Wednesday, July 29, 2020

ఎపిసోడ్ : 8 " ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "


ఎపిసోడ్ : 8
                        " ఆత్మిక దృష్టితో సూక్ష్మ –  స్థూల వైద్య రహస్యము "

ముందు సంచికలో చెప్పుకున్నాము  వాయుమండలము ఎప్పుడు అయితే శాంతిగా మారుతుందో అక్కడా నివసిస్తున్న వారు కూడా శాంతితో ఉంటారు . మనము పరమాత్మ నుంచి శాంతి తీసుకుని మనలో నింపుకుంటూ వున్నప్పుడు , మనలో వున్న  శాంతి ప్రకంపనాలు స్థూలంగా ఎదుటివారిని శాంతి ప్రకంపనలు తగులుతాయి . దానితో మన దగ్గరు వచ్చిన వాళ్ళు శాంతిని అనుభూతి చెందగలరు . సూక్ష్మముగా వాయుమండలము అంటే ప్రకృతి శాంతిని పొందుతుంది . ఎప్పుడు కూడా ఆత్మికతను మనలో నింపుకునేటప్పుడు ఈ రెండు విషయాలను గుర్తుకు ఉంచుకోవాలి . దాని ప్రభావము మన శరీర అవయవాల ఫై కూడా పడుతుంది . మనలను ఆత్మికముగా , శారీరకంగా కూడా ఆరోగ్యముగా ఉండేటట్టు చేస్తాయి .

 సత్యానికి - అసత్యానికి , ధర్మానికి - అధర్మానికి తేడా తెలియక అమాయక స్థితిలో ప్రవర్తిస్తాడు . ఈ వాక్యాన్ని మరి ఇంత  లోతుగా తీసుకుందాము .చాలా మంది చాలా సార్లు అనుకుంటారు ఎదుటివారిని చాలా చక్కగా మోసం చేసాము అని .నాదే ఫై చెయ్యి అవుంటుంది అని . కానీ మనము ఒక విషయము ఎందుకు మరిచిపోతాము అన్నది నాకు ఎప్పుడు అర్ధం కాదు . అసత్యము మరియు అధర్మము కాని ముందుగా గెలిచినట్టు  ఉంటుంది కానీ చివరికి గెలిచేది సత్యము లేక ధర్మము అని తెలిసినప్పటికీ తనను తానూ మోసం చేసుకుంటూ , అందరిని మోసం చేయటము మనకు అవసరమా అని ఆలోచించడు . వారిలో పాప భీతి కూడా ఉండదు . నేను తెలుసుకున్న సత్యం పరమాత్మ నా అలౌకిక తండ్రి . మొదటిగా నన్ను నేను మార్చుకోవాలి . అంటే స్వయంలో మార్పు తెచ్చుకోవాలి అన్న విషయాన్నీ నేను ఎందుకు మరిచిపోయాను . " స్వ పరివర్తన ఉన్నతికి సోపానము , పరచింతన వినాశనమునకు నాంది " అన్న విషయాన్ని తండ్రి అయిన పరమాత్మ మనుకు ఇప్పుడు స్వయముగా తెలియచేస్తున్నారు . ఆ సత్యాన్ని  నేను ఇప్పుడు తెలుసుకుని నా జీవితాన్ని ఎటు నడిపిస్తున్నాను ? అన్న ప్రశ్న వేసుకుంటున్నారా ? అసలు " స్వ పరివర్తన  అంటే ఏమిటి ? అన్న ఆలోచన మీకు రావటం లేదా ? నాకు అయితే ఆలోచన వచ్చింది ? ఇప్పటివరకు ఆలోచించకపోతే ఇప్పుడు ఆలోచిస్తూ దాని అర్ధాన్ని తెలుసుకుందాము . స్వ అనే పదానికి అర్ధం నేను అని . నేను అంటేనే మనము తెలుసుకున్న దాని ప్రకారము వచ్చే ఆలోచన నేను ఆత్మను అని . పరివర్తన అనే పదానికి అర్ధం మార్పు తెచ్చుకోవటం / కొత్త మార్పును తెచ్చుకోవటం . జాగ్రత్తగా అర్ధం చేసుకొంది ఇక్కడ మార్పు మన ఆత్మిక స్థితిలో ఆత్మ స్వధర్మము అయిన శాంతిని కోల్పోయింది అని తెలుసుకుని , ఆత్మ కోల్పోయిన శక్తులను తిరిగి నింపుకోవటానికి మన అందరి తండ్రి అయిన పరమాత్మ సహయోగాన్ని నేను ఎలా పొందగలను అన్న పరివర్తనను తెచ్చుకోవాలి .నేను స్వయాన్ని పరివర్తన చేసుకున్నాను . మరి మీరు ? ఇక్కడ ఎవరి ఇష్టం వారిది ." స్వ పరివర్తన ఉన్నతికి సోపానము ". దీని అర్ధం నేను ఎప్పుడు అయితే నా అలౌకిక తండ్రిని గుర్తించానో , నా ఆత్మిక స్థితి కూడా ఉన్నతముగా మారిపోతుంది . దాని ప్రభావం  లౌకికములో నా ప్రవర్తన ఫై ప్రభావము కుడా పడుతుంది . నేను ఒక దివ్యమైన ఆత్మగా నా ప్రవర్తన ఉంటుంది . ఎప్పుడు అయితే నాలో స్వయాన్ని ప్రవర్తన చేసుకుంటున్నానో , ఆ ప్రభావము నా శరీరములోని అన్ని అవయవాల ఫై ప్రభావము పడుతుంది .  ఆ దివ్యమైన ప్రభావము వలన నా శరీరములోని అన్ని అవయవాలు నిరోగిగా మారటం ప్రారంబిస్తాయ్యి . ఇక్కడ నేను చెప్పే విషయము కర్మల నుంచి అయితే తప్పించుకోలేము కాని కొన్ని సార్లు ఎంత అనారోగ్యముగా వున్నా మన ఆత్మిక శక్తి వలన మనము ఆ శారీరక భాధను తెలీకుండా , లేక మనకు శారీరక భాధ వున్న అంతగా పట్టించుకోకుండా మన పనులు మనము చేసుకునే శక్తిని పరమాత్మ నుంచి పొందగలము . దాని వలన మనము జీవితములో ఎన్ని అవరోధములు వచ్చిన వాటిని దాటుకుని ముందుకు వెళ్లగలము . " పరచింతన వినాశనమునకు నాంది " మన స్వయమును మార్చుకోకుండా ఎదుటివారు మారాలి అని నీతులు చెప్పడము వలన అదే మన వినాశనం అవుతుంది అని పరమాత్మ తెలియ చేస్తున్నారు . అంటే ఇక్కడ పక్క వారికీ సహయోగమును ఇవ్వకూడదు అని కాదు . ముందు మనము ధారణ చేసి ఎదుటివారికి చెప్పాలి . అలాకాకుండా నేను పాటించను కానీ నువ్వు పాటించాలి అని అంటే మనకు మనమే ఎదో ఒక రోజు వినాశనమును తెచ్చుకున్నట్టు అవుతుంది . యిన చెప్పాలి అనుకున్నప్పుడు నాకు ఆ విషయము ఫై అవగాహనా మరియు నాకు పూర్తిగా ఆ విషయములో  అనుభవము ఉండాలి. అప్పుడే నేను చెప్పగలుగుతాను. నాకే సరిగ్గా తీయకపోతే నేను ఎదుటివారికి ఏమి చెప్పగలను ? ఎవరు అయిన ఏమి అయిన ప్రశ్నలు అడిగితె కూడా నేను వారికీ సమాధానము చెప్పాలి .ఒక వేళ  చెప్ప లేక పొతే   అందరిలోనూ మనకు దక్కేది ఏమిటి అవమానము మాత్రమే అది మనకు అవసరము లేదు అందుకే ఏది అయినా విశ్లేషణ వున్నప్పుడు చాల జాగ్రత్త గా మాట్లాడాలి అని మరచిపోకండి  .

అందుకే సత్యాన్ని గుర్తించి స్వ పురుషార్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మార్చుకోవటానికి పరమాత్మ సహయోగముతో ముందు అడుగు వేద్దాము . ( సత్యం అంటే పరమాత్మ ఇప్పుడు సాకారములో తండ్రి స్థానములో మనలను లాలిస్తున్నారు , పాలిస్తున్నారు , చదివిస్తున్నారు. )


 మిగిలిన విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం ! ఒక ధారణ పాయింట్ ని మీకు అందజేస్తున్నాను .నచ్చిన వారు ప్రయత్నం చేయవచ్చు లేక పోతే వదిలి వేయండి ?


ప్రశ్న : నేను ఎవరు ?
సమాధానము : నేను ఆత్మను .

ప్రశ్న : ఆత్మకు వున్న సూక్ష్మ శక్తులు ఏవి ?
సమాధానము : 1 . మనస్సు 
2 . బుద్ధి
                    3 . సంస్కారము .

ప్రశ్న : నాది అనేది ఏది ?
సమాధానము : శరీరం - దేహాభిమానము - సాకార లోకము / భూలోకము - వినాశి

ప్రశ్న : నేను అనేది ఏమి ?
సమాధానము : ఆత్మ - ఆత్మాభిమానం - అవినాశి ( అలౌకిక సంబంధమును  తండ్రి అయినా పరమాత్మ తో ఏర్పాటు చేసుకోవడము  )

మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ అందరికి ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను .  నేను ఒక ఆక్యూపుంచరిస్ట్ గానే కాదు ,ఒక తత్వవేత్తగా  నా చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి . మిగిలినవి వదిలివేయండి . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది . 

మీ శ్రేయోభిలాషి-------- > అస్త్ర  అగ్ని జ్వాలా    
ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్





No comments: