Wednesday, July 29, 2020

ఎపిసోడ్ : 13 " ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "


ఎపిసోడ్ : 13
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "
నేను ఎందుకు జన్మి౦చాను అని నా  గురించి చేస్తున్న పరిశోధనలో నేను చాల గ్రంధాలు చదివాను , విన్నాను చాల మంది గురువులను కలిసాను . మధ్య కాలములో అనగా గత 2 సంవత్సరముల నుంచి  రాజ యోగ మెడిటేషన్ గురించి పరిశోధన చేసినప్పుడు .నాలో వున్న అన్ని ప్రశ్నలకు సమాధానములు  ఇక్కడ దొరికింది . నాకు హైదరాబాదులో వున్న బ్రహ్మ కుమారీస్ అందరు నా ఆధ్యాత్మిక పరిశోధనలో చాల సహకరించారు . వారి అందరికి నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను .  మీకు ఇక్కడ కొన్ని రాజ  యోగ మెడిటేషన్ లో పరమాత్మ గీత సారమును శాంతికి మార్గముగా తెలియచేసారు . మనిషి జననము - మరణము గురించి ఏమి చెప్పారో తెలుసుకుందాము . ప్రతి లైన్ కి కూడా అర్ధాన్ని కూడా తెలుసుకుందామునా అవగాహనను మీకు తెలియజేస్తున్నాను .
అయింది ఎదో మంచికే అయింది . ( దీని అర్ధము చూద్దాము ప్రస్తుత కాలములో మనము అందరము జన్మల విషయాన్ని తీసుకుంటే చాల మంది ఎందుకు నేను ఆడపిల్లకు జన్మను ఇచ్చాను అని , లేక మగపిల్లవాడికి జన్మని ఇచ్చాను అని అనుకుంటు బాధ పడతారు . లేక నేను ఎందుకు ఆడపిల్లగా జన్మి౦చాను , మగపిల్లవాడిగా జన్మ తీసుకుంటే బాగుండేది అని అనుకుంటాము . ఆలా అనుకోవటం వలన  ఇక్కడ మనము అందరము అవివేకంతో ఒక విషయాన్నీ మరిచిపోతున్నాము అని గ్రహించుకుంటే చాల బాగుటుంది . ప్రతి మనిషి ఒక్కక్క జన్మలో ఒకొక్కల అంటే ఒకేసారి ఆత్మ స్త్రీ రూపములో వున్న శరీరాన్నిఆకృతిని  మరొక సారి పురుష రూపములో వున్న శరీర ఆకృతిని  తీసుకోక తప్పదు అన్న సృష్టి రహస్యాన్ని మనము ఎందుకు మరిచిపోతున్నాము . ఆత్మ ఆకృతి ఏది అయితే ఏమిటి నీ ఆత్మ  శరరము అనే వస్త్రాన్ని ధరించి నీ పాత్రను కర్మల లెక్కాచారము ప్రకారము పోషించడానికి భూలోకములోకి వచ్చావు అని ఎందుకు అనుకోవు ? సత్యాన్ని మనము ఎందుకు అంగీకరించలేక పోతున్నాము . ఓ మనిషి సత్యాన్ని తెలుసుకో అది జరిగిన అది నీ మంచికే అని అనుకో ! ఆడపిల్ల జన్మి౦చింది   అని కాని మగ పిల్లవాడు జన్మి౦చించాడు  లేక నేను ఆడపిల్లలాగా జన్మ ఎందుకు తీసుకున్నాను అని కానీ , మగ పిల్లవాడిగా ఎందుకు జన్మ తీసుకున్నాను అని ఆలోచించటం మాని అయింది అంత మన మంచికే అని అనుకుని మన జీవిత పయనమును సాగించాలి . ఇంకొక విషయము మర్చిపోవద్దు . మనము అందరము ముందు పరంధాములో వున్నాము . అక్కడ నుంచి మనము భూలోకానికి వచ్చాము . ఇంక ఇప్పుడు   ఆత్మ జన్మలు తీసుకుని తీసుకుని అలసిపోయింది అలౌకిక తండ్రి అయిన పరమాత్మ ఇంటికి వెళ్ళటానికి  శాంతి కోసం పరిత పిస్తుంది అని తెలుసుకో ! అందుకే ఆ సమయములో మన అందరి తండ్రి అయిన పరమాత్మ మనను తనతో తీసుకువెళ్ళడానికి సాకారములోకి వచ్చి తండ్రి స్థానములో మనకు శక్తిని , శాంతిని ఇస్తున్నారు . జ్ఞాన అమృతాన్ని త్రాగిస్తున్నారు . కానీ ఎంత వరుకు మనిషి ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటున్నాడో అన్నది ఆ పరమాత్మకే తెలియాలి . అందుకే చెపుతున్నాను  అయింది ఎదో మంచికే అయింది అని అనుకొంటూ పరమాత్మ ఇస్తున్న ప్రకాశాన్ని స్వీకరిస్తూ , మీ చెయ్యిని తండ్రికి చేతికి ఇవ్వండి)
అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది . ( దీని అర్ధము చూద్దాము .  మనము ఎప్పుడు కూడా ఏమి జరగబోతుందోనని ఆలోచించు కోవాలి  దానితో పాటు  మన కర్తవ్యాన్ని మనము నిర్వహించాలి . ఏది జరిగిన అది మన మంచికే అనుకోవాలి . దానిలో నుంచి మంచిని గుణపాటముగా నేర్చుకోవాలి . మన జీవితాన్ని ఉన్నతంగా తీసుకువెళ్ళటానికి  దోహద పడుతుంది . మన రాతలను బట్టి ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరుగుతుంది . జరబోయే దానిని ఎవరు ఆపలేరు అన్న సత్యాన్ని అంగికరించవలసిందే . )
నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్ ? ( ఇక్కడ మనము కొంచం సేపు ఆత్మిక స్థితిలో ఆలోచిస్తే మనకు అర్ధము అవుతుంది . ఈ సృష్టిని సృష్టిoచింది మన అందరి అలౌకిక తండ్రి అయన పరమాత్మ అని మనకి అందరికి తెలుసు . కాని మనము సత్యాన్ని అంగీకరించ లేక మనమే దానిని సృష్టించాము అన్న మాయలో ఏది నాది కాదు అన్న సత్యాన్ని మర్చిపోయి  అన్ని కోల్పోయినట్టు వ్యవహారము చేస్తాము . సహజముగా చూడండి మనది కానీ వస్తువు పైన మనకు ఏమి అయిన అధికారము వుంటుందా ? మనము వాడుకునే ప్రతి వస్తువు కూడా పరమాత్మదే అన్న సత్యం గ్రహిస్తే మనము దేని గురించి విచారించవలసిన అవసరము లేదు అని అర్ధం అవుతుంది . దాని వలన మనము చాల ఆరోగ్యముగా అవుతాము . )  
నీవేమి తెచ్చావని నీవు పోగొట్టు కుంటావ్ ?  ( ఇక్కడ గ్రహించవలసిన సత్యం పుట్టుకతో మనము ఈ భూలోకమునకు ఏమి తీసుకురాము. ఇక్కడ పరమాత్మ అందరిని ప్రశ్న వేస్తున్నారు అది ఏమిటి అంటే నువ్వు ఈ లోకమును ఏమి తీసుకు రాకుండా వచ్చావు . నేను ఇచ్చిన దానిని ఆస్వాదిస్తున్నావు . నువ్వు ఏమి తీసుకుని రాలేదు అందుకునే నువ్వు ఏమి పోగొట్టుకోలేవు అన్న విషయాన్నీ అర్ధం చేసుకోమని పరమాత్మ తన పిల్లలు అయిన మనకి తెలియ చేస్తున్నారు .  )
నీవేమి సృష్టించావు అని నీకు నష్టం వాటిల్లింది . ( ఇక్కడ గ్రహించవలసిన సత్యం పుట్టుకతో మనము ఈ భూలోకములో దేనిని సృష్టిoచ లేదు మరి నీకు ఏమి నష్టం వాటిల్లింది అని బాధ పడుతున్నావు అని పరమాత్మ మనలను ప్రశ్న వేస్తున్నారు . పంచ భూతాలను , పంచ తత్వాలను మనము సృష్టిoచినవి కావు . )
నీవు ఏది అయితే పొందావో అవి ఇక్కడ నుండే పొందావు  (ఇక్కడ గ్రహించవలసిన సత్యం పుట్టిన తరువాతనే మనము భులోకములోనే  సంపాదించినది అంటే బంధనాలు కాని , డబ్బు , హోదా , ప్రేమ అన్ని కుడా ఇక్కడే పొందాం . ఎక్కడ నుంచి తెచ్చుకోలేదు అన్ని గుర్తుచేస్తున్నారు .)
ఒక ధారణ విషయాన్ని తెలుసుకుందాము .
పరమాత్మ మనకు ఇస్తున్న వరదానము : “ బిందు రూపము – అనగా అనాది స్వరూపమును ధారణ చెయ్యండి ” . బాబా అనే శబ్దo తో మనము మన అలౌకిక తండ్రిని నిరంతరము స్మృతి చెయ్యాలి . ఇక్కడ బాబా అంటే సాయి బాబా లేక ఏ ఇతర సన్యాసులు కారు . బాబా అంటే తండ్రి అని అర్ధం ( ఇక్కడ నేను లౌకిక తండ్రిని గురించి చెప్పటము లేదు ) . అది కూడా మనము ఇక్కడ ఆత్మిక స్థితిలో మన అలౌకిక తండ్రి అయిన పరమాత్మ యొక్క  ప్రకాశాన్ని అనుభూతి చెందుతూ మన ఆత్మకు తండ్రి ఇస్తున్న శాంతిని , ప్రకాశాన్ని నింపుకోవాలి . దాని వలన మన శారీరక ఆరోగ్యo కూడా బాగు౦టుంది. అందుకే అందరు మీకు ఎన్ని సార్లు అనుకోవాలి అనుకుంటే అన్ని సార్లు “ నా బాబా “ “ నా బాబా “ అని అనుకుంటూ అలౌకిక తండ్రి అయిన పరమాత్మ యొక్క ప్రకాశాన్ని పొందగలరు అని ఆశిస్తూ ... ఈ అభ్యాసము వలన వచ్చే మార్పును మీరే గమనిoచుకొoడి. మిగిలిన విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం !
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్
వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ , అందరికి ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను .  నేను ఒక ఆక్యూపుంచరిస్ట్ గానే కాదు ,ఒక తత్వవేత్తగా  నా చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి . మిగిలినవి వదిలివేయండి . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది . మీ శ్రేయోభిలాషి-------- > అస్త్ర  అగ్ని జ్వాలా    
ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్


ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు .
ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా ,
నిన్న ఇంకొకరి సొంతం కదా
మరి రేపు మరొకరి సొంతం కాగలదు .
పరివర్తనం చెందడము అనేది లోకము యొక్కపోకడ .
కావున జరిగేదేదో జరుగక మానదు - అనవసముగా ఆందోళన పడకు .
ఆందోళన అనారోగ్యానికి మూలము .ప్రయత్న లోపము లేకుండా ప్రయత్నము చెయ్యి .
ఫలితం ఏది అయినా ధైవ ప్రసాదంగా స్వీకరించు .
కాలము విలువైనది - రేపు అనే దానికి రూపు లేదు .
మంచి పనులు వాయిదా వేయకు .
అసూయను రూపు మాపు - అహంకారాన్ని అణగ ద్రొక్కు .
హింసను విడనాడు - అహింసను పాటించు .
కోపాన్ని దరి చేర్చకు - ఆవేశముతో ఆలోచించకు
ఉపకారము చేయలేక పోయినా - అపకారము తల పెట్టకు .
మతిని శుద్ధము చేసేది మతము - మానవత్వము లేని మతము మతం కాదు .
దేవుని పూజించు - ప్రాణ కోటికి సహకరించు , తద్వారా భగవదాశీర్వదముతో శాంతి నీ వెంట ఇంత చెంత ఉండగలదు . శాంతి శాంతి శాంతి .  "నేను శాంతి స్వరూప ఆత్మను "
పరమాత్మ రాజ యోగ మెడిటేషన్లో తెలియజేసిన నిత్య సత్యాలు తెలుసుకుoదాము.
వంద కోట్లకు అధిపతివైన – ఒక్క నిమిషము ఆయుష్షు కొనలేవని తెలుసుకో.
కోటి కోట్లకు వారసునివైనా – ఊపిరి పోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకో.
లక్షాధికారినైన , భిక్షాధికారివైన – స్మశానంలో ఇద్దరూ సమానమేనని తెలుసుకో .
వంద మంది డాక్టర్స్ నే వెంటవున్నా – నీ పర లోక ప్రయాణము ఆపలేరుఅని తెలుసుకో.
ప్రపంచం అంతటికి అధిపతివైననూ – నీ ఆయుష్షుకు అధిపతి కాలేవని తెలుసుకో .
ఎవత్ ప్రపంచాన్ని జయించగలిగిననూ – మృత్యువును  జయించలేవని తెలుసుకో ,
కాలం విలువైoది , రేపు అను దానికి రేపు లేదు – మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో .
లక్షలు , కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు – ఆ లక్షలు నీ వెంటరావని, మృత్యువు నుండి తప్పించలేవను తెలుసుకో .
నీవు తిన్నది మట్టి పాలు – ఇతరులకు ఇచ్చింది నీ పాలని తెలుసుకో .
నీవు దాచుకొన్నది జారిపోతుంది – ఇతరులకు సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుంది అని తెలుసుకో ,
భోగాలకు ఖర్చు చేసే రోగాలను తెచ్చు కోకు – మంచి పనులకు ఖర్చుచేసి పుణ్యాన్ని పెంచుకో , ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయంచునని తెలుసుకో .
ఆత్మ నిర్లేపం కాదు , ఆత్మయే పరమాత్మ కాదని తెలుసుకో ,
ఈ విశ్వ నాటకంలో ఏదైనా దాచగలవు – నీ కర్మను దాచలేవని తెలుసుకో ,
పునరపి జననం – పునరాపి మరణం మూధమతే ఈ యధాఅర్ధాన్ని తెలుసుకో ,
అయిదు వేల సంవత్సరాల సుఖ – దుఃఖముల బృహత్ నాటకములో నీ పాత్ర ఏమిటనేది తెలుసుకో .
ఆత్మకు ముక్తి – జీవన్ముక్తి ప్రసాదించే సత్య మార్గం శివ పరమాత్మడు నేర్పించే రాజయోగమేనని తెలుసుకో .
భక్తులకు , భక్తి యొక్క ఫలమును ఇచ్చేది ఎవరు ? అది ఎప్పుడో కాదు , ఇప్పుడేనని తెలుసుకో ..
నీ భక్తి – జప – తపాలతో నన్ను ( భగవంతుని ) పొందలేవు . జ్ఞాన చక్షువుతేనే చూడగలవని తెలుసుకో ,
పతిత పావన గంగానది కాదు – పతిత పావనుడు పరమేశ్వరుడని తెలుసుకో .
     









No comments: