Wednesday, July 29, 2020

ఎపిసోడ్ : 11 " ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "


 ఎపిసోడ్ : 11
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "
ముందు సంచికలో నేను బిందు స్వరూపములోకి వెళ్ళి మన అందరి అలౌకిక తండ్రి అయిన పరమాత్మను కలుసుకున్న అనుభూతిని పొందాను . నాతో పాటు మీరు అందరు కూడా పరమాత్మ యొక్క  ప్రకాశమును అనుభూతి చెందారు అని అనుకుంటున్నాను . దానితో మీకు తెలియకుండానే శాంతిని కూడా అనుభవము చేశారు అని అనుకుంటున్నాను. నేను మీమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. మీ మనస్సుకు ఎలా అనిపిస్తుంది . పరమాత్మ యొక్క ప్రకాశాన్ని ఆత్మల ప్రకాశ కూటమిని మీ కళ్ళ ముందు కనిపిస్తుoటే మీకు మౌనములోకి వెళ్ళిపోవాలని అని అనిపిచిందా లేదా ?అవును అనిపించింది అని చెప్పేవాళ్ళకు వారు తప్పకుండా ఆత్మిక దృష్టిలో శాంతిని అనుభవము చేసినట్టే ! అది తప్పకుండా వారిలో ఆత్మలో జ్ఞానామృతాన్ని నింపు కోవాలి అన్న తపనను పెంచుతుంది . ఎప్పుడు అయితే ఆత్మిక చింతనలో వుంటామో  మనకు తెలియకుండానే ఆ ప్రభావము మన శరీర అవయవాల ఫై ప్రభావం చూపుతాయి . శరీరములోని అన్ని అవయవాలు చురుకుగా పని చేయటం మొదలు పెడతాయి . దానితో మనకు ఎన్ని సమస్యలు వున్న వాటిని మరిచిపోతాము లేక అధిగమిస్తాము .
          అందరు చాల జాగ్రతగా ఆలోచించండి మరియు వినండి . మన అలౌకిక తండ్రి అయిన పరమాత్మను పరంధామము నుంచి  వదిలి జన్మ తీసుకోవటానికి సాకార లోకమునకు ప్రయాణము చేసి , స్త్రీ గానో పురుషుడు గానో జన్మ తీసుకుని పరమాత్మ మన అలౌకిక తండ్రి అని మరిచిపోతాము . అక్కడ నుంచి నేను నా కర్మల అనుసారముగా నా జీవిత పయనాన్ని సాగిస్తాను . జన్మలు తీసుకోవటం మొదలు పెడతాను . జననముతో నా ఆత్మ కొత్తబట్టలను ధరించి నట్టు శరీరము అనే రధాన్ని ఈ భూ ప్రపంచములో తన పాత్ర తాను పోషించడానికి స్త్రీ రూపములో కాని పురుషుడు రూపములో కాని తన శరీర నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని తన జీవిత పయనాన్ని కొనసాగిస్తాడు . ఎప్పుడు వరుకు ఆత్మ ఆ శరీరములో వుండి పాత్ర చేయాలని వ్రాసుకుని వస్తాడో , అప్పటివరుకు వుండి. అందరు వున్న నేను ఒక అనాధను అంటు ఆత్మ చివరికి శరీరాన్ని వదిలేస్తుంది . శరీరాన్ని వదిలి వేయటాన్ని మనము అందరమూ వాడుక భాషలో మరణించారు అని కానీ కాలం చేశారు అని కాని అంటాము. ఇక్కడ మనము బాగా అర్ధం చేసుకోవలసిన విషయము ఒకటి వుంది . మరణము శరిరానికా లేక ఆత్మకా ? ప్రశ్న వేసుకోండి ఇప్పుడు ? మీకు అందరికి సత్యం తెలుసు మరణము కేవలము మన శరీరానికే  అని ఆత్మకు కాదు అని. మరి మనము అందరమూ ఎందుకు ఆ సత్యాన్ని అంగీకరీంచటం లేదు అన్న విషయం నాకు అర్ధం అవ్వలేదు . ఆత్మ శరీరాన్ని వదిలేయటం అంటే బట్టలను వదిలివేయడం అని అర్ధం చేసుకోండి .ఎవరి మరణం ఎవరి చేతులలోను వుండదు. మన కర్మలను అనుసారముగా వుంటుంది .         
          ఇక్కడ మరొక విషయాన్ని సామజీక జీవనములో మనకు చేస్తున్న పెద్ద తప్పు గురించి తెలియ చేస్తున్నాను . మరణము విషయములో ఎవరిని ఎవరు దూషించ రాదూ . ఎవరి రాతను బట్టి వారి మరణము వుంటుంది . ఎంత డబ్బు వున్నా మన ఆత్మ పాత్ర ఆ శరములో వుండి అభినయిoచేది పూర్తి అయితే ఆత్మ శరీరాన్ని వదలకుండా ఆపలేదు . ఈ విషయము తెలిసికూడా మనము వేరే వాళ్ళన్ని దూషించటము ఎంత వరుకు ఒప్పు అనేది మీకు మీరే అలోచిoచుకొండి. ఒకరిని దూషించినంత మాత్రమున శరీరాన్ని వదిలిన వారు మళ్ళి ఆ శరీరములోకి తిరిగి రారు అన్న విషయాన్నీ బాగా అర్ధం చేసుకోండి . జన్మ తెసుకున్న ప్రతి వ్యక్తికి మరణము వుంటుంది . మరణించిన ప్రతి వ్యక్తికి జననము వుంటుంది . ఈ సత్యం ఎప్పుడు మనము మర్చిపోకూడదు . సత్యాన్ని జీర్ణించుకోవటం మనకు కష్టo అనినప్పటికీ . సత్యం – అసత్యముగా మారిపోదు . దానిని ధైర్యమూగా అంగికరించ వలసిందే . కాని మరణించిన వారి స్మృతులతో మన జీవనము ఆనందముగా సాగించాలి . వారితో గడిపిన అనుభూతులు , వారి నుంచి నేర్చుకున్న మంచిని మరిచి పోకుండా మనము అందరికి ఆ మంచిని పంచాలి . ఇదే జీవిత సత్యము . నేను ఒక బిందువును అన్న విషయాన్నీ ఆత్మిక స్థితిలో గుర్తుకు చేసుకోవాలి .
ఎవరి కర్మలను వారే అనుభవించాలి. ఇంకొక విషయము తెలియజేయాలని అనుకుంటున్నాను . అయ్యో వారు నన్ను వదిలి వెళ్ళిపోయారు అని ఎక్కువ దుఃఖము లోకి వెళ్ళకండి . వారి శరీరం మాత్రమే మరణించింది . 12 రోజుల తరువాత తప్పకుoడా వారి ఆత్మ కొత్త శరీరాన్ని వెతుక్కుని , కొత్త బట్టలను వేసుకున్నట్టు జన్మ తెసుకుoటుంది. ఇక్కడ రూపము , పేరు , ప్రదేశము, దేహము ( స్త్రీగా కాని పురుషుడుగా కాని ) లౌకికములో అంటే సాకార లోకములో తమ జీవితాన్ని సాగిస్తారు . పరమాత్మ వున్నారు అన్నది ఎంత సత్యమో ! అంతే మన ఆత్మ కూడా జన్మలను తీసుకుంటుంది అన్నది కూడా మనము అంగికరించవలసిందే .  ఈ రోజు నుంచి మనము ఒక విషయన్ని ధారణ చేద్దాము . అది ఏమిటి అంటే ఎవరు అయిన మరణానికి గురి అయినప్పుడు వారి గురించి బాధ పడవద్దు అని కాదు . బాధ వుంటుంది కాని మనము నేర్చుకోవలసింది ఆత్మిక దృష్టితో సత్యాన్ని సృష్టి రహస్యాన్ని అర్ధం చేసుకుని దాన్ని మన కళ్ళ ముందు వుంచుకుని బాధ పడటం మాని , ఆ ఆత్మకు మంచి జన్మ రావాలని ఆ పరమాత్మకు విన్నపం చేసుకోవాలి . అప్పుడే శరీరం వదిలిన ఆత్మ శాంతిగా వేరే శరీరములోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు .

మిగిలిన విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం ! ఒక ధారణ పాయింట్ ని మీకు అందజేస్తున్నాను .నచ్చిన వారు ప్రయత్నం చేయవచ్చు లేక పోతే వదిలి వేయండి 
పరమాత్మ తన పిల్లలము అయిన మన అందరికి వరదానమును ఇస్తున్నారు . “ బిందువు మహత్యాన్ని తెలుసుకుని జరిగిపోయిన దానికి బిందువు ఉంచే సహజ యోగి భవ “ జరిగి పోయింది మళ్ళి తిరిగి రాదూ , దాని గురించి ఆలోచించటం వ్యర్థo . జరిగిన దాని నుంచి మంచి నేర్చుకుని చెడును వదిలి మన జీవిత పయనాన్ని తండ్రి యొక్క పరమాత్మ స్మృతితో ముందుకు సాగించాలి . దేనికి వెనుక అడుగు వెయ్యరాదు . మంచి కోసం జీవిoచాలి. చెడు కోసము కాదు . ఇక్కడ ఏ కులానికి , మతానికి , వర్గానికి తావు లేదు . ఇక్కడ ఎవరు మతము , కులము , వర్గం గురించి మాట్లాడకూడదు.
“నేను అనాది స్వరూప ఆత్మను” అన్న స్వమనములో  స్థితులై వుండండి . మీలో కలిగే మార్పును మీరే గమనించుకోoడి. మీ ఆత్మిక స్థితిలో కాని , మీ ఆరోగ్యoలో కలిగే మార్పులను అనుభూతి చెందండి.
పరంధామంకు వున్న మరొక పేరు ?
శాంతి ధామము ( అదే మన అందరి ఆత్మల ఇల్లు అని మర్చిపోవ్వద్దు )  
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్
వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ , అందరికి ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను .  నేను ఒక ఆక్యూపుంచరిస్ట్ గానే కాదు ,ఒక తత్వవేత్తగా  నా చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి . మిగిలినవి వదిలివేయండి . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది . మీ శ్రేయోభిలాషి-------- > అస్త్ర  అగ్ని జ్వాలా    
ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్





No comments: