ఎపిసోడ్ : 12
" ఆత్మిక దృష్టితో సూక్ష్మ –
స్థూల వైద్య రహస్యము "
ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం వుంది . అది వారిని మంచికి
అయినా కాని చెడుకు అయిన కాని అధర్శనీయముగా అవుతారు . కారణం లేకుండా ఎవరు జన్మను
తీసుకోరు . మీ పుట్టుకకు కారణము ఏమిటి అని ఎప్పుడు అయిన మీరు ఆలోచించరా ? ఆలోచించక
పోతే ఇప్పుడు ఆలోచించండి . మీ జన్మను ఎలా సార్ధకత చేసుకోగలరు ? ఏమి చేయాలని
అనుకుంటున్నారు ? నాకు చాల సార్లు నా జన్మ రహస్యం ఏమిటి అని తెలుసుకోవాలని చాల తపన
వుండేది. నా చిన్నప్పటి నుంచి నా గురించి నేను అంటే అసలు నేను ఎందుకు జన్మించాను
అని అనుకుంటూ వుండే దానిని . ఇప్పటికి నా అన్వేషణ పూర్తి అయింది నా జన్మ సఫలత
కలిగేది నేను ఎప్పుడు అయితే పరమాత్మ యొక్క ప్రకాశమును జీవించి వున్న ప్రతి
ఆత్మకు ప్రత్యక్షతను చేయగలనో అప్పుడే అన్న విషయము అర్ధం అయ్యి మీ అందరి ముందుకు నా
జీవిత అనుభవములను తెలియచేస్తున్నాను . చాల
మందిలో వున్న ప్రశ్నఅసలు జన్మలు వున్నాయా అని ? జన్మలు వున్నాయి అది సృష్టి యొక్క
రహస్యము అని అందరము ఒప్పుకుని తీరాలసిందే. ఇక్కడ మనము కొన్ని ఉదాహరణకు తీసుకుందాము
. కొన్ని సార్లు మనము ఏది అయిన ప్రదేశానికి మొట్ట మొదటి సారిగా వెళ్ళినప్పుడు అది
మనకు ఎక్కడో ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది . కాని ఈ జన్మలో నేను మొదటి సరిగా
వచ్చాను . మరి నాకు ఎందుకు ఎలా అనిపిస్తుంది అని అనుకుంటాము . దాని అర్ధం మీ
శరీరానికి కొత్త ప్రదేశము కాని మీ ఆత్మకు కాదు అని మనము తెలుసుకోవాలి . ముందు
జన్మల్లో మీ ఆత్మ ఆ ప్రదేశము చూసే వుంటుంది . అందుకే జన్మ తీసుకుని మీకు
తెలియకుండా ఆ ప్రదేశానికి వెళ్ళి నప్పుడు మీకు ఎదో తెలియని అనుభూతి మరియు ఇది
ఏమిటి ఎప్పుడో చూసినట్టు వున్నది అని అనుకుంటాము . అంతే కాదు కొంత మందిని
కలిసినప్పుడు ఎదో తెలియని ఆనందము మరియు వాళ్లతో మనము అంటాము కూడా మిమల్ని నేను
ఎక్కడో కలిసినట్టు వుంది అని . వాళ్ళు అంటారు లేదు నేను మిమల్ని మాత్రమూ
మొదటిసారిగా చూస్తున్నాను అని . దాని అర్ధం కూడా వారి ఆత్మ మన ఆత్మకు కొత్త కాదు .
ఆత్మను ఆత్మ గుర్తు పట్టింది . దాని వలన మనకు ఎక్కడో ఎప్పుడో చూసినట్టు వుంటుంది .
అన్న సత్యము అందరమూ అంగికరించ వలసినదే . కొంత మందిని చూసి మనకు తెలియకుండానే ఇష్ట
పడతాము మరియు వాళ్ళని మన స్మృతిలో కూడా నిలిపోతారు . వాళ్ళని అంతా సులభముగా మరచిపొలేము కూడా! గుర్తుకు తెచుకోవటo అనేది
ఆత్మిక దృష్టితో వుంటుంది . ఆ సమయములో మన మనస్సుకు సంతోషము అయిన కలుగ వచ్చు లేక దుఃఖము
కలుగ వచ్చు . సంతోషము కలిగినప్పుడు మన శరీర అవయవాలు ఫై ప్రభావం పడడము వలన బి.పి. ,
థైరాయిడ్ , డయాబెటిస్ అన్ని నియంత్రణ లోకి వస్తాయి . మనము మానసికముగా మరియు
శారిరకముగా కూడా ఆరోగ్యముగా వుంటారు . అదే దుఖము కలిగితే బి.పి. , థైరాయిడ్ , డయాబెటిస్ అన్ని అదుపు
తప్పి అవయవాల ఫై ప్రభావం పడటం వలన ఆ ప్రభావం చాల భారముగా వుంటుంది . అన్ని అవయవాలు
సక్రమముగా పని చేయటం అపివేస్తాయి . దానితో మనము మానసికము గా బాధ పడటమే కాదు శారిరకముగా కూడా అనారోగ్యం పాలు అవుతాము .
ఇంకొక విషయము కూడా తెలియ చేస్తున్నాను .ముందు జన్మలో నేను
క్రిస్టియన్ గా అమెరికాలో పుట్టి వుండవచ్చు. ఇప్పుడు వున్న జన్మ హిందువు గా కాని
ముస్లిం గా కాని పేద ఇంటిలోనూ పుట్టవచ్చు. వీటికి కారణము నా కర్మలు . అంతే కాదు రెండు
జన్మలు ఫిమేల్ గా తీసుకుంటే 3 వ జన్మ తప్పకుండా మేల్ గా తీసుకోవలసిoదే . అంటే
ప్రతి ఆత్మ స్త్రీ గా కొన్ని సార్లు పురుషుడు గా కొన్ని సార్లు తప్పక జన్మలు
తీసుకోవలసిందే . మనము జన్మలు తీసుకోనేటప్పుడు మనతో పాటు కొన్ని ముందు జన్మ
సంస్కారములు కూడా మనతో వస్తాయి . ఇది అందరికి తెలిసిన సత్యమే . నేను చేసిన
రీసెర్చ్ లో రాజ యోగ మెడిటేషన్ ప్రకారం మనకు వున్న జన్మలు 84
. వీటి గురించి మీకు పూర్తి వివరాలు కావాలి అంటే మీకు ఇష్టం వుంటే ప్రజాపతి బ్రహ్మ
కుమారీస్ సెంటర్స్ ని సంప్రదించండి .
మరొక విషయము అసలు మనము పుట్టుకతో ఏమి తెచ్చుకున్నాము .
మరణముతో ఏమి పట్టుకు పోతున్నాము అని ఎవరు అయిన ఆలోచించారా ? నేను అయితే ప్రతి
నిమిషం ఆలోచించాను . ఆలోచిస్తూనే వుంటాను . పుట్టుకతో ఏమి తెచ్చుకోము మరియు
మరణముతో ఏమి పట్టుకుని వెళ్ళాము . కాని జన్మ తీసుకుని వున్నప్పుడు మాత్రమూ మనము
అందరికి ఉపయోగ పడే విధంగా దైవి సంస్కారంను కలిగి మన జీవితాన్ని ఎదుటి వారికీ ఆదర్శ
ప్రాయముగా నిలిచేలా చేసుకోవాలి . అది శాశ్వతoగా అందరికి సహయోగముగా వుండి పోతుంది .
ఒక్కసారి అందరు కూడా ఆలోచించండి మనము జన్మను ఎందుకు తీసుకున్నాము
. ఎవరి గురించి వాళ్ళు మాత్రమే ఆలోచించుకోవాలి . నా గమ్యము ఏమిటి ? అన్న ప్రశ్నను
కూడా ఎవరికీ వారే వేసుకోవాలి . ఇక్కడ నేను
అడుగుతున్నది లౌకిక గమ్యము గురించి కాదు ? లౌకికములో నా గమ్యము ఏమిటి అంటే నేను
డాక్టర్ ని అవుతాను లేక ఇంజనీర్నీ అవుతాను లేక సోషల్ వర్కర్ ని అవుతాను లేదు
బిజినెస్ మాన్ అవుతాను అని ఇలా రకరకాలుగా చెప్పుతాము . కాని నేను ఇక్కడ అది అడగటము
లేదు . మన ఆత్మ యొక్క అలౌకిక గమ్యము ఏమిటి అని ? నేను గ్రహించింది నా ఆత్మ గమ్యం
మన అందరి అలౌకిక ఇల్లు అయిన పరంధామమును చేరుకోవటము . మన తండ్రి అయిన పరమాత్మను
చేరుకోవటo . మరి దానికి నేను ఏమి చేయాలి ? అన్న ప్రశ్న నాకు కలుగుతుంది . ఆ
అన్వేషణలోనే రాజ యోగ మెడిటేషన్ గురించి రీసెర్చ్ చేస్తూ తెలుసున్న విషయాన్నీ మీకు
తెలియజేస్తున్నాను నా ఆత్మలో ఇప్పుడు పరమాత్మ తన యొక్క ప్రకాశముతో నా ఆత్మ
స్వధర్మము అయిన శాంతిని తిరిగిఇస్తూ నాకే కాదు అందరి ఆత్మలను తన ఇంటికి
తీసుకువెళ్లడానికి సహయోగాన్ని ఇస్తూ ఆత్మలో శక్తిని నింపుతున్నారు . మన అందరి
అలౌకిక ఇల్లు పరంధామము నా కళ్ళ ముందు చాల అద్బుతoగా కనపడుతుంది . లింగాకారంలో
వున్న పరమాత్మ మరియు ఆత్మల ప్రకాశ కూటమిని చూస్తూనే వుండిపోవాలానే అనిపిస్తుంది . మన అలౌకిక ఇల్లు ఎంత శాంతిగా ఈ ధ్వని లేకుండా
వుంది . నాకు ఎప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతానా అని అనిపిస్తుంది . మరి మీకు ?
ముందుగా మనము అక్కడకి చేరుకోవటానికి చాల చాల ఆత్మిక ధారణ చేయవలసి వుంది . అది మన
శరీరములోని అవయవాల పని ఫై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది . అని నేను అర్ధం
చేసుకున్నాను . నా జీవిత పయనాన్ని మన అందరి గమ్యము వైపు మళ్లిస్తున్నాను . మరి
మీరు ? మీకు ఏది అనిపిస్తే అది చేయండి . ఎవరి ఆత్మిక స్థితి వారిది . ఎవరి అనుభవము
వారిది . ఎవరి జీవితం వారిది . ఎవరి నమ్మకము వారిది .
మిగిలిన విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం
! మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ హెల్త్ రిపోర్టర్ వాళ్ళకి
ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ , అందరికి
ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను . నేను
ఒక ఆక్యూపుంచరిస్ట్ గానే కాదు ,ఒక తత్వవేత్తగా నా
చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు
గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను
మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి .
మిగిలినవి వదిలివేయండి
. ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది .
ఎవరి నిర్ణయం వారిది . మీ శ్రేయోభిలాషి--------
> అస్త్ర అగ్ని జ్వాలా ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
No comments:
Post a Comment