ఎపిసోడ్ : 2
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ –
స్థూల వైద్య రహస్యము "
ముందుగా మన అందరికి ఒక్క విషయము పూర్తిగా
అర్ధం అయింది అని అనుకుంటునాను. వైద్యము అంటే రెండు రకాలు అని అది సూక్ష్మము మరియు
స్థూలమునకు సంబంధించినది.అంటే మనము సంపూర్ణమైన ఆరోగ్యమును పొందాలి అంటే సూక్ష్మముగా
మరియు స్థూలంగా కూడా ఆరోగ్యముగా ఉండేటట్టు చూసుకోవాలి .సూక్ష్మము అంటే ఆత్మకు అందించే వైద్యము
. స్థూలము అంటే శరీరమునకు అందిందే వైద్యము .మన అందరికి తెలిసిందే మన శరీరాన్ని
నడిపించేది ప్రాణము అని . కానీ ప్రాణము అంటే ఏమిటి అని ఎవరైనా ప్రశ్న
వేసుకున్నారా ? ప్రాణము అంటే చాల మంది మనస్సు అని అనుకుంటారు
. అది ఎంత వరుకు నిజము ? అసలు మనస్సు అంటే ఏమిటి ? దానికి ఏమి అయిన
రూపము వుందా ?మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది ? అన్న ప్రశ్న ఎవరికైన ఎప్పుడు అయిన
వచ్చిందా ? మనస్సు గురించి చాల మంది చాలా రకాలుగా ఉహాగానాలు చేసుకుంటూ ఎవరికీ
నచ్చిన రీతిలో వారు తెలియచేస్తారు. మన శరీరాన్ని నడిపించే ఆ అతీంద్రియ శక్తిని ఏమి
అంటారు ? అని ఇప్పుడు తెలుసుకుందాము మన శరీరాన్ని
నడిపించేది ఆత్మ .ఏమిటి ఆత్మ నా అని మీరు అనవచ్చు .ఇక్కడ ఆత్మ అని ఉపయోగించాను అని
ఎవరు కంగారు పడవలసిన అవసరము లేదు . సత్యాన్ని నిర్బయoగా అంగీకరించాలి . అవును
ఆత్మనే మనకు పూర్తిగా జ్జ్ఞానము లేక పోవటం వలన వాడుక భాషలో మనము దానిని ప్రాణము
అని అనేస్తాము . మరి ఆత్మ మన శరీరములో ఎక్కడ ఉంటుంది ? ఎక్కడ నుంచి మన శరీరాన్ని నడిపిస్తుంది ? చాల మంది మాకు
తెలియదు అని అంటారు . చాల మంది హృదయములో ప్రాణము ఉంది అని అంటారు . అది చాల తప్పు
అని మీకు ఇక్కడ అర్ధం అవుతుంది . ఇక్కడ మనల్ని మనము ఒక్క సరి ప్రశ్న వేసుకుందాం .
ఒక రాజు వున్నాడు అనుకొండి ,
ఆ రాజు రాజ్య
సభలో ఎక్కడ కుర్చు౦టాడు ? సభలో అందరి కన్నా ఫై స్థానములో అవునా ? అలాగే ఆత్మకూడా మన శరీరములోని కర్మేద్రియాలకు ఫై స్థానములో అనగా బృహిటి మధ్య
స్థానములో సింహాసనాన్ని అధిష్టించి బిందు స్వరూపములో జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది . అదే మనలను అనగా శరీరాన్ని
నడిపిస్తుంది . అది ఒక చైతన్యవంతమైన శక్తి . ఈ విషయము మనము గ్రహించక పోవటం అనేది మన
అమాయకత్వం అవుతుంది . ఇక్కడ ప్రతి ఒక్క జీవి తెలుసుకోవలసిన సత్యం ఆత్మకు వున్న
అంతర్గత స్థితులే మనస్సు , బుద్ధి , సంస్కారము. దీనికి కుల , మత , వర్గ బేధము
లేకుండా అంగీకరించవలసిందే . ఎవరికీ దైవము ఫై నమ్మకము లేదో వారు కూడా ఈ విషయాన్ని
అంగీకరించవలసిందే . మీ అందరికి ఏమిటి ఈ మనస్సు , బుద్ధి , సంస్కారము వాటికీ గల
తేడా ఏమిటి ? అసలు ఆత్మ కు వైద్యాన్ని తీసుకోవటంలో వీటి పాత్ర ఏమిటి అని
ఆలోచిస్తున్నారా ?నేను ఆరోగ్యంగా వుండటానికి దీనికి సంభందము ఏమిటి అని కూడా మీరు
ఆలోచించవచ్చు . అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాము . ఇక్కడ మీకు ఒక ఉదాహరణను
తీసుకుంటూ తెలియజేస్తాను . కొంచం సేపు నేను చెప్పేదానిని మీరు మీ కళ్ళ ముందు
కనబడుతుంది అని అనుకొండి . మనము రోడ్డు ఫైన నడుస్తున్నాము అనుకోకుండా ఒక మంచి పూల
తోట వున్న మార్గములోకి వెళ్ళాము .నా మనస్సు ఇప్పుడు ఆ పువ్వుల తోట వైపు వెళ్ళింది
.వెంటనే నా కర్మేద్రియాలలో ఒకటి అయిన కళ్ళు ఆ పువ్వుల వైపు చూశాయి. వెంటనే నా
బుద్ధి ఏమి చెప్పుతుంది. ఆహా ఆ పువ్వులు ఎంత అందముగా వున్నాయి . కొంచము సేపు
ఆస్వాదించాలని అనుకుంటాము . దానికోసం ఏమి ఏమి చేయవచ్చు . ఆ సమయములో మన బుద్ధి
ఇచ్చే సూచనలు ఏమిటి ? ఒకటి కొంచం సేపు తోటలోకి వెళ్ళి కుచ్చుoదాము , లేకపొతే ఒక
పువ్వు కొయ్యాలి అని అనిపించేలా చేస్తుంది . బుద్ధి సంస్కారమునకు ఎలా ప్రేరణ
అవుతుందో చూద్దాం . సంస్కారము అంటే అమిటి ? కర్మను చేయడం . దాని అర్ధంను ఇక్కడ
చూద్దాం. ఇప్పుడు తోటలోకి వెళ్ళి కూర్చున్నాను , పువ్వు కూడా కోసాను . పువ్వు
కోసాను అనే దానితో నా కర్మను నేను తయారు చేసుకున్నాను . ఇది ఏమిటి ఇవి అన్ని నా
ఆరోగ్యం ఫై ఎలా పని చేస్తాయి అన్న ఆలోచన రావటం లేదా ? సరే మరి ఇప్పుడు వచ్చిoది
అని అనుకుంటున్నాను . జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి . నేను ముందు రోడ్డు ఫై
నడిచేటప్పుడు నాలో ఎదో తెలియని ఆవేదనతో వున్నాను . ఆ సమయములో నా మనస్సుకు విశ్రాంతి కావాలి అనుకుంది నా మనస్సు నా కళ్ళను
దారిలో వున్న పువ్వుల తోట ఫై కి మళ్లించింది .నా బుద్ధితో కొంచం సేపు విశ్రాంతి
తీసుకుని నా అంతర్గతoగా వున్న సంస్కారము తో పువ్వును కోసి దానితో ఆనందించాను అని
అనుకొండి . అప్పుడు ఏమి జరుగుతుంది .
వెంటనే ఆ ప్రభావం నా మనస్సు ఫై పడి నా ఆత్మను ఆనంద పడేలా చేస్తుంది . దాని వలన నా
ఆత్మ చైతన్యం అవుతుంది. దానితో నా ఆత్మ శాంతిలో కి వస్తుంది . వెంటనే ఆ ప్రభావం నా
శరీరములోని అన్ని భాగాల ఫై న పడుతుంది . ఎప్పుడు అయితే నా భాదను నేను కొంచం సేపు మర్చిపోయనో , నేను
వెంటనే అనుభూతి చెందుతాను శారీరకంగా నేను చాల ఉల్లాసముగా వున్నాను అని . నేను
ఇప్పుడు ఏ పని అయిన చేయగలను అని . నేను ఎప్పుడు అయితే నా ఆత్మను శాంతి స్థితిని
పొందుతానో , అప్పుడు నేను శారీరకంగా కూడా ఆరోగ్యంగా వుండగలను . నేను అనారోగ్యంగా
వున్నా కూడా నేను ఆనందముగా జీవించగలను. ఏది ఎప్పుడు అంటే నేను పరమాత్మ నుంచి
శక్తిని తీసుకుంటూ నా ఆత్మను శాంతి స్థితిలో వుంచుకుంటానో , అప్పుడు నేను నాకు
తెలియకుండానే నా అనారోగ్యం ఫై పూర్తి విజయాన్ని సాధించి నిరోగిగా మారిపోతాను. మీరు
అందరు ఒక ప్రశ్న వేసుకోవచ్చు ఇక్కడ ఏమి చెప్పుతున్నారు ? ఇది అంతా నిజమా ?
నిరోగిగా మారటం అంటే నా శారీరక అనారోగ్యం పూర్తిగా నయం అయిపోతుందా ? మనము ఇక్కడ
ఎప్పుడు మర్చిపోకూడదు “ కర్మ సిద్ధంతాన్ని “ . కర్మల ఫలితాలను ఎవరికీ వారే
అనుభవించాలి . ఆత్మలో శక్తిని నింపుకోవటము వల మనము వికర్మ జీత్ లుగా అవ్వగలము. అది
ఎలా అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది . మన అనారోగ్యం ఎలా వున్నా మన అత్మిక
శక్తితో మన శరీరాన్ని చక్కగా నడిపించగలము . నా ఫై ఎవరు అయినా జాలి పడితే నాకు
నచ్చదు. మరి మీకు ? అంటే నా ఉదేశ్యము చాల మంది అనారోగ్యంను అవకాశముగా తీసుకుని
జాలి పడాలని లేక జాలి పొందాలి అని అనుకుంటారు . వారిని వీరిని నమ్ముతారు కానీ ,
వాళ్ళను వాళ్ళు నమ్ముకో లేరు ఎందుకు ? మనలను మనము నమ్ములోక పోవటము మన బలహేనతయే
అవుతుంది . మరి ఆ బలహేనత నుంచి శక్తి శాలిగా మనలను మనము తయారు చేసుకోవటానికి
ముందుగా మన ఆత్మలో శక్తిని నింపుకోవాలి . ఆ శక్తి ఎక్కడ నుంచి ఎలా నింపుకోవాలి అని
ఆలోచిస్తున్నారా ? మీరు మీమ్మల్ని స్వయం ఆత్మ గా భావించి “ నేను శక్తి స్వరూప
ఆత్మను అన్న స్వమనములో స్థితులు అయినట్టు అయితే స్వయం పరమాత్మ నుంచి మీరు శక్తి మీ
ఆత్మలోకి ప్రవేశిస్తుంది . దానితో మీలో వున్న భాలహేనతలు పారిపోతాయి . ఆత్మలో
శక్తిని ఎవరికీ వారే నింపుకోవాలి .ఈ విధముగా చేయటం వలన సూక్ష్మముగా ఆత్మలో శక్తి
నిండుతుంది . స్థూలముగా జరిగే వైద్య రహస్యమును తెలుసుకోండి . నరాలకు సంభందించిన ,
ఎముకులకు సంభందించిన సమస్యల నుంచి మనకు
చాలా వరుకు ఉపసమానము కలుగుతుంది. మీరు కావాలి అంటే “ “ నేను శక్తి స్వరూప
ఆత్మను “ అని మీకు రోజులో ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకుని
చూడండి మీకే తేడ తెలుస్తుంది . ఇక్కడ అందరికి ఒక ప్రశ్న రావచ్చు అయితే మీము
డాక్టర్ దగ్గరకు వెళ్ళ వలసిన అవసరము లేదా ? అని లేక పోతే మందులు వాడాల్సిన అవసరము
లేదా ?నేను ఇక్కడ డాక్టర్స్ దగ్గరకు
వెళ్ళవద్దు అని చెప్పటము లేదు . మందులు వాడవద్దు అని చెప్పటము లేదు .మీ ఆత్మలో
ముందు పరమాత్మ శక్తిని నింపుకోవాలి . మన శరీరాన్ని నడిపించేది మన ఆత్మ యే కనుక
ముందుగా ఆత్మ శక్తి శాలిగా మారితే మనము శరీరానికి తీసుకన్న వైద్యము తొందరిగా పని చేస్తుంది అని చెప్పుతున్నాను అంతే.
మిగిలినది వచ్చే సంచికలో చూద్దాం ! మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు
అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన
వాటికీ , అందరికి ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను .
అందరు సంపూర్ణ ఆరోగ్యంగా మారాలి . ఆత్మ యొక్క శక్తి ని అందరు గుర్తించాలి .
పరమాత్మ ఇస్తున్న వైద్యం విశ్వం లోని ప్రతి ఒక్క ఆత్మకు అందాలి అనే సంకల్పముతో మీ
ముందుకు వచ్చాను . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి
జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది . మన కోసం మనమే బ్రతకాలి. అని ఆశిస్తూ ...
మీ శ్రేయోభిలాషి-------- > అస్త్ర అగ్ని జ్వాలా
ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
No comments:
Post a Comment