Wednesday, July 29, 2020

ఎపిసోడ్ : 18 " ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "


ఎపిసోడ్ : 18
ఆత్మిక దృష్టితో సూక్ష్మ –  స్థూల వైద్య రహస్యము "
ముందు సంచికలో మనము నాలుగు యుగాలు వున్నాయి అని చెప్పుకున్నాము .
అవి ఏమిటో మరొక సారి చూద్దాము . 1. స్వర్ణ యుగము మరియు సత్య యుగము (1250 సంవత్సరంలు)
2. త్రేతాయుగం (   1250 సంవత్సరంలు )
3. ద్వాపరి యుగము  ( 1250 సంవత్సరంలు )
4. కలి యుగము (1250 సంవత్సరంలు )
కల్పము అంటే 5౦౦౦ సంవత్సరంలు పూర్తి అవటము .
సత్య / త్రేతా యుగములు గురించి తెలుసుకుందాము : కలి యుగం అనంతరము ఆత్మలము పరంధామము చేరుకుంటాం . అక్కడ నుంచి ఆత్మల జీవిత పయనము మళ్ళి సత్య యుగం  ప్రారంభం లో ఒక్కక్క ఆత్మగా సాకార లోకములోకి ప్రవేశము చేస్తాయి యుగ స్థాపన కోసము . దేనినే లక్ష్మి నారాయణి యుగం అంటాము . నరుడు నుంచి నారాయణిగా , నారి నుంచి లక్ష్మిగా తయారు అయ్యి సనాతన ధర్మoగా ( దేవి దేవతల యుగముగా ) ఏర్పాటు అయ్యింది . మనకు అందరికి తెలిసిన విషయమే ముందుగా దేవి దేవతల రాజ్యము వుండేది . అక్కడ వున్న జనాభా సంఖ్య ముందుగా 9 లక్షలు  ఇక్కడ అంతా బంగారముతో నిండిన భవనములతో అందరు దేవి దేవతల రూపములో వుంటారు . ఇక్కడ యోగ శక్తితో పిల్లలకు జన్మ నిచ్చేవారు. సంపూర్ణ కళలతో , దివ్యమైన దైవీ గుణాలతో సుఖ సంపదలతో ఆనందకరమైన జీవితాన్ని గడిపేవారు . అక్కడ పవిత్రతా శక్తి కూడా ఎక్కువగా వుండేది . అకాల మరణము లేదు . సత్య యుగంలో జన్మను తీసుకున్న వారిని సూర్య వంశీ ఆత్మలు అని అంటారు . దేవి దేవతలకు కూడా జనన మరణ చక్రాలలోకి రావలసిందే . ఒక్క పరమ పిత పరమాత్మ మాత్రమే జనన మరణ చక్రలలోకి రారు . సత్య యుగంలో ఆత్మలో పరమాత్మ యొక్క సంపూర్ణ మైన శక్తితో వుండి జన్మను తీసుకోవడము వలన వారు దివ్యమైన రూపాన్ని కలిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుండేవారు . మనస్సులో ఎలాంటి వికారము లేదు .
దీని తరువాత త్రేతాయుగం మొదలు అయ్యింది . ఈ యుగం చివరివరుకు పరంధామము నుంచి ముక్కోటి  మంది ఆత్మలు జన్మ తీసుకుంటారు . అది కూడా యోగ శక్తితో నే ఇక్కడ కూడా ఏ వికారము లేదు . సుఖ సంతోషములతో వుండేవారు . వీరిని చంద్ర వంశీయులు అని అంటారు . వీరు 14 కళల సంపూర్ణనతో వుంటారు . ఇక్కడ కూడా అందరు దివ్యమైన రూపాన్ని కలిగి వున్నారు . సంపూర్ణ మైన ఆరోగ్యమును కలిగి వున్నారు . ఈ రెండు యుగాలను మనము స్వర్గంగా చెప్పవచ్చు . పరలోక సుఖంగా కూడా చెప్పవచ్చు .
త్రేతా యుగ చివరిలో పంచవికారముల ప్రవేశం జరుగుతుంది .
ద్వాపరి / కలి యుగములు : ఈ యుగములు వచ్చే సరికి ప్రతి ఒక్క ఆత్మ జన్మను తీసుకుంటూ తీసుకుంటూ వచ్చి ఆత్మలో పరమాత్మ ఇచ్చిన శక్తిని కోల్పోయి వికారములకు ( ప్రవిత్రతా శక్తిని కోల్పోయారు ) బానిసగా మారిపోయారు . ఎవరి పాత్ర ఏ యుగములో ప్రారంభము అవుతుందో ఆ సమయములో ఆత్మ సాకార లోకములో జన్మ తీసుకుoటుoది. ఇక్కడ నుంచి ఆత్మ శక్తిని కోల్పోవటం వలన
మనలో పంచ వికారములు ప్రవేశించాయి . నెమ్మది నెమ్మదిగా మనిషి తనకు వున్న దివ్యమైన గుణాలను మరచిపోతూ మానవత్వం లేకుండా ప్రవర్తించడం మొదలుపెట్టారు. మానవతా విలువలను మనము ఎప్పుడు అయితే మర్చిపోతామో ! అప్పుడు అదే మన పతనానికి నాంది అవుతుంది .
అంటే కలియుగాంతం వచ్చేటప్పడికి  మనిషి మనస్సు వికారాలతో తన బుద్ధిని నింపేసుకుంటాడుదానితో తన సంస్కారములు రాక్షస సంస్కారములుగా మారిపోతాయి . వాటి వలన అనేకమైన ఘోరమైన నేరాలు చేయటము మొదలు పెడతాడు . ఎందుకు మనిషి ఈ విధముగా మారి పోయారు అని అనుకుంటాము . దానిని మనము ఆత్మిక దృష్టి తో చుస్తే అర్ధం అవుతుంది . ఆత్మలో శక్తిని కోల్పోవటం వలన మనలో వున్న చిన్న చిన్న బలహీనతల ఫై మాయ విజయాన్ని సాధిస్తుంది . కలికాలంలో అందరూ మాయకి వసము కావలసిందే . మాయ అంటే పంచవికారాలు. ఎప్పుడు అయితే మనిషి తనలో వున్న శక్తిని కోల్పోతారో అప్పుడు మనకు తెలియకుండానే ఆ ప్రభావము మన శరీర అవయవాల ఫై న పడి మనము అనారోగ్యానికి గురి అవుతాము . కర్మలను అనుభవింటానికి కూడా మనము అనారోగ్యము పాలు అవుతాము .కలి యుగంలోకి వచ్చేసరికి అనేక అనారోగ్యములు కూడా పుట్టుకు వస్తున్నాయి . వాయుమండలము , ప్రకృతి కూడా తన శక్తిని కోల్పోయింది . పూర్వ కాలములో  వున్న స్వచ్ఛత ఇప్పుడు వున్న కాలములో లేనే లేదు . మనిషిలో ఏ విధముగా వికారములు చొటుచేసుకున్నాయో , అదేవిధముగా ప్రకృతి కూడా తన సహజ గుణాలను కోల్పోయింది అన్న విషయము మనము అందరము చూస్తూనే వున్నాము .ఆ వికారాలను జయించగలిగే శక్తి ఎవరినుంచి మనము పొందగలము . కలి యుగము తరువాత సత్య యుగ స్థాపన జరగాలి . అంటే మనిషి వికారాలను జయించి స్వర్ణ యుగానికి పునాదిని వెయ్యాలి . మనిషి ఆత్మలో నింపుకున్న వికారాలను ఎలా పోగొట్టుకోగలడు . దాని గురించి పరమాత్మ స్వయముగా 5౦౦౦ సంవత్సరములు పూర్తీ అవుతున్న సమయములో 1౦౦ సంవత్సరముల ముందు ఒక వృద్ధ మానవుడు తనువులోకి ప్రవేశము చేసి మనకు వికారములు జయించ గలిగే శక్తిని తెలియచేస్తున్నారు . ఎప్పుడు అయితే ధర్మమూ ఒంటి పదము వైపు వచ్చి నడుస్తుందో అప్పుడు భగవతుండు సామాన్య మానవుని రూపములో  అవతరిస్తాడు సృష్టి వినాశనం కోసము మరియు యుగ ఆరంభము కోసము అన్న విషయము అందరికి తెలిసినదే  . 
 మిగిలిన విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం !
పరమత్మ ఇస్తున్న వరదానము :
" ఆత్మీయత ( రుహబ్ ) మరియు దయా గుణము ద్వారా విశ్వ నవ నిర్మాణము చేసే విశ్వ కల్యాణ కారి భావ "

స్వమానము : నేను జ్ఞాన నేత్రము ద్వారా మూడు కాలాలను తెలుసుకున్న త్రినేత్రి ఆత్మను .

ధారణ : 1 . స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మిక తండ్రి ద్వారా చుదువుకుని సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోవాలి . సత్య ఖండానికి యజమానులుగా ఆయ్యే౦దుకు సత్యమైన కథను వినాలి . వినిపించాలి .
2 . తండ్రి ( పరమాత్మ )నుండి అనంతమైన వారసత్వము లభిస్తుందో వారినే స్మృతి చెయ్యాలి . దేహధారిని స్మృతి చేయరాదు . పాత ప్రపంచానికి అగ్ని అంటుకుంటుంది . దీనిని చూస్తున్న చూడకుండా ఉండాలి .

మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్
వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ , అందరికి ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను .  నేను ఒక అక్యూపంక్చరిస్ట్ గానే కాదు , ఒక తత్వవేత్తగా  నా చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి . మిగిలినవి వదిలివేయండి . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది . మీ శ్రేయోభిలాషి-------- > అస్త్ర  అగ్ని జ్వాలా ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్


No comments: