ఎపిసోడ్ : 15
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "
ఆందోళన అనారోగ్యానికి మూలము .ప్రయత్న లోపము లేకుండా ప్రయత్నము చెయ్యి .
ఫలితం ఏది అయినా ధైవ ప్రసాదంగా స్వీకరించు
.
( దీని అర్ధం చూద్దాము
: మనము
తెలియకుండానే సత్యాన్ని గ్రహించలేక చాలా అందోళన పడుతూ వుంటాము దానితో ఆ ప్రభావము
మన శరీరములోని అన్ని అవయవాల ఫై న పడి పని నియంత్రణకు అవరోధం కలిగిస్తాయి . అదే మన
అనారోగ్యానికి మూలముగా అవుతుంది . “ ఆరోగ్యమే మహాభాగ్యము “ . ఆరోగ్యము లేక పోతే
మనము ఏమి చెయ్యలేము అన్న విషయాన్నీ తెలుసుకోoడి. ముందు ఆత్మికముగా మనలో శాంతిని
నింపుకోవాలి . శాంతియే అన్నింటికి మార్గాన్ని చూపిస్తుంది . నువ్వు నీ జీవితంలో
ఏది చెయ్యాలని అనుకున్నవో అది ప్రయత్న లోపము లేకుండా చెయ్యి . అందరికి మంచి
జరగటానికి చెయ్యి . నీ స్వార్ధం కోసము
చెయ్యకు . ఎప్పడు అయితే నీ స్వార్ధం కోసము
చేయ్యవో నీకు తెలియకుండానే నీవు పరమాత్మకు దగ్గర అవుతావు . నీను తెలియకుండానే
శాంతిని పొందుతావు . ఫలితం ఏది అయినా దానిని దైవ ప్రసాదముగా స్వీకరించండి . అదే మీ
జీవితాన్ని ఆధ్యాత్మిక పైనము వైపు కొనసాగిస్తుంది . నీ జీవిత పరమార్ధాన్ని
తెలుసుకుని నీ పయనాన్ని ఆత్మ పరివర్తన అవ్వడానికి వినియోగించు . దాని వలన నీకు
కలిగే ఆత్మ సంతృప్తిని నీకు నువ్వే గమనించుకో ) అందోళన నీకు ఎప్పుడు అయితే
వస్తుందో అప్పుడు ఎప్పుడు నేను అచోల్ ఆడోల్ ఆత్మను అని అనుకొండి . మీకు
తెలియకుoడానే మీరు నిశ్చలoగా వుండిపోతారు . ఏది జరిగిన ఎలాంటి ఫలితము వచ్చిన మన
జీవితములో ముందుకు మాత్రమే అడుగు వెయ్యాలి . వెనుక అడుగు మాత్రము వెయ్యకూడదు .
అందోళనయే మనిషి జీవితానికి మంచి బాటలో అడుగువేయటానీకో లేక చెడుకు దాసోహము అనడములో
పునాదిగా మారి వారి జీవిత పయనాన్ని ఆదర్శ నీయముగానో లేక వినాశనము చేసుకోవడానికో
మార్చుకుంటాడు . అందోళన పడద్దు అని చెప్పటము సులభమే అని అనుకోవద్దు . అది కూడా చాల
కష్టముతో చెప్పవలసి వస్తుంది . ప్రస్తుత కాలములో అందోళనలో లేని వారు ఎవరు వున్నారు
. ప్రతి ఒక్కరి జీవితములో ఎదో ఒక సమస్య దానితో మనకు తెలియకుండానే అనారోగ్యమును
పొందుతున్నాము . ఒక్కసారి ఆలోచించండి ఇది అంతా మనకు అవసరమా మనిషి జీవితం చాల
చిన్నది . వున్న సమయములో వున్న దానితో సంతృప్తి చెందుతూ మన జీవిత క్షణాలను మన
అందరి తండ్రి అయిన పరమాత్మ యొక్క స్మృతిలో ఆయన ఇస్తున్న ప్రకాశాన్ని పొందుతూ మన
ఆత్మలో శాంతిని నింపు కుంటే ఎంత బాగుంటుందో కదా !
కాలము విలువైనది – రేపు అను దానికి రూపు లేదు .
మంచి పనులు వాయిదా వేయకు . ( దీని అర్ధం చూద్దాము
: కాలము
చాల విలువైనది . గడిచి పోయిన కాలము తిరిగి రాదు . అని మనము తెలుసుకొని కూడా మనము
జరిగిన దానికి బాధ పడుతూ , కాలాన్ని వృధా చేస్తూ వుంటాము . ఇప్పుడు నాకు ఒక
అనారోగ్య సమస్య ఎదురు అయ్యింది అనుకొండి . దాని గురించి చింతిస్తూ వుంటే ఏమి
జరుగుతుంది . కాలము గడిచిపోతుంది కాని దాని వలన ఉపయోగం ఏమి అయిన వుందా ? జరిగిన దాని
గురించి ఆలోచించకుండా ఇప్పుడు అనారోగ్య కారణమును నేను ఎలా నివారించవచ్చు అనే దాని
ఫై ఆలోచించి . నీకు వున్న ఆరోగ్య సమస్యను ఎలా నియంత్రణకు తీసుకురాగలవో ఆలోచించు .
ముందుగా మనము ఇక్కడ తెలుసుకోవలసింది నేను ఏ విషయములో మన మనస్సు గాయ పడిందో
తెలుసుకోవాలి . దాని తరువాత ఆ బాధను మన అలౌకిక తండ్రికి ఇచ్చివేయాలి . దాని కోసము
నేను ఒక ఆత్మను అన్న స్వమానములో స్వధర్మం శాంతి అని తెలుసుకోవాలి . మనలో ఆత్మికతను
పెంచుకోవాలి . దాని వలన మనకు తెలియకుoడనే
మన శరీరములోని అవయవాల ఫై ప్రభావము పడుతుంది . కొన్నిసార్లు తొందరిగా మన అనారోగ్యము
నయం అవటములో పని చేస్తుంది . ఏది అయిన మన మనస్సు ఫై ఆధార పడి వుంది . కొన్నిసార్లు
మన ఆరోగ్యము మన చేతిలో లేదు అని తెలిసిపోతుంది . అంటే ఎక్కువ రోజులు బ్రతకము అని
అర్ధం అవుతుంది . అప్పుడు అందరు అందోళనలోకి వెళ్ళిపోతారు . అది సహజము . కాని ఆ
సమయములోనే మీరు చాల దైర్యముగా వుండండి . ఎలాగో మీ జీవిత సమయము ముగిసి పోయే సమయం
దగ్గర పడింది అని తెలుసు . ఆ సమయములోనే మీరు మీ ఆత్మలో పరమాత్మ యొక్క ప్రకాశాన్ని
, శక్తిని , ప్రేమను , శాంతిని , జ్ఞానమును , ఆనందమును , సుఖాన్ని నింపుకోవాలి.
దానితో నిరోగి ఆత్మగా మారిపోవాలి . ఆత్మలో శక్తిని నింపుకోవటం వలన మనలో ఆత్మ
విశ్వాసం పెరుగుతుంది . దాని వలన మనకు
లోపల ఎంత నొప్పి వున్నా బయటకు చూపము . నేను బ్రతికి వున్న కొన్ని రోజులు నేను
సంతోషముగా జీవించ గలను అని నీకు ఆనందము కలిగించే పనులను చేసుకో !
మంచి పని చేసేందు వాయిదా
వెయ్యక ! అందరికి ఆదర్శప్రాయముగా నీ జీవితం నిలిచేలా చేసుకో ! నీవు చేసే మంచి పని
కోసము రేపు చేద్దాము అని మాత్రము అనుకోవద్దు . రేపు నీ జీవితములో ఏమి జరుగుతుందో
కూడా తెలియదు . దీని అర్ధం నీ ఆయువు వుండచ్చు లేక పోవచ్చు . కనుక సమయాన్ని అస్సలు
వృధా చేసుకోకుoడా మీ మనస్సును పరమాత్మ యొక్క ప్రకాశము ఫై ఏకాగ్రత చెయ్యండి . మీ
జన్మకు గల కారణము తెలుసుకుని మీ జీవిత గమ్యాన్ని తెలుసుకోండి .)
ఈ రోజు ధారణ పాయింట్ : నేను
నిరోగి ఆత్మను . నేను శాంతి స్వరూప ఆత్మను .
పరమాత్మ ఇస్తున్న ధారణ :
జరిగిపోయిన విషయాల గురించి చింతన చేయకూడదు . జరిగిన విషయము నథింగ్ న్యూ (
క్రొత్తది ఏమి కాదు ) అని భావించి మర్చిపోవాలి .
ఈ రాజస్వ అశ్వమేధ యజ్ఞములో
మీ శరీరమును , మనస్సు , ధనము అన్నింటినీ స్వాహా చేసి సఫలము చేసుకోవాలి . ఈ అంతిమ
జన్మలో సంపూర్ణ పావనముగా అయ్యోoదుకు శ్రమ చేయు .
మిగిలిన
విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం !
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన
ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన
వాటికీ , అందరికి
ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను . నేను
ఒక ఆక్యూపoచరిస్ట్ గానే కాదు , ఒక తత్వవేత్తగా నా
చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు
గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను
మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి .
మిగిలినవి వదిలివేయండి
. ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది .
ఎవరి నిర్ణయం వారిది . మీ శ్రేయోభిలాషి--------
> అస్త్ర అగ్ని జ్వాలా ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
No comments:
Post a Comment