
అంటూ ఉంటారు . అది ఎంత వరుకు నిజము ! మీరు ఎప్పుడయినా ఆలోచించారా ? ప్రస్తుత కాలములో ఎందుకు ఇంత అనారోగ్యం పట్టి
పీడిస్తోంది అన్న ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా ! పూర్వ కాలంలో అందరూ చాల
ఆరోగ్యముగా ఉండేవారు. ఎందుకు అన్న ప్రశ్న వేసుకుంటే , పూర్వ కాలములో అందరూ మానసికముగా , ఉల్లాసముగా ఉండేవారు . దాని వలన వారు చాల
ఆరోగ్యముగా ఉండేవారు . మానసికముగా ఉల్లాసముగా ఉండటం కోసము ఆ రోజుల్లో ఆధ్యాత్మికత
చింతనతో పరమాత్మను తెలుసుకుని పరమాత్మ నుంచి శక్తిని తీసుకుని తమ ఆత్మలో నింపుకుని
నైతిక విలువలతో తమ జీవితాన్ని సార్ధకత చేసుకోవటానికి అందరికి మంచి చేస్తూ , ఆత్మకు వున్న దాహాన్ని జ్జ్ఞానము అనే వెలుగుతో నింపుతూ , శ్రేష్ఠ
సంకల్పాలతో ఆరోగ్యముగా జీవించేవారు . ఎప్పుడు అయితే ఆత్మకు సంతృప్తి లభిస్తుందో అప్పుడు ఆ
వ్యక్తి చాల ఆరోగ్యముగా ఉంటాడు . దీని అర్ధము మానసిక ఆనందము , ఒత్తిడి మనిషి శరీర భాగాలపై పడుతుంది .దాని
వలన మనిషి అనారోగ్యానికి గురి అవుతాడు . కర్మ సిద్ధంతాం ప్రకారం ఎవరి కర్మలను వారే
అనుభవించాలి దాని కారణంగా కూడా కొన్ని సార్లు మనము అనారోగ్యానికి గురి అవుతాము .ఇప్పుడు మనము ప్రస్తుతము వున్ననాగరికత
ప్రపంచాన్ని తీసుకుంటే మనిషి నైతికవిలువలు లేకుండా ఉండటం వలన తమ ఆరోగ్యములను తమ
చేతులారా పాడుచేసుకుంటున్నారు . మానసిక ఒత్తిడిని పెంచే అనేక కారణాలతో తన శరీర
అవయవాల పైన పడటం జరుగుతుంది . దాని వలన అనారోగ్యానికి గురి అవుతున్నాడు . ఇది
అందరికి తెలిసిన నిజము కానీ మనము దానిని ఎందుకు అరికట్టలేక పోతున్నాము అన్న ప్రశ్న
ప్రతి ఒక్కరి యువతలో రావాలి అని ఆశతో మిమ్మల్ని మీరు ఆలోచింప చేసుకునే విధముగా
ఇక్కడ చెప్పటం జరుగుతుంది . అందరికి తెలిసిన విషయమే అని నేను అనుకుంటున్నాను . అది
ఏమిటి అంటే వైద్యం రెండు రకాలు . ఒకటి సూక్ష్మవైద్యం . రెండవది స్థూల వైద్యం .మీకు
ఇక్కడ ఒక్క ప్రశ్న రావచ్చు ఏమిటి సూక్ష్మ వైద్యం ? సూక్ష్మ వైద్యం అంటే మన ఆత్మకు ఇచ్చే వైద్యం . ఆత్మయే మన
శరీరాన్ని నడిపిస్తుంది . పుట్టిన వాడు గిట్టక తప్పదు . గిట్టిన వాడు పుట్టక
తప్పదు . ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణమూ ఉంటుంది . జన్మలు కూడా ఉంటాయి . ఆత్మకు
వైద్యం ఏమిటి అని చాల మంది ఆలోచనను మొదలు పెట్టవచ్చు ? ఈ రోజుల్లో ఎవరిని అడిగిన ఏమి అంటున్నారు
నాకు మనస్సుకు శాంతిగా లేదు . సరే మరి ఇప్పుడు చూద్దాం ఆత్మకు శాంతి ఎలా
దొరుకుతుంది ? ఆత్మకు -మనస్సు శాంతిని
పొందించటానికి మనము మన కోసము ఏమి చేసుకుంటున్నాము అన్న ప్రశ్న ఒక్కసారి వేసుకోండి
. చాల మంది అనవచ్చు మేము రోజు యోగ చేస్తాము , రోజు ఉదయము లేచి సూర్య నమస్కారం
చేస్తాము , ఉదయం గుడికి వెళ్ళతాము . కేవలము ఇవి అన్ని చేస్తే సరిపోతే మరి ఈ రోజు
ఎవరు ఏ అనారోగ్యంతో వుండకూడదు. వాటి వలన కేవలము శరీరమునకు మాత్రమే వ్యాయామము
దొరుకుతుంది . మరి ఆత్మకు వైద్యం ఎక్కడ లభిస్తుంది ? దాని కోసం మీరు ఆద్యాత్మిక చింతన ఫై తప్పక దృష్టి
పెట్టాలి . ఆద్యాత్మికత అంటే ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. ఈ సృష్టిలోని ప్రతి ఒక్క
ఆత్మ యొక్క తపన శాంతి కోసమే. ఇక్కడ మనము ఏ కులాన్ని కాని మతాన్ని కానీ
తీసుకురాకూడదు . ఆధ్యాత్మికతను సాధించటానికి చాల మార్గాలు వున్నాయి. ఎవరికీ ఇష్టం
వచ్చిన మార్గములో మీరు వెళ్ళవచ్చు. కాని పూర్తి స్థాయిలో ఆత్మకు శాంతి రావాలి అంటే
మనము అందరము “ రాజ యోగ మెడిటేషన్ “ నేర్చుకోవలసిందే . రాజ యోగ మెడిటేషన్
అనేది మనకు స్వయముగా పరమాత్మయే మనుష్యలకు
ఇచ్చిన వరము . దాని గురించి తెలుసుకోవాలి అని అనుకున్న వారు అందరు మీకు దగ్గరగా
వున్న ప్రజా పిత బ్రహ్మ కుమరిస్ సెంటర్స్ ని సంప్రదించండి . మీరు ఎన్ని
ధ్యాన మార్గాలు ఎనుకున్న మీకు “రాజ యోగా మెడిటేషన్ “ వలన కలిగే లాభము తెలియాలి
అంటే . మీరు రోజు మీకు గుర్తుకు వచ్చిన సమయములో
కాని మీ మనస్సు భాదలో వున్నప్పుడు కాని , ఎవరు అయిన కోపం తగ్గించుకోవాలి
అని అంటే ఆ సమయంలో “ ఓం శాంతి “
అని అనుకొండి . మీకు రోజులో ఎన్ని సార్లు అనాలి అనుకుంటే అన్ని సార్లు అని చూడండి
. మూడు మరియు నాలుగు రోజులలోనే మీలో చాల మార్పు వస్తుంది . ఏమిటి ఈ ఓం శాంతి
అని అనుకోవచ్చు . “ ఓం శాంతి “ అనేది మన ఆత్మ యొక్క స్వధర్మం శాంతి . అందు వలన మనము ఎప్పుడు అయితే “ఓం శాంతి
“ అని అనుకుంటామో ఆ సమయములో మనకు తెలియకుండానే ఆత్మ శాంతి స్థితిని పొందుతుంది.
“ ఓం శాంతి “ అర్ధం ఓం అంటే నేను ఆత్మను అని స్వయన్ని గుర్తు చేసుకుంటూ
శాంతిని పొందటము . ఈ ఒక్క “ ఓం శాంతి “ అనే మాట మన జీవితాలను ప్రశాంతతను
పోందే స్థితికి చేరుస్తాయి. విశ్వంలోని
ప్రతి మానవుని హక్కు కుల , మత, వర్గ , ధనిక , పేద భేదాలు లేకుండా తానూ స్వయం
ఆత్మను అని తెలుసుకుని శాంతిని పొందటము.
స్థూల వైద్య పరముగా ఒక్క “ ఓం శాంతి “ లేక “ నేను
శాంతి స్వరూప ఆత్మను “ అనే మాటతో మన థైరాయిడు సమస్యను నియంత్రణలోకి
తెచ్చుకోవచ్చు . కావాలి అంటే మీరు ప్రయత్నం చేసి చూడండి . “ నేను ప్రేమ స్వరూప
ఆత్మను “ అని ఎక్కువగా అనుకుంటే మన శరీరములో వున్న ఊపిరితితుల సమస్యల నుంచి
మరియు హృదయానికి సంభందము వున్న సమస్యల నుంచి పరమాత్మ యొక్క శక్తితో నియంత్రణకు
తీసుకు రావచ్చు . “ నేను శక్తి స్వరూప ఆత్మను “అని ఎక్కువగా అనుకుంటే మన
శరీరములో వున్న నరాల సమస్య నుంచి , ఎముకుల సమస్య నుంచి పరమాత్మ యొక్క
శక్తితో నియంత్రణకు తీసుకు రావచ్చు. “ నేను పరమ పవిత్ర ఆత్మను “ అని
ఎక్కువగా అనుకుంటే మన శరీరములో వున్న కిడ్నీ మరియు , రక్తమునకు వున్న సమస్య నుంచి
పరమాత్మ యొక్క శక్తితో నియంత్రణకు తీసుకు రావచ్చు. “ నేను సుఖ స్వరూప ఆత్మను
“అని ఎక్కువగా అనుకుంటే మన శరీరములో వున్న ప్రేగుల సమస్య నుంచి , గర్భసంచి ,
పిత్తసయము , లివర్ , డయాబెటిస్ సమస్యల నుంచి పరమాత్మ యొక్క శక్తితో నియంత్రణకు
తీసుకు రావచ్చు. “ నేను ఆనంద స్వరూప ఆత్మను “అని ఎక్కువగా అనుకుంటే మన
శరీరములో వున్న నిద్ర పట్టక పోవటం సమస్య నుంచి పరమాత్మ యొక్క శక్తితో
నియంత్రణకు తీసుకు రావచ్చు. “ నేను
జ్ఞాన స్వరూప ఆత్మను “ అని ఎక్కువగా అనుకుంటే మన శరీరములో వున్న కళ్ళు ,
చెవులు , తల భాగము లో వున్న నరాలు , నోరు , ముక్కు వున్న సమస్యల నుంచి పరమాత్మ యొక్క శక్తితో
నియంత్రణకు తీసుకు రావచ్చు. అంటే ఇక్కడ
మనము రెండు రకాల వైద్యము లను ఒకే సరి చేసుకుంటున్నాము అని అర్ధం. చాల మందికి నమ్మ
సక్యముగా అనిపించక పోవచ్చు .మీరు నమ్మాలి అంటే ఫైన చెప్పబడిన వైద్యాన్ని ప్రయత్నం
చేసి చూడండి .
పరమాత్మ – జ్యోతిర్బిందు స్వరూపము .
ఆత్మ – బిందు స్వరూపము .
ఆత్మల అలౌకిక తండ్రి – పరమాత్మ ఒక్కరే . ( మన
అందరికి అలౌకికoగా తండ్రి ఒక్కరే )
నేను అనేది – ఆత్మ – ఆత్మాభిమానం
– అవినాశి .
నాది అనేది – శరీరము – దేహాభిమానము – వినాశి
.
ప్రతి మనిషి ఈ రోజుల్లో
శాంతి కోసమే పరితపిస్తున్నాడు . పరమాత్మ ఇస్తున్న వైద్యాన్ని అందరూ అనుభూతి
చెందుతారు అని అనుకుంటున్నాను .
మిగిలినది వచ్చే సంచికలో చూద్దాం ! మీకు నేను
ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ కి వాళ్ళకి ఉత్తరాలు పంపండి .
నా అనుభవము అనే దానిని అస్త్రముగా మార్చి , నా
ఆశయము అనే విల్లును తీసి యువతలో చైతన్యము రావాలని యువత హృదయములోకి గురి చూసి
వదులుతున్నాను . అది వారిలో అగ్ని జ్వాలాగా మారి చెడు ఆలోచనలను దహించి వేసి మంచికి
జ్యోతిగా మారి మానవత్వపు బాటను ( కత్తి పోటు తప్పిన, కలం పోటు తప్పదు అన్నట్లు ) చూపి
జీవితములో ఆదర్శముగా నిలుస్తాడు అని ఆశిస్తూ.....
మీ శ్రేయోభిలాషి-------- > అస్త్ర అగ్ని జ్వాలా
No comments:
Post a Comment