Wednesday, July 29, 2020

ఎపిసోడ్ : 17 " ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "


ఎపిసోడ్ : 17
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ –  స్థూల వైద్య రహస్యము "
ముందు సంచికలలో తెలుసుకున్నాము మన ఆత్మల ఇల్లు పరంధామము అని . యుగం అంతం తరువాత యుగం ప్రారంభము అయ్యేటప్పుడు మనము అందరమూ పరంధామంలోకి వెళ్ళ వలసిందే . బిందు రూపంలో పరమాత్మ యొక్క ప్రకాశము కింద ఆత్మలు అన్ని ప్రకాశముతో కూటమిగా శాంతిగా ఏ ధ్వని , కాని సంకల్పంలు కాని  లేకుండా చేరుకుంటాయి. వాటిని చూస్తే లింగాకారం వున్న పరమాత్మ యొక్క ప్రకాశం కూటమి కనబడుతుంది . అలౌకిక తండ్రి అయిన పరమాత్మ తన పిల్లలు అయిన మన అందరితో  తన ఇంటిలో వున్న దృశ్యమే పరంధామం. అదే సత్యం . యుగాoతము అయిన తరువాత ఆత్మలు ఎక్కడికి వెళ్ళతాయి . యుగ ఆరంభంలో ఆత్మలు ఎక్కడ నుంచి వస్తాయి అన్న ప్రశ్నకు సమాధానము మనకు అందరికి అర్ధం అయ్యింది అని అనుకుంటూ వున్నాను .
ఇప్పుడు యుగ ఆరంభం ఎలా అవుతుంది . మనము ఎలా జన్మ తీసుకుంటాము అని కూడా చూద్దాము .  
ముందుగా అందరికి తెలిసిందే యుగములు నాలుగు అని .
1.     సత్య యుగం
2.    త్రేతా యుగము
3.    ద్వాపరి యుగము
4.    కలి యుగము
సత్య , త్రేతా యుగములను స్వర్గముగా చెప్పవచ్చు . క్రిస్ట్ యన్ మరియు ముస్లిం వారి ప్రకారము చెప్పాలి అంటే పరలోకము అని అర్ధం . ఇహ లోకము లోకి ద్వాపరి మరియు కలి యుగములు వస్తాయి . ఇది మన అందరికి తెలిసిన విషయమే .

స్వయముగా పరమాత్మ చెప్పిన సృష్టి రహస్యము వయస్సు 5000 సంవత్సరంలు . చాల మంది దీనికి ఏకీభవించకపోయినా సత్యాన్ని సత్యమనే చెప్పాలి . సత్యాన్ని అంగికరించటములో చాలా కష్ట పడవలసి వస్తుంది . మనము చరిత్రలో వ్రాసుకున్నవి అన్ని కూడా మనుష్యులు వ్రాసినవే అని మరిచిపోవద్దు . ఇక్కడ ఎవరి నమ్మకం వారిది . దీని గురించి చర్చించు కోవలసిన అవసరము లేదు . పరమాత్మ అంటే ఒక ప్రకాశం అన్నది ఎంత నిజమో ఇది కూడా అంతే సత్యము అన్నది గ్రహించండి .
ఈ రకముగా ప్రతి యుగమునకు వయస్సు 1250 సంవత్సరంలు కలిగి యుగం చక్రం తిరుగుతూ వుంటుంది . ఇక్కడ చిన్న మనవి ఎవరిని ఎవరు విమర్శించద్దు . పరమాత్మ యొక్క ప్రకాశాన్ని తెలుసుకోండి .పరమాత్మ చెప్పుతున్న సత్యాన్ని గుర్తించి . మీ ఆత్మలో ఆత్మిక దృష్టిని పెంచుకోండి .


ఈ రోజు ధారణ పాయింట్ తెలుసుకుందాము : -
నేను ఆత్మను అన్న విషయము మనము అందరము గ్రహించాము . నేను ఆత్మను అన్న స్వరూపానికి వెళ్ళటానికి మనము ఏ విధముగా అభ్యాసం చెయ్యాలో చూద్దాం .
ఆత్మ యొక్క అభ్యాసం :-
1 . నేను ఆత్మను రాజును శరీరములోని బృహుటి స్థానములో సింహాసనమును ఏర్పాటు చేసుకుని విరాజమానిగా వున్నాను మరియు కర్మేద్రియాల ద్వారా పనులు చేస్తున్నాను .
2. నేను ఆత్మను మీ శరీరములో నుంచి వేరుగా అయ్యి మీ శరీరాన్ని చూస్తున్నాను .
3. నేను ఆత్మను ఈ శరీరములో అవతరించాను.
4. మురళి అంటే పరమాత్మ చెప్పే మహావాక్యములు వినే సమయములో – నేను ఆత్మను మురళి వింటున్నాను .
5. కర్మ చేసేటప్పుడు కాని సేవ చేసేటప్పుడు కాని కొన్ని సెకండ్స్ కోసము సాక్షిగా వుండి చేస్తే ఈ సేవ ఆత్మ నే నా రధము ( శరీరము ) ద్వారా చేస్తుంది అని తెలుసుతుంది .
6.  నేను ఆత్మను ఆ శరీరము నుంచి వేరుగా వున్నాను . ఆ భావాన్ని రోజులో మీకు ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకొండి .
7. రాత్రి పడుకునే ముందు  - నేను ఆత్మను ఈ శరీరము నుంచి వేరుగా వున్నాను అని అనుకోవాలి . ( దేహాభిమానమును కొంచము సేపు వదిలి వెయ్యాలి .)
ప్రజా పిత బ్రహ్మ కుర్మరీస్ లో బ్రహ్మ బాబా ( అలౌకిక పేరు ) – దాదా లేఖరాజు ( లౌకిక పేరు ) నేను ఆత్మను అనే అభ్యాసము చేయడానికి ఏమి చేసారో చూద్దం . ఆయన రోజు తన డైరీలో ఈ విధముగా వ్రాసుకునే వారు – నేను ఆత్మను – నేను ఆత్మను అని అంతే కాకుండా కర్మేద్రియాలను తన ఆధీనములో
వుంచుకునే వారు .     

నేను ఈ అభ్యాసంను మొదలు పెట్టాను . నేను ఆత్మను అని వ్రాసుకున్న ప్రతి సారి నాలో ఎదో తెలియని శాంతి వాతావరణమును గమనించాను . లోకిక విషయాల ఫై కూడా నాకు ఆసక్తి తగ్గిపోయింది . దేహాభిమానము నుంచి నా దృష్టి ఆత్మాభిమానిగా తయారు అయ్యింది . నాకు ఏ సమస్య వచ్చినా నేను ఒక ఆత్మను అన్న అభ్యాసము చేయటం వలన చాల వరుకు నా మనస్సు శాంతిలోనే వుంటుంది . నిర్భయముగా , నిశ్చలoగా వుంటుంది . అంటే కాకుండా వైరాగ్యమును కూడా పెంచుతుంది . దాని వలన పరమాత్మ ఇస్తున్న ప్రకాశమును , ప్రేమను తొందరిగా పొందగలము అన్న అనుభూతిని పొందాను .
మీరు అందరు కూడా ఈ అభ్యాసము చేయటంతో మీకు వున్న మానసిక సమస్య నుంచి పారిపోకుండా , మనో దైర్యమును తెచ్చుకుని మీ జీవితమును ముందుకు అడుగు వేయటానికి  దోహద పడుతుంది . ఎలాంటి సమస్య వచ్చినా పరమాత్మ మీ తోడులో వున్నారు అన్న విషయమును మరిచి పోవద్దు .

గమనిక : మానసిక ఒత్తిడిని  పెట్టుకుని శారీరక ఆరోగ్యమును పాడుచేసుకోవద్దు .  మనము శారిరకముగా ఆరోగ్యముగా వుండటo వలన ఏమి అయిన సాధించగలము . అదే ఆరోగ్యము లేక పోతే ఏమి చెయ్యలేము అని తెలుసుకోండి . అందుకే మీరు అందరు కూడా ఆత్మీక దృష్టిని మీలో పెంచుకోండి . మానసికముగా , శారిరకముగా కూడా ఆరోగ్యమును పొందండి.

నేను ఆత్మను అని ఎప్పుడు అయితే అనుకుంటామో , అప్పుడు మనము మన అనాది స్వరూపం అయిన బిందు స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ , నేను బిందువు అన్న సత్యం మన ఆత్మలో ఇముడ్చుకుంటుంది.
         
మిగిలిన విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం !
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్
 వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ , అందరికి ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను .  నేను ఒక ఆక్యూపoచరిస్ట్ గానే కాదు , ఒక తత్వవేత్తగా  నా చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి . మిగిలినవి వదిలివేయండి . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది . మీ శ్రేయోభిలాషి-------- > అస్త్ర  అగ్ని జ్వాలా ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్


No comments: