ఎపిసోడ్ : 4
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము
"
మనము అందరము వివరముగా
తెలుసుకున్నాము మన ఆత్మ నివాస స్థలము శరీరములో బృహిటి మధ్య స్థానము అని , మన శరీరాన్ని నడిపించే ఛైతన్య శక్తియే ఆత్మ .
ప్రాణము పోయింది అంటే ఆత్మ
శరీరాన్ని వదిలివేసింది అని అర్ధం . మనము వాడుక భాషలో ఆత్మ శరీరాన్ని వదిలి
వెళ్ళిపోయింది అని చెప్పటానికి బదులుగా ప్రాణము పోయింది అని చెపుతాము .
ఇక్కడ ఏ కులము , మతము , వర్గము అడ్దు రాదు . ఎవరు అయితే మనిషి జన్మ
తీసుకుంటారో వాళ్ళ అందరిని నడిపించేది ఆత్మనే . అందుకునే ఇక్కడ నేను ముస్లింని , క్రిస్టియన్ ని , హిందుని అని చెప్పటానికి తావు లేదు . ఆత్మికత దృష్టిని
ఏర్పాటు చేసుకోవడము అనేది ఈ భూమి ఫై జన్మ తీసుకన్న
ప్రతి మానవుని యొక్క హక్కు అని తెలుకోండి. ఆత్మకు శక్తిని ఇవ్వగలిగే వ్యక్తి ఒక్క పరమాత్మనే
అన్న విషయం కూడా తెలుసుకోవాలి . పరమాత్మ అంటే నిరాకారుడు రూపం లేని వాడు . పరమాత్మ
అన్ని మతాల వారికి ఒక్కరే . అలాగే వైద్యం కుడా అందరికి ఒక్కటే . మతాన్ని , కులాన్ని , వర్గాన్ని బట్టి వైద్యం మారిపోదు . అది అందరికి ఒక్కటే . సూక్ష్మoగా
కాని , స్థులముగా కాని అందరికి ఒక్కటే . అందుకునే మనము
అందరము అత్మీక దృషి ని తెచ్చుకోవాలి అని అర్ధం చేసుకోవాలి . ఆత్మ అంటే బిందు
స్వరూపo అని అది అవినాశి అని కూడా తెలుసుకున్నాము . అవినాశి
అంటే ఏమిటి ? వినాశనము లేనిది లేక మరణము లేనిది అని అర్ధం .
మరణము అనేది మన శరీరానికి వుంది కాని ఆత్మకు కాదు. మరణముతో ఆత్మ మనం బట్టలను ఎలా
మారుస్తామో అలా శరీరాన్ని వదిలివేస్తుంది . జననంతో ఆత్మ కొత్త బట్టలను
వేసుకుంటుంది . అంటే శరీరాన్ని కొత్తగా తీసుకుంటుంది .ఇక్కడ మనము పూర్తిగా అర్ధం
చేసుకున్నాము ఆత్మకి మరణము లేదు శరీరానికి మాత్రమే మరణం వుంది అని . మరి ఇక్కడ ఒక
ప్రశ్న వేసుకోవాలి ? నేను ఇప్పుడు నా కోసము ఏమి చేసుకున్నాను
అన్న ప్రశ్న వస్తే ? నా కోసము అంటే ఆత్మ కోసమా లేక శరీరము
కోసమా ? శరీరము దేనితో నిర్మాణము చేయబడింది ? శరీరము అనేది పంచాతత్వాలు అనే లక్షణాలను కలిగిన అవయవాలతో ఏర్పాటు
చేయబడింది . పంచాతత్వాలు 5 రకాలు అవి ఏమిటి అంటే భూమి , ఆకాశము
, నీరు , వాయువు , అగ్ని అని . ఇక్కడ మీకు ప్రశ్న రావచ్చు ఏమిటి పంచ తత్వాల లక్షణాలను కలిగి
మన శరీరములోని అవయవాల ఏర్పాటు అవుతాయా అని . అవును ఇది నిజము. అది ఎలాగో ఇప్పుడు
చూద్దాము. భూమి తత్వాన్ని కలిగి మన శరీరములో ఏ అవయవాలు పని చేస్తాయో చూద్దాము .
పిత్తశయము , పొట్ట భాగాలు భూమి తత్వాన్ని కలిగి పని చేస్తూ
వుంటాయి . ఊపిరితిత్తులు , పెద్ద ప్రేగులు వాయు తత్వాన్ని
కలిగి పని చేస్తూ వుంటాయి . కిడ్నీ , యురినరి బ్లాడర్, ఎముకలు మరియు ఎండోక్రైన్ సిస్టం నీటి
తత్వాన్ని కలిగి పని చేస్తూ వుంటాయి . లివర్ , గాల్ బ్లాడర్ ఆకాశ తత్వాన్ని కలిగి పని చేస్తూ వుంటాయి. హార్ట్, పెరికార్డియం మరియు చిన్న ప్రేగులు
అగ్ని తత్వాన్ని కలిగి పని చేస్తూ వుంటాయి . మన శరీరము పంచ తత్వాల లక్షణాలతో ఎలా
ఏర్పడిందో , అలాగే ప్రతి మనిషి ఆత్మలో పంచ వికారాలు చోటు చేసుకున్నాయి . పంచ వికారాలు అంటే కామము , క్రోధము , లోభము , మోహము మరియు
అహంకారము . వీటినే “ మాయ “ అని కూడా
అంటాము వాడుక భాషలో . ఎప్పుడు అయితే పంచ వికారాలు మన
ఆత్మలో చేటు చేసుకుని వున్నాయో అప్పటి నుంచి మన ఆత్మలో పరమాత్మ నింపిన శక్తి
తగ్గిపోతూ వుంది . దాని వలన మనకు తెలియకుండానే మన శరీర అవయవాల ఫై న ప్రభావం
పడుతుంది . ఇక్కడ ఒక విషయం చెప్పుతున్నాను . నా తల్లిదండ్రులు నా చిన్నప్పటి నుండి
ఒక్క విషయము జీవితములో గుర్తు పెట్టుకోమని చెప్పారు . అది ఏమిటి అంటే నువ్వు ఎంత
వృద్ధి లోకి వచ్చినా కాని , లేక ఎవరు అయిన పొగిడిన కాని
ఎప్పుడు అహంకారమును మాత్రము పెంచుకోకు . ఎందుకు అంటే పరమాత్మ కూడా దేనిని అయినా
క్షమిస్తాడు కాని అహంకారముగా వున్న వాళ్ళను మాత్రమూ క్షమిoచడు
.ఈ విషయాన్నీ అందరమూ గ్రహిస్తే చాలా బాగుటుంది . ఈ భావనతో కూడా మనము అత్మిక భావనతో
సూక్ష్మవైద్యం ను మరియు స్థూల వైద్యమును చేసుకోవచ్చు . పంచవికారములు ప్రభావం కూడా
మన ఆత్మిక స్థితి ఫై మరియు శరీర అవయవాల ఫై న పడతాయి . అందుకే ఎప్పుడు మాయ ఫై విజయం
సాధించటానికి ప్రయత్నము చేయాలి . మాయ అంటే పంచ
వికారాలు ఫైన అని. దాని అర్ధము వేరే వారి ఫై యుద్ధం చేయటము కాదు . మనలో వున్న
వికారాలను మనకు మనము అధీనములోకి
తెచ్చుకోవటం అని . వికారాలను జయించటానికి మనము "మాయ జీత్ స్వరూపము " లోకి వెళ్లి పరమాత్మ నుంచి
శక్తిని తీసుకోవాలి దాని వలన మనలో మాయను జయించ
గలిగే శక్తిని పొందుతాము . దానికి సాధన చాల అవసరము . మీకు కోపము బాగా
వస్తున్నప్పుడు మీరు ప్రయత్నము చేసి
చూడండి " నేను మాయ జీత్ స్వరూపాన్ని " అని . ఆ సమయములో మీరు ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు
అనుకొండి. మీరో వచ్చే మార్పును చూసుకొండి. అంతే
కాదు మీకు బాగా కోపము వచ్చినప్పుడు కోపాన్ని నియంత్రణలో కి తీసుకురాకపోతే దాని ప్రభావము మన శరీరములోని కిడ్నీ ఫై ,లివర్ ఫై , హార్ట్
ఫై మరియు తలలోని నరముల ఫై న ప్రభావము పడుతుంది
. మనకు కోపము ఎందుకు
వస్తుంది ? అన్న ప్రశ్న వేసుకున్నారా ? మనకు కోపం ఎందుకు వస్తుంది అంటే మన ఆత్మ
సంతృప్తి చెందకపోవటం వలన .చాలా మంది తెలియక శరీరము
అలసిపోవటం వలన కోపం వస్తుంది అని అనుకుంటారు . కానీ అది కాదు . మనకు కోపము
వచ్చింది అంటే దాని అర్ధము మన ఆత్మలో
ఎదో అలజడి ఉండటం వలన సర్దుకునే సంస్కారం లేకపోవటం వలన మనకు కోపం వస్తుంది . ప్రతి మనిషికి వేరే వేరే
సంస్కారములు ఉంటాయి . ఒకరి సంస్కారములు ఒకరితో
కలవక పోవడము వలన ఆత్మలో
అలజడి
కలిగి మనలో కోపము వస్తుంది . మన శరీరములోనే ఐదు వేళ్ళు ఒకేలా ఉండవు , అలాంటప్పుడు మనకు ఎందుకు ఒకరి సంస్కారములు ఒకరితో ఎందుకు
కలుస్తాయి అన్న ప్రశ్న వేసుకోవాలి ? ఒకరి సంస్కారములు ఒకరితో కలవవు కానీ , ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నము
చేయాలి . ఇక్కడ ఇముడ్చుకునే శక్తిని
, సర్దుకునే శక్తిని మన
ఆత్మలో నింపుకోవడానికి ధారణ చేయాలి . ఇక్కడ నేను ఒక విషయాన్నీ చెప్పాలని అనుకుంటున్నాను మనకు
అందరికి తెలిసిన విషయమే , పూర్వ కాలములో మన
పూర్వికులు చాలా ఆరోగ్యముగా ఉండేవారు ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా ? అప్పుడు తినే పదార్ధాలలో చాలా బలము ఉండేది .
ఎందుకు అంటే వారి ఆలోచనలు మరియు చేతలు చాలా
శ్రేష్ఠముగా ఉండేవి . శ్రేష్ఠ సంకల్పములతో ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని అంటే
ఇముడ్చుకునే మరియు సర్దుకునే శక్తిని
ఆత్మలో ఎక్కువగా నింపుకుని ఉండేవారు అందువలన వారు ఆత్మికముగా ఆరోగ్యముగా ఉండేవారు . దాని ప్రభావం వాళ్ళ
శరీరము ఫై పడి చాలా ఆనందముగా,
ఆరోగ్యముగా ఉండే వారు . మరొక విషయము ఇప్పుడు వున్నంత జనాభా పూర్వకాలములో వున్నారా ? మన అందరికి తెలిసిందే మరియు చిన్నప్పటి నుండి చదువుకుంటూనే
వస్తున్నాము . నాలుగు యుగాలు వున్నాయి అని . యుగము అంటాము అయితే మళ్ళి కొత్త యుగముతో
తయారుఅవుతుంది . అంటే సత్య . త్రేతా , ద్వాపర
, కలి యుగాలు .ఇప్పుడు మనము అందరము కలి యుగములో
వున్నాము . అందువలన జనాభా ఎక్కువగా వున్నారు . మనము ఇక్కడ
కొన్ని సృష్టి యొక్క రహస్యముల గురించి వచ్చే సంచికలలో చూద్దం !
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి
అయిన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ వాళ్ళకి
ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ , అందరికి
ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను . నేను
ఒక ఆక్యూపుంచరిస్ట్ గానే కాదు ,ఒక తత్వవేత్తగా నా
చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు
తెలిసిన మరియు గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా
అనుభవాలను మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి
. మిగిలినవి వదిలివేయండి . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి
జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది .
మీ శ్రేయోభిలాషి ,
అస్త్ర అగ్ని జ్వాలా .........
ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్ 7997519999
No comments:
Post a Comment