ఎపిసోడ్ :7
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము
"
కొంచం సేపు నేను నా అనుభవమును
తెలియచేస్తున్నాను . నేను నా ఆధ్యాత్మిక పరిశోధనలో నేను గ్రహించిన విషయాలను
తెలియజేస్తున్నాను . పరమాత్మ నన్ను గుర్తించారు . నేను అనగా నా ఆత్మ పరమాత్మను
గుర్తించింది . పరమాత్మ అంటేనే దివ్యమైన ప్రకాశం . అయన సహయోగము తో ఆనందాన్ని , సుఖాన్ని
, శాంతిని , పవిత్రతను , జ్ఞనాన్ని , ప్రేమను పొందుతున్నాను . మరి మీరు ? నా
జీవితం పరమాత్మ స్మృతికే అంకితము మరి మీరు
?
నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానము ? నేను
ఆత్మను అని అందరమూ తెలుసుకున్నాము. ఆత్మ స్వరూపము – బిందు స్వరూపము అని కూడా
మనకు అర్ధం అయ్యింది . ఆత్మ యొక్క
స్వధర్మం – శాంతి . ఇక్కడ మనము అందరము ప్రశ్న వేసుకోవలసింది ప్రస్తుత సమాజములో
మనము అందరమూ శాంతి గా వున్నామా ? మనము లేమూ , ఎదుటివారిని కూడా శాంతిగా వుంచము .
అది ఏమిటి అంటే మనిషి నైజము .ఎవరు శాంతిలో
లేరు ఎందుకు అని ఎప్పుడు అయిన ఆలోచించరా ? నేను శాంతి గా వుండాలి అంటే ఏమి చేయాలి
? అది ఎక్కడ దొరుకుతుంది ? అన్న ప్రశ్నకు వస్తే . శాంతి అనేది మార్కెట్లో
కొనుక్కుంటే వచ్చేదా , గాలిలో వెతుకుంటే వచ్చేదా ? గుడికి వెళ్ళితే దొరుకుతుందా ?
ఇష్ట మైన ప్రదేశమునకు వెళ్ళితే దొరుకుతుందా ? ఇష్ట మైన వాళ్లతో మాటలాడితే వస్తుందా
? మీకు నచ్చిన పని చేస్తే వస్తుందా ? ఎవరు అయిన పొగిడితే వస్తుందా ? ఎవరిని అయినా తిడితే వస్తుందా ? ఎవరిని అయినా
కొడితే వస్తుందా ? లేక ఎవరిని అయిన బాధ పెడితే వస్తుందా ? కొంచము సేపు దీని
గురించి ఆలోచించండి . ఆలోచించే సమయములోనే నేను మీకు మరో సత్యాన్ని తెలియచేసాను .
ఇక్కడ మనము తత్వము లోకి వెళ్ళదాము . సత్యానికి – అసత్యానికి , ధర్మనికి –
అధర్మానికి తేడా తెలియక అమాయక స్థితిలో ప్రవేశిస్తాడు . దిని అర్ధాన్ని మీకు
వివరిస్తున్నాను . నేను గ్రహించిన సత్యము నేను ఒక ఆత్మను – శరీరాన్ని నడిపించే
చైతన్య శక్తిని . బృహిటి సింహాసనాధికారి ఆత్మను . నా ఆత్మ స్వధర్మం “ శాంతి “ . నా
అలౌకిక తండ్రి పరమాత్మ . ఆయన నిరాకారుడు , నిర్వికారుడు , నిరహంకారుడు . పరమాత్మ
అంటేనే తేజస్సు మరియు దివ్య ప్రకాశం . నా ముందు సత్యం కనబడుతుంది నేను ఆత్మను –
అవినాశిని . పరమాత్మ అందరికి ఒక్కరే . కాని సత్యం తెలిసిన అప్పటికి అంగీకరీంచము .
నా మనస్సు శాంతి కోసము ఎక్కడకు పరుగులు తీస్తుంది ?నా బుద్ది ఆ శాంతిని పొందటం
కోసము ఏమి చేయమని ఆలోచనలను తయారు చేస్తుంది ? నా సంస్కారము ఏమి చేయబోతుంది . ఇక్కడ
ఆత్మ శాంతిని పోందే మార్గము ఏమిటి ? చాల మంది అనుకోవచ్చు శాంతి బయట వారి వలన
వస్తుంది అని . కానీ కాదు మనలో వున్న మన ఆత్మ వలెనే శాంతి ని పొంద గలము అని నేను
ఎప్పుడు అయితే నా గురంచి ఆత్మ పరిశోధన చేస్తానో అప్పుడే నేను నా ఆత్మ స్వధర్మం
శాంతి అని తెలుసుకుని .. ఆ శాంతి కోసం నాలో నన్నే వెతుకుకోవాలి అన్న సత్యం
గ్రహిస్తాను . నేను ఎవరు అంటే మనము లౌకిక భాషలో నేను స్టూడెంట్ని , టీచర్ని ,
డాక్టర్ని , లాయర్ని , పొలిటికల్ లీడర్ని , పోలీసుని ఇలా మన వృతులను మనము
చెప్పుతాము కాని నేను ఒక ఆత్మను అన్న విషయాన్నీ మర్చిపోతాము . ఎప్పుడు అయితే నేను
ఒక ఆత్మను అన్న విషయాన్ని మరచిపోతమో దానితో పాటు నేను శాంతిని కూడా వదిలేస్తాను
లేక మర్చిపోతాను . ఇక్కడ శాంతి అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు . ఈ సృష్టిలో
మనము కోల్పోయిన శాంతిని మనకు తిరిగి ఇవ్వగలిగేది ఒక్క పరమాత్మయే అన్న సత్యాన్ని
గుర్తించక నాలో నేను మదన పడుతూ శాంతి కోసం కొండల్లో , గుట్టల్లో , అక్కడ , ఇక్కడ
అని అనుకుంటూ అందరి వ్యక్తులలో వెతుకుతాం . ఇతరుల నుంచి మనము శాంతి రాదు అన్న
సత్యం గ్రహించం . ఎందుకు అంటే ఆత్మ శక్తిని కోల్పోయింది . తనను తాను మర్చిపోయింది
. శాంతి కోసం పిచ్చిగా వెతకటం మొదలు పెట్టింది . ఏది సత్యం – అసత్యం అనేది
తెలుసుకోలేక పోయింది . ఏది ధర్మం – ఏది అధర్మం అనేది కూడా తెలుసుకోలేక పోతుంది
.నేను నా కోసం ఏమి చేసుకోవాలో తెలియని అమాయక స్థితి లో నా మనస్సు , బుద్ధి ,
సంస్కారము పని చేస్తూ వుంటాయి . దాని ప్రభావము నా శరీర అవయవాల ఫై న పడి శరీరములో
రక్త ప్రసరణ ఎక్కువగా అవటము మరియు రక్త ప్రసరణ తక్కువగా అవటము జరుగుతుంది . దాని
వలన మనము కళ్ళు తిరిగి పడిపోవడము జరుగుతుంది . ఆ ప్రభావము ముఖ్యముగా మన మెదడు ఫై
పని చేస్తుంది . మెడదు ఆలోచించే విధానము ఫై పని చేస్తుంది . ఆ సమయములో చాల పిచ్చి
పిచ్చి ఆలోచనలు కూడా రావచ్చు .నేను ఎక్కడికి వెళ్ళాలి శాంతి కోసం అని అన్ని
చోట్లకు వెళ్ళతాము . నేను తిరుగుతున్నాను ఆ శాంతి కోసము . నాకు సత్యం తెలిసింది ఆ
శాంతి నాలోనే వుంది . అవును ఆ శాంతి నాలోనే వుంది . నేను ఎప్పుడు అయితే నేను
ఆత్మను అని అనుకుంటానో . నాకు తెలియకుండానే శాంతిని పొందుతాను . మీ ఆత్మ సంతృప్తి
కోసం పని చేసుకోండి . మీ కోసం మీరు బ్రతకండి . స్వేచ్ఛాగా శాంతిని మీ స్వధర్మo
అయిన శాంతిని ఆస్వాదించండి . దానిని మనము డబ్బుతో కొనలేము . ఎవరో మనకి ఇచ్చేది
కాదు . ఒక్క మన అందరికి తండ్రి అయిన పరమాత్మ ఆ శాంతి స్వరూపుడు మాత్రమే మనకు శాంతి
ఇస్తారు . ఇవ్వగలరు . సాకరములో ఏ వ్యక్తి వలన అవ్వదు శాంతిని ఇవ్వటము . పరమాత్మ శాంతి దాత , శాంతి స్వరూపుడు , ఆ
శాంతిని నేను అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి ప్రకాశవంతమైన శాంతి కిరణాలు నా
శరీరములోని బృహిటి మధ్య స్థానములోకి ప్రసరింప బడుతున్నాయి. నా ఆత్మ ఆ శాంతి
కిరణాలను ఆస్వాదిస్తుంది . “ నేను శాంతి స్వరూప ఆత్మను “ , “ నేను శాంతి స్వరూప
ఆత్మను “ “ నేను శాంతి స్వరూప ఆత్మను “ అని అనుకుంటూ నాకు తెలియకుండానే తండ్రి
ఇస్తున్న శాంతిని స్వికరిస్తాను . ఇక్కడ
నేను సత్యం గుర్తించాను . ఇక్కడ నేను ఏకాంతములో నేను – పరమాత్మ తప్ప ఎవరు లేరు .
నా ఆత్మ దానిని ఎప్పుడు అయితే అనుభూతి చెందుతుందో అప్పుడు నా స్వధర్మాన్ని తిరిగి
సంపాదించుకోవటం నా జన్మ హక్కు అని నాకు అర్ధం అయింది . మరి మీకు .. ఎప్పుడు అయితే
నేను సత్యాన్ని గుర్తించానో , అప్పుడు నా మనస్సు పరమాత్మ వైపు వెళుతుంది . నా బుద్ధి
శాంతిని కోరుకుంది . నా సంస్కారం ఏకాంత వాసిగా చేసింది . బయట వారు మనల్ని ఈ
సన్నివేశంలో చేస్తే వీరు ఏమి చేస్తున్నారు . పిచ్చి వాళ్ళు అని అనుకోవచ్చు. కాని
నాకు మాత్రమే తెలుస్తుంది నేను శాంతిని పొందుతున్నాను . శాంతిని పొందే మార్గములో
నా ఆత్మ ప్రయాణము సాగుతుంది . మరి మీరు ఏమి చేయబోతున్నారో ? మీరే ఆలోచించుకోండి.
నా ఆత్మ శాంతి కోసం ఎదురు చూసింది . ఇప్పుడు నాకు
మార్గం దొరికింది . నేను దానిని అనుసరిస్తాను . మరి మీరు ? ఎప్పుడు అయితే నేను శాంతి స్థితిని
పొందుతానో, నా చుట్టూ ప్రక్కల కూడా నా నుంచి శాంతి ప్రకంపనాలు వాయు మండలములోకి
వెళ్ళి పోతాయి . వాయు మండలము అంతా శాంతి స్థితితో
నిండిపోతు వున్నది .
మిగిలిన విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం !
ఒక ధారణ పాయింట్ ని మీకు అందజేస్తున్నాను .నచ్చిన వారు ప్రయత్నం చేయవచ్చు లేక పోతే
వదిలి వేయండి ?
ప్రశ్న : అలౌకిక తండ్రి అయిన పరమాత్మ
పిల్లలు అయిన మనకి ఎప్పుడూ ఏమని బోధిస్తారు ?
సమధానము : పిల్లలు “ నిరాకరి – రూపం
లేకపోవటము “ నిర్వికారి – ఎటువంటి బంధం
లేకుండా వుండటం “ మరియు “ నిరహంకారిగా
– అహంకారము లేకుండా వుండటంగా “ అవ్వండి
అని బోధన చేస్తారు .
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన
ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్
వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ , అందరికి ఉపయోగ
పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను . నేను ఒక
ఆక్యూపుంచరిస్ట్ గానే కాదు ,ఒక తత్వవేత్తగా నా చిన్నతనము
నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను
. ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ
పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి . మిగిలినవి వదిలివేయండి . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి
కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది . మీ శ్రేయోభిలాషి
..... అస్త్ర అగ్ని
జ్వాలా ... ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్
No comments:
Post a Comment