ఎపిసోడ్ : 16
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "
అసూయను రూపు మాపు - అహంకారాన్ని అణగ ద్రొక్కు . ( నీకంటే గొప్పవాడిని చూసి అసుయపడకు , వారి నుంచి మనకు తెలియనది తెలుసుకోవటానికి
ప్రయత్నం చేయి . మరొక విషయము నీకే అన్ని తెలుసు అని అహంకారము లోకి కూడా వెళ్ళకు .
మనలో వున్న అహంకారమే మన వినాశనానికి నాంది అవుతుంది అది గుర్తుకు వుంచుకుని జీవిత
పయనాన్ని కొనసాగించు .)
హింసను విడనాడు - అహింసను పాటించు . ( ఎవరినో కొడితే , తిడీతే వచ్చేదే హింస అవ్వదు . ఎదుటివారిని మోసము చేసిన లేక
మన ఎదురుచూపులకు ఎదుటివారిని లోను చేసినా దాని
వలన తయారు అయ్యే బాధను హింసించడం అని అంటారు . అహింసను పాటించు )
కోపాన్ని దరి చేర్చకు - ఆవేశముతో ఆలోచించకు ( కోపం అనేది మన శత్రువు
అని గుర్తు వుంచుకో ! తన కోపమే తన శత్రువు మరియు తన శాంతమే తనకు రక్ష . ఆవేశముతో
ఆలోచించకుండా , పరమాత్మ యొక్క స్మృతిలో ఆలోచించి నిర్ణయము తీసుకో ! )
ఉపకారము చేయలేక పోయినా - అపకారము తల పెట్టకు . ( నువ్వు ఎదుటివారికి సహాయము చెయ్యక పోయినా పరవాలేదు కానీ అపకారము మాత్రము చెయ్యకు
. అది తరువాత నీ జీవితాన్ని వినాశనము చేస్తుంది . )
మతిని శుద్ధము చేసేది మతము - మానవత్వము లేని మతము మతం కాదు . ( మన బుద్ధిని
శ్రేష్టంగా తయారు చేసుకోవటానికి మతమును సృష్టిoచుకున్నాము . కాని ప్రస్తుత
సమాజములో ఆ మతము పేరు చెప్పుకుని మానవత్వo లేకుండా ప్రవరిస్తున్నారు . పరమాత్మ
ఒక్కరే అన్న సత్యము తెలిసికూడా మనము ఎందుకు ఈ విధముగా చేస్తున్నాము . )
దేవుని పూజించు - ప్రాణ కోటికి సహకరించు , తద్వారా భగవదాశీర్వదముతో శాంతి నీ వెంట ఇంత చెంత ఉండగలదు . శాంతి శాంతి శాంతి . "నేను శాంతి స్వరూప ఆత్మను " అన్న స్వమానములో స్థితులై వుండండి .
నీవు ఆత్మ – బిందు స్వరూపానివి అన్న విషయము మర్చిపోకు .
పరమాత్మ నన్ను , మిమల్ని గుర్తించారు
. నేను పరమాత్మను తెలుసుకున్నాను . మరి మీరు ...
నా ఆత్మ పయనము నా అలౌకిక తండ్రి అయిన పరమాత్మ ఇల్లును తిరిగి చేరుకోవటము .
పరమాత్మ రాజ యోగ మెడిటేషన్లో తెలియజేసిన నిత్య సత్యాలు తెలుసుకుoదాము.
వంద కోట్లకు అధిపతివైన – ఒక్క నిమిషము ఆయుష్షు కొనలేవని తెలుసుకో.
కోటి కోట్లకు వారసునివైనా – ఊపిరి పోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకో.
లక్షాధికారినైన , భిక్షాధికారివైన – స్మశానంలో ఇద్దరూ సమానమేనని తెలుసుకో .
వంద మంది డాక్టర్స్ నే వెంటవున్నా – నీ పర లోక ప్రయాణము ఆపలేరుఅని తెలుసుకో.
ప్రపంచం అంతటికి అధిపతివైననూ – నీ ఆయుష్షుకు అధిపతి కాలేవని తెలుసుకో .
ఎవత్ ప్రపంచాన్ని జయించగలిగిననూ – మృత్యువును
జయించలేవని తెలుసుకో ,
కాలం విలువైoది , రేపు అను దానికి రేపు లేదు – మంచి పనులు వాయిదా వేయరాదని
తెలుసుకో .
లక్షలు , కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు – ఆ లక్షలు నీ వెంటరావని, మృత్యువు
నుండి తప్పించలేవను తెలుసుకో .
నీవు తిన్నది మట్టి పాలు – ఇతరులకు ఇచ్చింది నీ పాలని తెలుసుకో .
నీవు దాచుకొన్నది జారిపోతుంది – ఇతరులకు సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుంది
అని తెలుసుకో ,
భోగాలకు ఖర్చు చేసే రోగాలను తెచ్చు కోకు – మంచి పనులకు ఖర్చుచేసి పుణ్యాన్ని
పెంచుకో , ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయంచునని తెలుసుకో .
ఆత్మ నిర్లేపం కాదు , ఆత్మయే పరమాత్మ కాదని తెలుసుకో ,
ఈ విశ్వ నాటకంలో ఏదైనా దాచగలవు – నీ కర్మను దాచలేవని తెలుసుకో ,
పునరపి జననం – పునరాపి మరణం మూధమతే ఈ యధాఅర్ధాన్ని తెలుసుకో ,
అయిదు వేల సంవత్సరాల సుఖ – దుఃఖముల బృహత్ నాటకములో నీ పాత్ర ఏమిటనేది తెలుసుకో
.
ఆత్మకు ముక్తి – జీవన్ముక్తి ప్రసాదించే సత్య మార్గం శివ పరమాత్మడు నేర్పించే
రాజయోగమేనని తెలుసుకో .
భక్తులకు , భక్తి యొక్క ఫలమును ఇచ్చేది ఎవరు ? అది ఎప్పుడో కాదు , ఇప్పుడేనని
తెలుసుకో ..
నీ భక్తి – జప – తపాలతో నన్ను ( భగవంతుని ) పొందలేవు . జ్ఞాన చక్షువుతేనే
చూడగలవని తెలుసుకో ,
పతిత పావన గంగానది కాదు – పతిత పావనుడు పరమేశ్వరుడని తెలుసుకో .
దుఃఖ హర్త – సుఖ కర్త సృష్టి కర్త – త్రిమూర్తి శివుడేనని తెలుసుకో,
సూర్య చంద్ర నక్షత్రాలకు అతి దూరముగా నివసించే హిరణ్య గర్భాక్షుడు ఎవరో
తెలుసుకో .
తండ్రిలoదరికి తండ్రి – గురవులందరికి సత్ గురువు – సత్య గీతా జ్ఞాన దాత సదా
శివుడే అని తెలుకో .
త్రికాలాలు – త్రిలోకాలు – త్రిమూర్తులు – సృష్టి యొక్క ఆది మధ్య అంత్య
రహస్యములు తెలిసిన వేరేవ్వరని తెలుసుకో
పరమపిత పరమాత్మ సర్వ శక్తివంతుడే గాని – సర్వ వ్యాపకుడు కాదు అని తెలుసుకో .
ఈ సృష్టి నాటక చక్రములో సత్య – త్రేత – ద్వాపర – కలియుగాలే గడిచిపోయాయి .
క్షణ క్షణానికి నీ ఆయుష్షు తరుగుచున్నది . సమయానికి ముందే సర్దుకుని గమ్యాన్ని
చేరుకోవాలని తెలుసుకో .
నిదానమే ప్రధానము – ఆలస్యం అమృతం విషం . వీటిని నిజ జీవితములో ఎలా వాడాలో
తెలుసుకో .
ఇది పురుషోత్తమ సంగమ యుగము , ఆత్మ – పరమాత్మల కలయిక సమయము ఇప్పుడే అని
తెలుసుకో .
లింగము – ఆకారము – లింగాకారం. నిరాకారుడు అయిన పరమాత్మ స్మృతి చిహ్నమే శివ
లింగం .
సర్వత్మాల పిత , జ్ఞాన సాగరుడు , సత్య సాగరుడు , దయామయుడు , దయసాగారుడు ,
శాంతి స్వరూపుడు , సుఖ దుఃఖములకు ఆతీతుడు ,నిరాకారుడు , శాంతి సాగరుడు ,
ప్రేమామయుడు అయిన అతి సుక్ష్మమము అయిన
జ్యోతిర్బిందు స్వరూపుడే పరమ పిత పరమాత్మ సాక్షాత్కారమే , ఆత్మ జ్ఞానము ,
ఆత్మానందం , పరమానందము , ఇది పొందాలి అంటే – మొదట నీవు చేయవలసింది పురుషార్ధం –
పురుషార్ధం అనగా ప్రయత్నము - ప్రయత్నం
అనగా పరమాత్ముని యందు మనస్సును ఏకాగ్రపరచాలి . అప్పుడే ముక్తి జీవన్ముక్తి
లభిస్తుంది .
ఇంకా పూర్తి వివరాలకు సహజ రాజ యోగ విధానమును ఉచితంగా నేర్చుకోవటానికి ప్రజా
పిత బ్రహ్మ కుమారీస్ సెంటర్స్ ని సంప్రదించండి. మీ జీవిత విధానన్ని ఉన్నతముగా
మార్చుకోండి . ఆత్మికతో మీ శరీర అవయవాలు పని తీరును నియంత్రణకు తీసుకు రావచ్చు.
అందరు పరమాత్మ చెప్పుతున్న సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నo చేయండి .
మిగిలిన
విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం !
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన
ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన
వాటికీ , అందరికి
ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను . నేను
ఒక ఆక్యూపoచరిస్ట్ గానే కాదు , ఒక తత్వవేత్తగా నా
చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు
గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను
మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి .
మిగిలినవి వదిలివేయండి
. ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది .
ఎవరి నిర్ణయం వారిది . మీ శ్రేయోభిలాషి--------
> అస్త్ర అగ్ని జ్వాలా ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
No comments:
Post a Comment