ఎపిసోడ్ : 3
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ –
స్థూల వైద్య రహస్యము "
ఈ రోజు మనము మన మనస్సు , బుద్ధి , సంస్కారము
యొక్క ప్రభావము మన శరీర అవయవాల ఫై న ఎలా పడుతుంది అని వివరముగా తెలుసుకుందాము .
మీకు అప్పుడు పూర్తిగా అర్ధం అవుతుంది . అత్మిక దృషి మన ఆత్మ ఫై న కాని శరీరము ఫై
న కాని ఎలా ఉపయోగ పడుతుంది. మీరు కూడా ఆలోచించండి ఒక సారి . ఏమిటి ఆలోచిస్తున్నారా
? ఇప్పుడు నా మనస్సు ఎవరినో చూడడానికి పరుగులు తీసింది అనుకొండి . నా బుద్ధి ఏమి
చెప్పుతుంది వెళ్ళు వెంటనే వాళ్ళని చూడు అని చెప్పుతుంది . నేను వెంటనే వాళ్ళ
దగ్గరకు వెళ్ళాను . వాళ్ళను చూస్తూ ఒక పువ్వు ఇచ్చాను అనుకొండి . పువ్వు ఇవ్వడమనేది
సంస్కారము అయింది . అంటే మన కర్మ లెక్క ప్రారంభం అయ్యింది అని . ఇక్కడ జాగ్రత్తగా
వినండి ఆలోచించి అర్ధం చేసుకోండి . నేను పువ్వు ఇచ్చాను . తీసుకున్న వాళ్ళు నాకు
థాంక్స్ చెప్పారు అనుకొండి . నా మనస్సు చాల ఆనంద పడుతుంది . దానితో నాకు
తెలియకుండానే నా ఆత్మలో ఆనందాన్ని నింపుకుoటాను. దానితో “ నేను ఆనంద స్వరూపముగా
“ మరిపోతూ ధారణను చేసుకుంటాను . నేను
ఎప్పుడు అయితే ఆనంద స్వరూప ఆత్మగా మారుతున్ననో నా ఆత్మ చాల ఉల్లాసoగా వుంటుంది .
ఉన్నప్పుడు ఏమి అవుతుంది నా శరీర అవయవాల ఫై ప్రభావం పడి అన్ని చాల చక్కగా పని
చేయటము మొదలు పెడతాయి . దానితో నేను చాల చక్కగా ప్రశాంతంగా నిద్ర పోతాను. మనకు చాల
మందికి నిద్ర పట్టక పోవడము సమస్య వుంటుంది
. దాని గురించి మనము చాల మందులు కూడా వేసుకుంటాము . కాని ముందుగా వైద్యం
జరగాలసింది మన మనస్సుకు అని మనము అర్ధం చేసుకోలేక పోతున్నాము . మనస్సుకు ఎలా
వైద్యం చేసుకోవాలి అన్న ప్రశ్న మనలో అందరికి రావచ్చు . అది చాల తేలిక ఎప్పుడు
అయితే “ నేను ఆనంద స్వరూప ఆత్మను “ అని
అనుకుంటానో , స్వయముగా పరమాత్మ ఇస్తున్న ఆనంద అనుభూతిని నా ఆత్మ పొందుతుంది.
దానితో నేను చాల ఆనందముగా వుంటాను . నేను ఆనందముగా వుండటం వలన నాకు నిద్ర పడుతుంది
. నా శరీరము ఆరోగ్యంగా వుంటుంది . తక్కువ సమయంలోనే నేను పూర్తి విశ్రాంతి
తీసుకోగలను . అందుకనే మనము అందరమూ ఏమి ధారణ చేయాలి . “ నేను ఆనంద స్వరూప ఆత్మను
“ అని రోజులో ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకుని చూడండి మీకే
తెలుస్తుంది ఆ తేడా ఏమిటి అనేది ? నాకు తెలిసి మీకు ఇప్పుడే అనుభవము కలిగి వుండాలి
ఈ పేపర్ ఎప్పుడు ఎయితే చదువుతున్నారో అప్పుడు “ నేను ఆనంద స్వరూప ఆత్మను “ అని
అనుకోవటముతోనే మీ మనస్సులో ఎదో తెలియని
ఆనందము కలిగి వుండాలి . అది ఒక సారి
గమనించుకోoడి. నాకు తెలుసు మీ అందరికి అనందం యొక్క అనుభూతి పరమాత్మ తన పిల్లలు
అయిన మన కందరికీ ఇచ్చే సహయోగంతో అనుభూతిని పొందారు అని . ఓహో ఈ అనుభూతి ఎంత
బాగుంది . ఆస్వాదించండి పరమాత్మ మీ ఆత్మకు ఇస్తున్న ఆనందాన్ని . ఇప్పుడు చూడండి మీ
మనస్సు ఎంత తేలికగా వుందో !
కర్మ సిద్ధాతం మన మనస్సు ఫై ఎలా ప్రభావం
చూపుతుంది అని ఇక్కడ చూద్దాము . ముందుగా మనము మాటలడుకున్నాము నేను వెళ్ళి వేరే
వాళ్ళకి పువ్వు ఇచ్చాను అనుకొండి . పువ్వు తీసుకునే వారు ఆ పువ్వుని తీసుకోకుండా
నిరాకరించారు అనుకొండి . అప్పుడు నా మనస్సు చాలా భాద పడుతుంది . భాద పడటము అంటే మన
కర్మను మనము అనుభవించటం అని అర్ధం . “ ఎవరి కర్మలను వారే అనుభవించాలి .” ఒకరి
కర్మలకు వేరే వారు భాధ్యులు కారు . ఇక్కడ నేను భాద పడటం వలన ఏమి జరుగుతుంది అని
ఒక్కసారి ప్రశ్న వేసుకోండి . అంటే సూక్ష్మoగా మరియు స్థూలoగా . సూక్ష్మoగా
చూసుకుంటే మన మనస్సు గాయ పడింది అంటే దాని ప్రభావము నా ఆత్మ ఫై పడింది . నా ఆత్మ
ఫై ఎప్పుడు అయితే ఆ ప్రభావం పడిందో నేను స్వయం ఆత్మను నా స్వధర్మం శాంతి అన్న
విషయాన్నీ మర్చిపోతాను . అది మర్చి పోయిన
వెంటనే ఏమి జరుగుతుంది ? స్వయముగా నా ఆత్మ అశాంతిలోకి వెళ్ళిపోతుంది . అశాంతిలోకి
వెళ్ళిపోవటము వలన నేను నా శక్తిని కోల్పోతాను . దాని వలన చాల దిగులుగా వుంటాను .
చాలా చిరాకుగా కుడా వుంటాను . దాని వలన పరమాత్మ ఇస్తున్న ఆనందాన్ని కోల్పోతాను.
ఎదో జీవించాను అంటే జీవించాను అని వుంటాను . ఆ సమయములోనే మనకు తెలియకుండానే వ్యర్ధ
సంకల్పాలకు స్వాగతము పలుకుతాము . చెడు సావాసాలకు అలవాటు పడిపోతాను. నేను స్వయముగా
ఆత్మను అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతాను . ఇక్కడ ఏమి జరిగింది నేను నా అలౌకిక
తండ్రికి చాల దూరం అయిపోయాను . మరో విషయం తీసుకుందాము అది స్థూలoగా ఏమి జరుగుతుంది
? అని ఒక్కసారి ప్రశ్న వేసుకుoదాము . స్థూలముగా అంటే శరీర అవయవాల ఫై అని అర్ధము .
మానసికముగా నేను ఎప్పుడు అయితే బాధ పడ్డానో , అది నాకు తెలియకుండానే నా శరీర
అవయవాల ఫై న ప్రభావం చూపుతుంది . అది ఏ విధముగా అంటే మనలో వున్న ఒత్తిడి వలన
శరీరములో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటము వలన బి.పి తక్కువ అవటము లేక పెరిగిపోవటము
జరుగుతుంది . దాని వలన కళ్ళు తిరగటము కూడా జరుగుతుంది . పిత్తశయము ఫై కూడా
ప్రభావము పడుతుంది . షుగర్ లెవెల్స్ తగ్గిపోవచ్చు , పెరగ వచ్చు . ఇంకా థైరాయిడ్
సమస్య కూడా రావచ్చు . ఇంకా కడుపులో మంట కాని వోమిటింగ్ కాని రావచ్చు .తల
నొప్పి , తిన్నాది అరగక పోవటము ఇంకా చాల
సమస్యలు వస్తాయి . వీటి వలన మన శరీర ఆరోగ్యం పాడు అవుతుంది . అంతేకాదు మన కర్మల
కారణoగా కూడా మనము అనారోగ్యం పాలు అవుతాము .
అందువలన మనము ఒక వైపు సంతోషముతో వుండాలి . ఎందుకు అంటే మన అనారోగ్యం వలన మనము
కర్మాతీత అవస్థను కూడా చేరుకోగలము. కొంత
మంది చాల బాధ పడుతూ వుంటారు . ఎందుకు నాకు ఈ అనారోగ్యం వచ్చింది అని . మీరు
దైర్యము తో వుండాలి . నా ముందు ఆ అనారోగ్యము ఏమి కాదు అని అనుకోవాలి . నా అంటే మన
ఆత్మ ముందు . మన శరీరాన్ని నడిపిoచేది మన
ఆత్మ అని దృఢ నిశ్చయముతో వుండాలి . దాని గురించి మీ ఆత్మలో శక్తిని పరమాత్మ యొక్క
శక్తితో నింపుకోవాలి . అప్పుడు మనము ఎంతటి అనారోగ్యముగా వున్న మనము దానిని గురించి చింతించము . ఎప్పుడు కూడా మన శరీరము ఫై ఎక్కువగా ఏకాగ్రత
పెట్టటము కంటే . మన ఆత్మ ఫై న అనగా మన శరీరాన్ని నడిపించే అతీoద్రియ చైతన్య శక్తి
మన శరీరములో బృహిటి మధ్య స్థానములో వున్న మన ఆత్మ
ఫై ఏకాగ్రతను పెట్టంటం మంచిది . ఆత్మకు వైద్యం చేయగలిగేది ఆ పరమాత్మ ఒక్కరే
అని మాత్రమూ తెలుసుకోండి . పరమాత్మ నిరాకారుడు , సర్వ శక్తి వంతుడు . సూక్ష్మoగా
మన ఆత్మలో శక్తిని పరమాత్మ నుంచి ఎప్పుడు అయితే నింపుకుంటామో , ఆ ప్రభావము
స్థూలముగా మన శరీరములోని అన్ని అవయవాలు ఫై న ప్రభావమును చూపిస్థాయి . అందుకే మన
పెద్ద వాళ్ళు అందరు “ ఆరోగ్యమే మహా భాగ్యము “ అని అంటారు . మీ ఆత్మలో కేవలము
పరమాత్మ నుంచి శక్తి నింపుకుoటే సరిపోదు . దానితో మన శరీరాన్ని ఎలా నడిపించ వచ్చు
అనేది కూడా తెలియాలి .
మీకు అందరికి అర్ధం అయ్యేలా చెప్పాలి అంటే
కారు – డ్రైవర్ ని తీసుకుందాము. ఒక ప్రశ్న వేసుకుందాము ?
కారు వుంది డ్రైవర్ లేకపొతే కారు నడుస్తుందా
? డ్రైవర్ వున్నాడు కార్ లేదు మరి దేనిని డ్రైవ్ చేయాలి ? ఇక్కడ డ్రైవర్ అంటే ఆత్మ
( బిందు స్వరూపములో వుంటుంది ) . కారు
అంటే శరీరము అని అర్ధం . కారుకి డ్రైవర్ ఎంత అవసరమో , మన శరీరాన్ని నడిపించటానికి
కూడా ఆత్మ ( చైతన్యవంతమైన శక్తి ) అంతే అవసరము . నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకోని
వారు ఎవ్వరు వుండరు . దానికి సమాధానము మీకు అర్ధం అయివుంటుంది. అది నేను ఆత్మను
అని . లౌకికములో శరీరానికి వైద్యము చేసేది డాక్టర్ మాత్రమే . వారు కూడా ఆత్మనే!
మరి ఆత్మకు వైద్యం ఎవరు చేయగలరు ? దానికి సమాధానము పరమాత్మ . ఎందుకు అంటే పరమాత్మ
జనన – మరణ చక్రాలలోకి రాడు. ఆయినే సర్వ ఖజానాలకు అధిపతి .అందుకే మనము పరమాత్మ
పరిచయాన్ని తెలుసుకుని మన సర్వ సంభందములు పరమాత్మతో జత పరచాలి . అప్పుడు మనకు
పూర్తిగా సూక్ష్మము మరియు స్థూలము అనే మాటలకూ అర్ధం తెలుస్తుంది .దానితో పరమాత్మ
ఎంతటి అద్భుతమైన వైద్యాన్ని మనకి “ రాజ యోగ మెడిటేషన్” ద్వారా నేర్పించారు అన్నది
తెలుస్తుంది .
మిగిలినది వచ్చే సంచికలో చూద్దాం ! మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన
ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ వాళ్ళకి
ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ , అందరికి ఉపయోగ పడే విధంగా కొంత మందికి
సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం
చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది .
మీ
శ్రేయోభిలాషి ..... అస్త్ర అగ్ని జ్వాలా ..........
ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
No comments:
Post a Comment