Wednesday, July 29, 2020

ఎపిసోడ్ : 6 " ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "


ఎపిసోడ్ : 6

ఆత్మిక దృష్టితో సూక్ష్మ –  స్థూల వైద్య రహస్యము "

ఎప్పుడు అయితే నేను అత్మిక స్థితిలో వుంటానో, అప్పుడు నేను దేహానికి అతీతముగా వుంటాను . అప్పుడు నా ఆత్మ శబ్దమునకు అతీతంగా ఏకరస స్థితిలో కేవలము పరమాత్మ నుంచి అనాది గుణాలను ఆత్మలో నింపుకోవటం వలన ఆ ప్రభావం శరీరము ఫై పడి శరీరము లోని ప్రతి అణువు పరమాత్మ యొక్క శక్తితో నిండిపోయి నా శరీరములోని అన్ని అవయవాలు జాగృతం అవుతాయి . దానితో నేను ఆరోగ్యముగా వుండు కళను తిరిగి పొందుతూ , సంపూర్ణ ఆరోగ్యమును పొందుతాను . నేను ఎప్పుడు అయితే అత్మిక స్థితిలో వుంటానో , నా మనస్సు చాలా ఆనందముగా వుంటుంది . నా మనస్సు ఎప్పుడు అయితే ఆనందముగా వుంటుందో ఆ ప్రభావము నా మెదడు ఫై , హృదయము ఫై , కిడ్నీ ఫై , ప్రేగుల ఫై , లివర్ ఫై , నరాల ఫై పడుతుంది . నా శరీరము లోని అన్ని అవయవాలు ఉతేజముగా చురుకుగా పని చేయటము మొదలు పెడతాయి . దాని వలన నా శరరము లో వున్న వ్యాధులు అయిన డైయాబెటిస్ , బి . పి . , థైరాయిడ్, తల నరాలు లాగటము , ఒత్తిడి , కడుపులో మంట , నిద్ర పట్టక పోవడము అనే మొదలైన  అనేకమైన  సమస్యలు మనకు తెలియకుండానే నియంత్రణలోకి వస్తాయి .  నేను ఇక్కడ వాడుతున్న మందులు వదిలి వేయమని చెప్పటం లేదు . కాని , మందులు ఎక్కువగా తీసుకోవలసిన అవసరము పడుతుంది  అనే వాళ్ళకు కూడా మందులు క్రమేణా తగ్గిపోయి వ్యాధులు నియంత్రణ లోకి వస్తాయి . ఎప్పుడు మనిషి ఆరోగ్యంగా వుంటాడో , అప్పుడు వారు తనకు తెలియకుండానే వారు సంఘంలో వున్న సంభందములను చాల ఉన్నతంగా ఏర్పాటు చేసుకోగలరు . మీకు తెలుసో లేదో సత్య యుగములో జన్మ తీసుకున్న వారు అందరు కూడా చాల సంతోషముతో , ఆనందముతో వుండే వారు దాని వలన వాళ్ళు చాల ఆరోగ్యంగా వుండే వారు . వారికి ఎటువంటి అనారోగ్యములు లేవు . ఎందుకు అంటే వారు సదా ఆత్మిక స్థితిలో వుండి పవిత్రతా శక్తితో  వుండే వారు . ఆ పవిత్రతా శక్తియే వాళ్ళ శరీర అవయవాలను పవిత్రముగా వుంచి వాళ్ళు సదా ఆరోగ్యముగా ఉండటానికి సహకరించేది . ఇక్కడ మనము మరొక విషయాన్నీ గమనించాలి సత్య యుగములో జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు దేవి దేవతల సంస్కారములతో కలిగి ఉంటారు . దాని వలన వారు శ్రేష్ఠమైన సంస్కారములతో జీవిస్తారు . వాళ్ళ ఆత్మిక స్థితి సంపూర్ణమైన దైవీ గుణాలతో నిండిఉండటం వలన వాళ్ళు అపార సుఖాన్ని అనుభవించే జీవితాన్ని గడుపుతారు .  ఇప్పుడు మనము అందరము కలియుగంలో జీవిస్తున్నాము అని అందరికి తెలుసు . కలియుగము అంతిమలో ఉంది అన్న సత్యము కూడా అందరికి తెలుసు . ఇక్కడ మనము అర్ధం చేసుకోవలసింది కలియుగం లోకి వచ్చేటప్పటికి మన ఆత్మిక స్థితి లో కూడా శక్తి తగ్గిపోయింది . దాని వలన మనకు అందరము వికారాల వసము అయ్యాము . దాని ప్రభావము మన శరీరములోని అవయవాల ఫై పడుతుంది . ప్రకృతిలో శక్తి తగ్గిపోవటం వలన పంచతత్వాలతో తయారుఅయిన మన శరీరములోని అవయవాలు కూడా శక్తిని కోల్పోతున్నాయి . సత్యాన్ని మనము అందరము  ఇక్కడ అర్ధం చేసుకోవాలి .
          ఇప్పుడు చూద్దాం గాలిలో మేడలు కడతాడు , కలలలో జీవిస్తాడు అదే నిజం అని నమ్ముతాడు. అనేది ఏ విధంగా సామాజిక జీవనములో మన మనస్సు ఫై ఎలాంటి ప్రభావము పడుతుంది . అది వారి అత్మిక స్థితిని ఎలా తయారు చేస్తుంది మరియు మన శరీర అవయవాలు ఎలా పని చేసేలా చేస్తుందో తెలుసుకుందాము . మనము ఇక్కడ కొన్ని ఉదాహరణలను తీసుకుందాము . మన నిత్య జీవితంలో చూస్తూనే వుంటాము మన వయస్సు పెరిగే కొద్ది మనలోనూ కోరికలు పెరుగుతాయి . దానితో కొంత మంది తన కోరికలను కష్ట పడి తీర్చుకుంటారు . “ కష్టే ఫలే సుఖి “ అని పెద్దవాళ్ళు అన్నారు . అది నిజమే . మనము చాల సార్లు అనుకుంటాము నేను కష్ట పడుతున్నాను కాని నాకు ఫలితము రావటం లేదు అని . ఇక్కడ మనము “ కర్మ సిద్దంతమును “ గుర్తు పెట్టుకోవాలి . మనము చేసిన దానికి తప్పక ఫలితము వస్తుంది . అది మీకు లౌకికములో అంటే స్థూలముగా లభించక పోవచ్చు . కాని అది మీ ఆత్మలో వైరాగ్యమును పెంచుతుంది . దాని వలన సుక్ష్మముగా మనము పరమాత్మకు దగ్గరగా అవ్వాలి అన్న తపన మనకు ఏర్పాటు అవుతుంది . ఆ వైరాగ్యము వలన మనకు తెలియకుండానే నిశబ్ధంలోకి వెళ్ళటము ధారణ చేస్తాము . దాని వలన ముందుగా ప్రభావం మన మనస్సు ఫై పడుతుంది . మనస్సు ఫై పడిన ప్రభావము వలన బుద్ధిలో నాకు ఎవరు వద్దు అన్న ఆలోచనను ప్రేరేపిస్తుంది . నా సంస్కారము ఒంటరిగా వుండటాన్ని సూచిస్తుంది . కొత్తలో ఒంటరిగా వుoడటం అనేది చాల కష్టoగా వుంటుంది . ఏడుపు కుడా వస్తుంది . ఎప్పుడు అయితే మనము ఏడుస్థామో అప్పుడు మన శరీర అవయవాలలో కూడా మార్పులు జరుగుతాయి . మనకు తెలియకుండానే మనము అనారోగ్యమునకు గురి అవుతాము .ముఖ్యముగా ప్రభావానికి గురి అయ్యే అవయవాలు గుండె , తలలోని నరాలు , లివర్ , కిడ్నీ . ఈ అవయవాలకు సంభదించిన వ్యాధులకు గురి అవుతాము .ఆ సమయములో ఎక్కువగా దిగులుగా వుంటాము . కొన్ని రోజుల తరువాత మన ఆత్మలో శక్తిని పెంచుకోవటం వలన ఆ ప్రభావము మన శరీర అవయవాల ఫై న పడటము జరుగుతుంది దానితో మనము నిరోగిగా కుడా మారిపోతాము.  చాల మందికి ఈ రోజుల్లో కష్ట పడకుండానే కోరికలు తీరిపోతాయి అని అనుకుంటు గాలిలో మేడలు కట్టడము మొదలు పెడతారు .దీని వలన వారి ఆత్మలో సోమరితనన్ని నింపుకుంటున్నాడు . ఎదుటి వారిని మోసం చేయటం నేర్చుకుంటున్నారు . మనము ఏది అయితే చేయగలమో దాని గురించి మాత్రమే ఎదుటివారికి చెప్పాలి . కాని మనము ఎందుకు ఎదుటివారికి ఆశలను రేపుతాము. దాని వలన ఎదుటి వారిని ఎంతగా నిరుత్సాహనికి గురి చేస్తూ వారి మానసిక స్థితిని ఎంత నశింప చేస్తున్నాము అని ఎందుకు ఆలోచించము . మనము చాల మoదిని చూస్తున్నాము . వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏమి చేయలేరు అని కాని చేసేస్తాం నీ పని అయిపోయింది అని చెపేస్తారు . దాని వలన వాళ్ళకు వచ్చే లాభము ఏమిటి . ఏమి లేదు పాప ఖాతాను పెంచుకుంటాం. కానీ భాద లోకి వెళ్ళిన వ్యక్తి ఏమి అవుతాడు అన్నది ఎవరు ఆలోచించరు . వారి గురంచి వివరముగా ముందు ముందు తెలుసుకుందాము.

మిగిలిన విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం ! ఒక ధారణ పాయింట్ ని మీకు అందజేస్తున్నాను .నచ్చిన వారు ప్రయత్నం చేయవచ్చు లేక పోతే వదిలి వేయండి ?

బిందు స్వరూపముగా మారటానికి ఏ విధముగా మనము ప్రయత్నం చేయాలి ? నేను ఆత్మను అని నా స్వ రూపాన్ని నేను ఎలా పొందగలను ?
మనము దేని గురించి బాధ పడుతున్నమో , ఏ ఆలోచన మనలో బాగా తిరుగుతుందో వాటిని గురించి పేపర్ తీసుకుని బిందు పెట్టడం నేర్చుకొండి. రాత్రికి ఎన్ని బిందువులు పెట్టారో లేక్కిమ్చండి. ఏ విషయన్ని గురించి ఆలోచించకండి . ఏ విషయాన్ని  ఎక్కువగా ఆలోచిస్తారో , అది అంతా ఎక్కువగా పెరుగుతూ వుంటుంది . అన్ని ఆలోచనలు వదిలేసి ఒక్క తండ్రి స్మృతి చేయండి . అదే ఆశీర్వదoగా అయిపోయింది .. స్మృతిలో చాల లాభాలు వున్నాయి . ఎంత  స్మృతి చేస్తే అంతా శక్తి నిండుతుంది . సహయోగము కూడా ప్రాప్తిస్తుంది , సేవ కూడా జరుగుతుంది .

మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ , అందరికి ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలనునేను ఒక ఆక్యూపుంచరిస్ట్ గానే కాదు ,ఒక తత్వవేత్తగా  నా చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి . మిగిలినవి వదిలివేయండి . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది . మీ శ్రేయోభిలాషి .....  అస్త్ర అగ్ని జ్వాలా ... ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్

No comments: