ఎపిసోడ్ : 14
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "
ఓ
సోదరి /
సోదరులారా మీ జన్మకు గల కారణము ఏమిటో
తెలుసుకోవడానికి మీరు కూడా మీ ఆత్మ పరిశోధనను చేసుకోవటం మొదలు పెట్టండి . ఏమిటి ఇక్కడ నేను సోదరి
/ సోదరులారా అని సంబోధించాను అని రాజకీయ భాషను ఉపయోగించని అని అనుకుంటున్నారా ?
అది మాత్రమూ
కానే కాదు . మనము అందరము భారతీయులం అంటే ఒకరికి ఒకరు సోదరి ,
సోదరలే కదా !
అంతే కాదు అలౌకికములో మన అందరికి తండ్రి ఒక్కరే
వారే పరమాత్మ దాని వలన కూడా మనము అందరము ఓకే కుటుంబానికి చెందిన వాళ్ళము అవుతాము . మన అందరిది ఒకే కుటుంబము అని అర్ధం చేసుకొండి . ఆత్మిక స్థితిలో మనము అందరము ఆత్మలమే . ఆత్మకు రూపము లేదు
, రుచి లేదు , స్పర్శ లేదు . ఆత్మ మన అందరి తండ్రి అయిన పరమాత్మ యొక్క ప్రకాశము అనే పోలికతో ఉంటుంది . ఎప్పుడు అయితే వస్త్రము అనే శరీరాన్ని ధరిస్తుందో అప్పుడు
మాత్రమే ఆత్మకు రూపము , స్పర్శ ,
రుచి మరియు వికారములు అన్ని ఉంటాయి అని అర్ధం చేసుకోరా మిత్రమా
! ఓ మిత్రమా సత్యం
గ్రహించు ! సత్యాన్వేషిగా మారు ! అలోకిక తండ్రి అయిన పరమాత్మ యొక్క ప్రకాశాన్ని ఈ సృష్టి లో వున్న ప్రతి
ఆత్మకు ప్రత్యక్షత చేయడమే నా జన్మకు సఫలతను చేకూరుస్తుంది అన్న సత్యం గుర్తించాను . అందరూ కూడా ఆత్మిక దృష్టిలో వున్న నిగూఢ రహస్యాలను తెలుకుని ఎవరికీ వారే ఆత్మిక వైద్యం చేసుకోవాలి
అని ఆశిస్తున్నాను . అందరికి అర్ధం అయింది అని అనుకుంటున్నాను ఆత్మ అనేది కూడా ఒక ప్రకాశమే . శరీరాన్ని నడిపే చైతన్యవంతమైన శక్తి . నీ జననము నీ చేయితీలో లేదు . నీ మరణము నీ
చేతిలో లేదు అని తెలుసుకో . ఎప్పుడు మన పాత్ర అయిపోతే అప్పుడు ఆత్మ శరీరము అనే వస్త్రాన్ని మార్చాలి . అద్దము ముందు మీరు నుంచుంటే ఏమి అవుతుంది ఒక సారి అలోచించుకొండి . మీ
ప్రతి బింబము మీకు కనపడుతుంది . అదే విధానంగా మీ గురించి మీరు తెలుసుకోవడానికి పరమాత్మ యొక్క ప్రకాశాన్ని మీకు అందించడానికి విశ్వకల్యాణ కారిగా నిమిత్తమై మీకు సహయోగం ఇవ్వటానికి నేను వ్రాసే ప్రతి మాటా మీ ఆత్మ పరిశోధనలో మీకు ప్రతి
బింబముగా అవ్వాలన్న సంకల్పంతో పరమాత్మ స్మృతిలో మీకు అందరికి నా ఆత్మ గ్రహించిన విషయాలను మీ అందరిలో ఆత్మిక దృష్టిని తీసుకు రావాలని తెలియ చేస్తున్నాను . ఇక్కడ అందరూ ఆత్మకు
వైద్యం ఎంత అవసరమో అర్ధం చేసుకుంటారు అని కూడా అనుకుంటున్నాను . దీనికి వయస్సుతో సంబంధము లేదు . పేద , గొప్ప , కుల ,
మత , వర్గ , జాతి బేధము లేదు . ప్రస్తుత సమాజములో
ఆత్మిక దృష్టిని ప్రతి ఒక్కరు పెంచుకోవటం అవసరము అన్న విషయము మర్చిపోవద్దు .
ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు ( దీని అర్ధం చూద్దాము : మనము ఎవరి ఫై న అయిన ప్రేమను చూపించినా , మరియు పొందినా అది ఈ భూలోకములోనే
, మరియు దానము చెయ్యండి , ఇంకా ఏమి మీరు ఇతరులకు ఏ రూపాలలో ఇఛ్చినా అవి అన్ని మనకు భూలోకములోనే ఇచ్చాము అని అర్ధం చేసుకొండి. పరంధామానికి తీసుకువెళ్లి మనము ఏమి ఇవ్వము అన్న సత్యాన్ని గ్రహించండి
. )
ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా
,
నిన్న ఇంకొకరి సొంతం కదా
మరి రేపు మరొకరి సొంతం కాగలదు .
(
దీని అర్ధం చూద్దాము : జీవిత సత్యము తెలుసుకుందాము
. ఉదాహరణకు
: మనము చదువుకునే పాఠశాలనే తీసుకుందాము
. ఈ రోజు మనది అనుకున్న క్లాస్ కానీ బెంచ్ కానీ వచ్చే సంవత్సరము వేరొకరిది అవుతుంది . అదే విధముగా మనము దీనిని ప్రతి సంఘటనలోను తీసుకుని చుస్తే జీవితం ఎంత విచిత్రమో అర్ధం అవుతుంది . ఏది మన సొంతము కాదు . కొంచం సేపు మన పాత్రను అభినయించటానికి వాటిని మన సొంతము అని అనుకుంటాము
)
పరివర్తనం చెందడము అనేది లోకము యొక్కపోకడ .
కావున జరిగేదేదో జరుగక మానదు - అనవసముగా ఆందోళన పడకు .
ఆందోళన అనారోగ్యానికి మూలము .ప్రయత్న లోపము లేకుండా ప్రయత్నము చెయ్యి .
ఫలితం ఏది అయినా ధైవ ప్రసాదంగా స్వీకరించు
.
(
దీని అర్ధం చూద్దాము : జన్మ తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా కనీసము తన ఆఖరి శ్వాస వదిలేటప్పుడు అయిన తానూ చేసిన పొరపాటులకు పశ్చాత్తాప పడుతాడు . కానీ చివరికి ఎంత పశ్చాత్తాప పడిన లాభము లేకుండా పోతుంది అదే లోకం యొక్క పోకడ . ఇక్కడ మనకు కనువిప్పు కలిగించే విషయం ఏమిటి అని మన మనోనేత్రముతో ఆలోచించాలి
. ప్రస్తుత కాలములో స్వయముగా పరమాత్మ తన యొక్క ప్రకాశాన్ని తన పిల్లలు అయిన మన కందరికి ఇవ్వటానికి తండ్రి స్థానములో మనలను మన అలౌకిక ఇంటికి తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చి మన ఆత్మలో శక్తిని నింపుతున్నారు అన్న సత్యాన్ని తెలుసుకోలేక శాంతి కోసం ఎక్కడో వెతుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు
. కలి యుగం అంతం అయ్యబోతుంది
. సత్య యుగం రాబోతుంది అన్న సత్యాన్ని తెలుసుకుని కూడా తనలో పరివర్తనను ఎందుకు చెందలేక పోతున్నాడు
. ఇప్పటికి అయిన " కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొని స్వయముగా పరమాత్మ ఇస్తున్న జ్ఞానామృతాన్నీ స్వీకరించడానికి ఆత్మకు వున్న శాంతి దాహాన్ని తీర్చుకోవడానికి మీ ఆత్మలో శక్తిని నింపుకోవాలి అన్న పరివర్తను తెచ్చుకొండి
" " చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడము కాదు" . దీపము ఉండగానే ఇల్లును చక్క పెట్టుకోవాలి
. అందుకే అందరు కలి యుగ అంతిమ
సమయము దగ్గర పడింది అని తెలుసుకుని ఆత్మలో శక్తిని నింపుకోవటానికి పరమాత్మ
అందిస్తున్న జ్ఞానమును తెలుసుకోవడానికి మరియు ధారణ చేసుకోవడానికి “ ప్రజా పిత
బ్రహ్మ కుమారీస్ సెంటర్స్ ని రాజ యోగ మెడిటేషన్ “ నేర్చుకోవడానికి తరలి వెళ్ళండి .
ఎవరు ఆయితే నిజముగా నేను ఎవరు ? నా ఆత్మలో
శక్తిని పెంచుకోవాలి అని అనుకున్న వారు తప్పకుండా రాజ యోగ మెడిటేషన్
నేర్చుకోవలసిందే . లోకములో చాలా రకాల మెడిటేషన్ గురించి చెప్పబడింది . కాని
ప్రపంచములో స్వయంగా పరమాత్మ తన పిల్లల కోసము చెప్పిన ఆత్మ – పరమాత్మ పరిచయము ఒక్క
రాజ యోగ మెడిటేషన్ లో మాత్రమే వుంది . జరగవలసింది జరిగిపోతుంది దానిని ఎవరు ఆపలేరు
( అంటే వినాశనము . ప్రపంచము వినాశనము కావడానికి ఎంతో సమయం లేదు అన్న విషయము అన్ని
మతాల వారికీ తెలిసిన విషయమే ) దాని గురించి ఎవరు చింతించ వలసిన అవసరము లేదు .
ఎవరికి శాంతి కావాలని అనుకుంటున్నారో వారు పరమాత్మ ఇస్తున్న ప్రకాశము గురించి తెలుసుకోండి .
ఇప్పుడు ఆఖరి నిమిషములో కూడా పరమాత్మ మనకు ఆత్మలో శాంతిని నింపుకోవటానికి అవకాశమును
ఇస్తున్నారు . సత్యం గ్రహించిన వారు తప్పక వినియోగిoచుకుoటారు . ఈ రోజుల్లో మనిషి
పరితపిస్తుంది శాంతి కోసమే అన్న విషయము మర్చిపోవద్దు.
మిగిలిన
విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం !
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన
ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన
వాటికీ , అందరికి
ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను . నేను
ఒక ఆక్యూపుంచరిస్ట్ గానే కాదు ,ఒక తత్వవేత్తగా నా
చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు
గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను
మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి .
మిగిలినవి వదిలివేయండి
. ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది .
ఎవరి నిర్ణయం వారిది . మీ శ్రేయోభిలాషి--------
> అస్త్ర అగ్ని జ్వాలా ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
No comments:
Post a Comment