ఎపిసోడ్ : 5
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము
"
ఈ సంచికలో సృష్టి యొక్క రహస్యము అంటే
ఏమిటి అని తెలుసుకుందాము . దానిని తెలుసుకోవడానికి మనము కొంచం లోతు
ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలి . నాతో పాటు
మీరు అందరూ కూడా
మీ ఆత్మిక స్థితిని పెంచుకుంటారు అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా అంతరంగము లోకి వెళదాము .నేను ఎవరు ?
మన నిత్య
జీవితములో ఒక్కసారి అయిన నేను ఎవరు ?
అన్న ప్రశ్నను వేసుకోని వాళ్ళు ఎవరు అయినా వుంటారా ? సరే కొంత మంది అనవచ్చు నేను ఇప్పటి వరుకు
నేను ఎవరిని అన్న ప్రశ్నను వేసుకోలేదు అని . అయితే సరే మరి ఇప్పుడు మనకు మనము
ప్రశ్న వేసుకుoదాము అది నేను ఎవరు ? అసలు ఏ సమయములో ప్రతి మనిషి నేను ఎవరు అనే
ప్రశ్నను వేసుకుంటారు .ఒక్కసారి ఆలోచించండి .మనిషి ఏ రోజు అయితే నిరుత్సాహనికి గురి అవుతారో అప్పుడు ఆ మనిషి తనలో తానూ అన్వేషిoచటము మొదలు పెట్టినప్పుడు ఉత్త్పన్న మైయ్యే ప్రశ్నయే
నేను ఎవరు ?........ అసలు నా జీవితం ఏమిటి ?...... నా జన్మ ఎందుకోసము ?.......
ఎవరి కోసము ?........ నా గమ్యము ఏమిటి
?....... ఈ లోకం నాది
కాదు ! ఈ మనుషులు నా వారు కాదు ! నా ఇల్లు ఏది ?
........నా అనే వారు ఎవరు ?........... నేను ఎవరికి చెందుతాను?........ నాలో ఈ అలజడి ఏమిటి
?..........నాలో రగులుతున్న
ప్రశ్నలు అనే అగ్ని జ్వాలను సమాధాన పరిచేవారు ఎవరు
?......... నా మనస్సు
ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్న ఆలోచనలతో మనిషి సంధిద్దములోకి
వెళ్ళి పోతూ చీకటి అంధకారములో వున్న తనకు
వెలుగును చూపించేది ఎవరు అని ఆలోచిస్తూ ........ నేను ఎక్కడ నుంచి
వచ్చాను ?.......... నేను ఏమి చేస్తున్నాను ?...... ఎక్కడకి నా పయనము కొనసాగించాలి ?..... ఏది శాశ్వతము ?
ఏది అశాశ్వతము ? ........ ఏది నిజము ....?
ఏది అబద్దం ? ...... నా జన్మకు గల కారణము ఏమిటి ? ...... కాల చక్రము / జన్మ చక్రాల
రహస్యము ఏమిటి ? ....... ఈ ప్రపంచము ఏమిటి ?.........ఈ ప్రపంచమంతా ఆకర్షణమైన మాయెనా ?....... నా గురించి నేను ఎలా తెలుసుకోవాలి ?.......... దాని గురించి మనిషి యొక్క తత్వాన్ని మనము
జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి . ఇక్కడ మనము కొంచం సేపు మనిషి తత్వాన్ని తెలుసుకుందాము .
గాలిలో మేడలు కడతాడు , కలలలో జీవిస్తాడు అదే నిజం అని నమ్ముతాడు . అర్ధం : ప్రతి ఒక్క
వ్యక్తి కూడా చాల వరుకు నేను ఇలా చేసేస్తాను, ఆలా చేస్తాను లేక అప్పుడు నేను ఎంతో చక్కగా బ్రతుకుతాను అని కష్టపడకుండానే కూర్చుని తన భావాలను తెలియచేస్తూ గాలిలో మేడలు కటేస్తాడు. గాలిలో మేడలు కడితే ఏమి అవుతుంది అని
మాత్రమూ ఆలోచించడు. లేక గాలిలో దీపము పెట్టి చేతులు అడుపెట్టకుండా లేక ఏమి అడుపెట్టకుండా దీపము వెలగాలి అని దేవుడా నువ్వే దిక్కు అని అంటాడు . అది ఎంత వరుకు ఒప్పు మరియు దాని వలన
వచ్చే ఫలితము ఏమిటి అని అర్ధం చేసుకోలేరు . ఇంకా కొంతమంది ఏమి చేస్తారో చూద్దాము ! ఎవరు అయిన సహాయము కోసము వస్తే వారు మాత్రమూ చాల తేలికగా తీసుకుని వారిలో చాల చాల ఆశలు రేపుతారు .
ఇంకేమి ఉంది నువ్వు ఎలా ఫై కి వస్తావో చూడు . నా దగ్గరకు వచ్చావుగా చూడు నీ జీవితం మారిపోతుంది అని చెప్పుతారు . దానితో ఎవరు అయితే సహాయము తీసుకోవడానికి వచ్చారో వారు కలలో జీవించటం మొదలు పెడతరు . తానూ అనుకున్నది జరగపోతున్నది అని ఆశలు పెంచుకుంటాడు . కాని ఎవరు అయితే
కలల్లో జీవిస్తారో వారు వాస్తవిక ప్రపంచంలోకి రాలేక తమను తామే మోసం చేసుకుంటారు మరియు ఇతరులను మోసం చేస్తారు . దాని వలన వారికీ ఏమి లాభము అన్నది మాత్రమూ తెలుసుకోలేరు .
ఒక్క విషయాన్నీ గుర్తు పెట్టుకొండి ఎవరి జీవితాన్ని ఎవరు మార్చగలరు ? ఎవరు మార్చలేరు . మీ రాతను మేరె రాసుకుని
వచ్చారు . మీ రాతను మీరే మార్చుకోగలరు వేరు ఎవ్వరు కాదు అని మాత్రము తెలుసుకోలేడు. నేను నమ్మవలసింది ఒక్క నా అలౌకిక తండ్రి అయిన పరమాత్మనే అన్న
విషయాన్నీ మరచిపోతాను . చాల మందికి లౌకికము మరియు అలౌకికము అంటే ఏమిటో
తెలియదు . ఇక్కడ
మీకు వివరిస్తున్నాను . లౌకికము అంటే సామాజిక జీవనము జీవించటం . ఇక్కడ ప్రతి ఒక్క జన్మకు ఒక్కొక్క లౌకిక తండ్రి ఉంటారు . అలౌకికము అంటే ఆత్మిక స్థితిలో కి
వెళ్ళటం . అలౌకికములో ప్రతి ఒక్క ఆత్మకు తండ్రి ఆ
శివ పరమాత్మయే . శివ అంటే నిరాకారుడు - రూపం లేని వాడు . పరమాత్మ అంటేనే ఒక అత్యఅద్భుతమైన ప్రకాశము . శక్తి ,
శాంతి , సుఖం , ఆనంద ,
పవిత్రత , జ్ఞాన , ప్రేమ కిరణాల కూటమితో వున్న వర్ణాతీతమైన దివ్యమైన స్వరూపం .
ఇప్పుడు నేను
పరమాత్మ యొక్క స్వరూపాన్ని అనుభూతి చెందుతున్నాను .ఓహో
నా జీవితం ఎంత ధన్యమైనది కదా అని అనిపిస్తుంది . మరి మీకు . ఆ ప్రకాశాన్ని , దివ్యమైన పరిస్థ స్వరూపాన్ని చూస్తూనే ఉండిపోవాలి అని అనిపిస్తుంది . ఎంతటి సుందరమైన దృశ్యము
.నా కర్మేద్రియములలో ఒకటి అయిన నా కళ్ళు రెప్పలను వాల్చకుండా నిశ్చల స్థితిలో చూస్తూ ఉండిపోయాయి . మహనీయమైన తండ్రి - పరమాత్మా ప్రకాశవంతమైన కిరణాలను నా శరీరములోని బృహిటి మధ్య స్థానములోకి ప్రసరింపచేస్తున్నారు . దానితో నా ఆత్మ పావనముగా చైతన్యవంతముగా మారిపోతూవుంది అని అనుభూతి చెందుతున్నాను . మరి మీకు ఏమి అని అనిపిస్తుంది ? నేను సాకారములో లేను అని అనిపిస్తుంది ?
మరి మీకు ? నేను గమనించాను నా ఆత్మ కూడా అలౌకిక తండ్రి పరమాత్మ
పోలికతోనే ఉంది . నేను ఇక్కడ చెప్పబోతున్నది . పరమాత్మ నిరాకారుడు - రూపం లేదు . అదేవిధముగా నా ఆత్మకు కూడా రూపం లేదు . ఇక్కడ కులము ,
మతము , వర్గము ఏది లేదు . విశ్వములోని ప్రతి ఒక్క ఆత్మకు అలోకిక తండ్రి ఒక్క
పరమాత్మయే ! నా అన్ని జన్మలలోను నాకు తోడుగా నిలిచేది ఒక్క పరమాత్మయే అని నేను తెలుసుకున్నాను మరి మీరు ? ఇక్కడ నేను తెలియ చేయాలి అనుకున్న సత్యం . మన
శరీరానికి జన్మలు తీసుకునేటప్పుడు చాల మంది లౌకికములో
తండ్రులు వేరే
వేరే ఆత్మలు ఉంటారు . కాని నా ఆత్మకు ఆత్మిక స్థితిలో ప్రతి జన్మకు ఆత్మకు తండ్రి మన అందరికి ఒక్కరే ఆ పరమాత్మయే
అని తెలుసుకొండి .
వైద్య పరముగా సూక్ష్మముగా మరియు స్థూలంగా ఎలాంటి ప్రభావము పడుతుంది అన్నది తెలుసుకుందాము .
ఇక్కడ నా మనస్సు పరమాత్మ ప్రకాశమును చూడటంలో నిమగ్నము అయింది . నా బుద్ధి నా గురించి నేను తెలుసుకోవాలి అన్న తపనను పెంచేసింది . నేను ఎవరు ?అన్న ప్రశ్న నాలోనే స్వదర్శన చక్రం తిరిగినట్టు తిరుగుతుంది . నా సంస్కారము ఇక్కడ అంతర్ముఖత స్థితిని ప్రదర్శిస్తుంది . నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానము మనకు
అందరికి తెలిసిందే అది ఏమిటి అంటే
నేను ఆత్మను -
బిందు స్వరూపాన్ని - శరీరాన్ని నడిపించే
చైతన్యవంతమైన శక్తిని . ఆత్మకు మరణము లేదు - అవినాశి అన్న సత్యాన్ని
అందరూ అంగీకరించవలసిందే . ఇప్పుడు నేను నాకు తెలియకుండానే నేను ఆత్మిక స్థితిలోకి వెళతాను . ఆత్మిక స్థితిలోకి వెళ్ళటం వలన నా మనస్సు , బుద్ధి , సంస్కారము అని పరమాత్మ ఫై నే కేంద్రీకృతం చేయడతాయి . దాని వలన నాలో వున్న రాక్షస గుణాలు నా
నుంచి బయటి వెళ్లిపోతాయి . పరమాత్మ యొక్క ప్రకాశముతో నాలో దైవీ గుణాలు నిండిపోతాయి . అంటే దేవత సంస్కారములు నాలో ఇముడ్చుకుని పోతాయి . అంటే నరుడు నుంచి నారాయుణిగా , నారి నుంచి లక్ష్మీగా ( సనాతన ధర్మములో వున్న సంస్కారములు నా ఆత్మలో నింపుకోవటానికి పురుషార్ధం
చేసుకుంటాను . ) ఇక్కడ నా స్థితి పరమాత్మ తప్ప నాకు ఎవరు లేరు ? దాని ప్రభావము వెంటనే నా రధము అయిన శరీరము ఫై పడి , శరీరములోని అవయవాలను ఎలా నియంత్రణలోకి తీసుకువస్తాయో చూద్దం . మిగిలిన విషయాలు వచ్చే సంచికలో చూద్దాము !
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన
ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ వాళ్ళకి ఉత్తరాలు
పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ ,
అందరికి ఉపయోగ
పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను . నేను ఒక
ఆక్యూపుంచరిస్ట్ గానే కాదు ,ఒక తత్వవేత్తగా నా చిన్నతనము
నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను
. ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ
పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి . మిగిలినవి వదిలివేయండి . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి
కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది . మీ శ్రేయోభిలాషి
..... అస్త్ర అగ్ని
జ్వాలా ......... ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్ 7997519999
No comments:
Post a Comment