సూక్ష్మ – స్థూల వైద్య రహస్యం ఎపిసోడ్ 1
కరోనా
వైరస్ ను ఎదుర్కోవడానికి నేను ఏమి
చెయ్యాలి ?
నా శరీరాన్ని నడిపించే చైతన్య వంతమైన శక్తి ఆత్మ– ఆత్మ
అవినాశి అని తెలుసుకోoడి . నా ఆత్మలో శక్తి ని పరమాత్మని యొక్క అనుగ్రహంతో
నింపుకుంటూ శక్తి స్వరూప ఆత్మగామారిపోవాలి . నేను నిరోగి ఆత్మను
అన్న సంకల్పంతో ముందుకు అడుగులు వెయ్యాలి .కాల చక్ర జన్మ రహస్యమును అనుభవం
చేసుకుంటూ జరిగేది ఎదో జరగక మానదు, పుట్టిన వాడు గిట్టక మానడు – గిట్టిన వాడు
పుట్టక మానడు అన్న సత్యాన్ని అంగీకరించాలి. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో అన్న భయంతో
బ్రతికే జీవితం ఒక జీవితమేనా ? అని ఎప్పుడు అయిన ఆలోచించారా ? భయంతో వున్న సమయంలో మన
శరీరoలో వున్న అవయవాల పైన ఎటువంటి ప్రభావం పడుతుంది
అని గమనించుకున్నారా ? ఏమి జరుతుంది ఎదో జరగబోతున్నది అన్న ఆలోచన వలన నా కిడ్నీ పై ప్రభావం పడుతున్నది
వెంటనే నాకు తెలియకుండానే నిరుత్సాహoలోకి
తీసుకువెళ్ళిపోతుంది . ఎదో కోల్పోతున్నాను అన్న అసంతృప్తి కమ్ముకొస్తుంది. నా
నరాలలో శక్తి క్షిణిoచి పోతూ నట్లు తల నొప్పితో నాకు నిద్ర
పట్టని స్థితిలో వెళ్ళిపోతాను. రక్త ప్రసరణ సరిగ్గా జరగక పోవటం జరుగుతుంది. దాని
వలన అనేక మైన మార్పులు జరిగి నేను పూర్తిగా అనారోగ్యానికి గురి అవుతాను.ముందు నా
అనారోగ్యం నా మానసిక స్థితి పై వుంటుంది అని మర్చిపోవద్దు . అసలు అయిన వైరస్ “ భయంతో
బ్రతకటమే “. మనము ముందు ఎదుర్కోవలసింది మనలో వున్న భయాన్ని అని తెలుసుకోవాలి . మన
ఆత్మలో ఎలాంటి పరిస్థితిని అయినా
ఎదుర్కునే శక్తిని నింపుకోవాలి . ఎదుర్కునే శక్తిని మన ఆత్మలో నింపుకోవటానికి ఈ
యోగ ముద్రాలను చేద్దాం.
లింగ ముద్రను
వేయటం వలన జలుబు మరియు దగ్గును నియoత్రణకు
తీసుకురావచ్చు.రోజు 10 నిమిషాలు చెయ్యాలి . తిన్న వెంటనే చెయ్యకూడదు . ఈ ముద్ర
చేసిన తరువాత 1 గ్లాస్ నీళ్ళు త్రాగాలి .
శ్వాస కోశ
ముద్రను వేయటం వలన ఉపిరి తీసుకోలేక పోతున్నాము అన్న సమస్య నుంచి బయట పడగలము . ఏ
సమయములోనయినా చేయవచ్చు . ఎంత సమయం అయినా వేయవచ్చు . రోజు 10 నిమిషాలు చేస్తే చాల
మంచిది. పెద్ద వాళ్ళు , చిన్న వాళ్ళు కూడా చెయ్యవచ్చు .
ప్రాణ ముద్ర
తో మనలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు . ఎంత సమయము అయిన చెయ్యవచ్చు . రాత్రి
పాడుకునే ముందు మాత్రం చేయకూడదు .
మన ఆరోగ్యం మన చేతిలోనే వుంది అన్న విషయమును మర్చిపోకండి
. బ్రతికినంత కాలం ఆనందంగా పది మందికి ఉపయోగపడే పనిని చేస్తూ సంతృప్తికరమైన
జీవితాన్ని గడుపుతూ మన అందరి గమ్యం అయిన పరంధామoను ( స్వర్గoను )
చేరుకోవటానికి మనత్వం వున్న మనిషిగా బ్రతుకుదాం.
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన
ప్రశ్నలు అడగాలి అనుకుంటే పేపర్ వాళ్ళకి ఉత్తరాలు పంపండి. మీ శ్రేయోభిలాషి , ఉషా రాణి నేచురోపతి క్లినిక్ –
డాక్టర్ రాధిక.లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ మరియు ఆయుర్వేదo – హైదరాబాద్ – 79959
37939. ( ONLY WHATS APP MESSAGES )
No comments:
Post a Comment