ఎపిసోడ్ :9
" ఆత్మిక దృష్టితో
సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "
ముందు సంచికలో
స్వ పురుషార్ధం గురించి తెలుకున్నాము . ఇక్కడ ఇంకొక విషయాన్నీ వివరిస్తున్నాను స్వ
పురుషార్ధం అంటే ఆత్మిక స్థితిని పెంచుకోవటం. ఎప్పుడు అయితే మన ఆత్మిక స్థితిని
పెంచుకుంటామో మనకు తెలియకుండానే మన సామజిక జీవనములో కూడా మార్పును పొందుతాము . ఆ
మార్పు మనలను పది మందిలో ఆదర్శనీయముగా మారుస్తుంది . మన ఆత్మ పొందిన పరమాత్మ
ప్రకాశాన్ని నేను నా నుంచి వాయుమండలమునకు మరియు విశ్వంలోని ప్రతి ఆత్మకు ఆ
దివ్యమైన ప్రకాశాన్ని ప్రసరింప చేయగలను . సత్యం నిప్పుతో సమానము . దానిని ఎంత
దాచిపెట్టడానికి ప్రయత్నము చేసినా అది దాగదు.
ముందు సత్యం ఓడిపోయినట్టు వున్న చివరికి గెలిచేది ధర్మమే !
ఈ విషయం మనం అందరము మర్చిపోవద్దు . ఎవరో ఎదో చెప్పుతున్నారు అని అందరిని నమ్మటం
ఎంత వరుకు ఒప్పు అనేది కుడా మనకు మనమే ఆలోచించుకోవాలి . మన బుద్ధి ఫై మన ఆలోచనను
కేంద్రికృతం చేయాలి . మన బుద్ధిని శ్రేష్ట సంస్కారము అనే ఖజానాతో నింపుకుని మన మనస్సును పరమాత్మ ఫై కేంద్రికృతం చేయాలి . అప్పుడు ఏది
సత్యమో ఏది అసత్యమో మనకు తెలుస్తుంది . ఏది ధర్మం , ఏది
అధర్మం అనేది మనకు అర్ధం అవుతుంది . అంటే ఇక్కడ నేను తెలియ చేస్తున్నది ఒక్కటే మన
ఆత్మలో వున్న శక్తిని ఆధారముగా చేసుకుని సత్యాన్ని గ్రహించి లేక సత్యాన్ని గ్రహించ లేక పోవటం వలన తాను తీసుకున్న నిర్ణయమును తన
సంస్కారం ద్వారా తెలియ చేస్తాడు . కొన్ని సార్లు మనము ఎందుకు ఈ విధంగా నిర్ణయం
తీసుకున్నామో కూడా మనకు తెలియదు . అనేక సార్లు మనకు తెలియ కూడా మనము తప్పుగా
నిర్ణయం తీసుకుంటాము .నేను అలా అసత్యముగా ఎందుకు మాట్లాడాను అని అనుకుంటాము . ఆ
విధముగా ఎందుకు చేస్తాము అని తెలుసుకోవటానికి మనము ఇంకొంచం లోతుగా వెళ్ళాలి . దాని
గురించి మీకు ముందు ముందు తెలియ చేస్తాను .
నేను ఎవరు అన్న దానికి సమాధానము నాకు దొరికింది కానీ నాకు ఎప్పుడు ఒక
ప్రశ్న వస్తుంది . అసలు
జన్మల రహస్యం
ఏమిటి అని నేను ఎప్పుడు ఆలోచించేదానిని ? మరి మీరు ?
నేను ఎక్కడనుంచి వచ్చాను అని
కూడా ఆలోచించేదానిని. మనము ఇప్పుడు చూద్దాము ! జాగ్రత్తగా గ్రహించండి .
" నేను ఒక అనాథను అంటూ జీవి
పుట్టుక ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాడు . బంధనాలు అనే పద్మవ్యూహా౦లో
చిక్కుకుపోతాడు
, చివరికి నేను అందరూ వున్న అనాథను అంటూ జీవి మరణముతో
శరీరాన్ని వదిలేస్తాడు." (అసలు ఆత్మ శరీరాన్ని ఎప్పుడు , ఎందుకు
వదిలేస్తుంది
? మరణానంతరము ఎక్కడికి వెళ్ళుతుంది .? ఆత్మ జీవిగా
మారి ఏ విధముగా
శరీరములోనికి ఎలా ప్రవేశిస్తాడు అని తన గురించి తానూ
ఆలోచించరు .)
ధైర్యముగా
సృష్టి రహస్యం అయిన జనన - మరణ కాల చక్రం గురించి తెలుసుకుందాము . మన అందరికి తెలిసిన
విషయము మరియు సత్యము అది ఏమిటి అంటే " పుట్టిన వాడు మరణించక తప్పదు " "
మరణించిన వాడు పుట్టక తప్పదు "
. ఆత్మ అనగానే జనన - మరణ చక్రములోనికి రావలసిందే . జననము - మరణము ఈ విశ్వములో లేని వాడు ఒక్క
పరమాత్మ మాత్రమే . అంటే దాని అర్ధం పరమాత్మ జనన - మరణ చక్రములోనికి రాడు అని . అందుకనే
పరమాత్మను సృష్టి కర్త అని అంటారు .విశ్వాన్ని సృష్టించిన పరమాత్మకు జననము –
మరణము రెండు లేవు . పరమాత్మయే విశ్వానికి అధిపతి . నామ , రూపములు లేని వాడు .
కేవలము ప్రకాశమును వేదజిల్లె ఆయనే పరమాత్మ . ఆ పరమాత్మ యొక్క ప్రకాశాన్ని నేను అనుభూతి
చెందుతున్నాను . మరి మీరు ?
పరమాత్మ ప్రకాశ
కిరణాలతో నా ఆత్మ
పావనముగా మారి పోతుంది .
నేను ఆత్మను బిందు స్వరూపాన్ని అన్న నా అనాది స్వరూపాన్ని నాకు గుర్తుకు
చేస్తోంది ." నేను అనాది స్వరూప ఆత్మను " నేను ఇప్పుడు నాకు తెలియకుండానే బిందు
స్వరూపములోకి నా ఆత్మిక
స్థితిని తీసుకువెళ్లాను . నేను ఎప్పుడు అయితే
బిందు స్వరూపాన్ని అనుభూతి చెందుతున్నానో నాలో తెలియని నిశబ్దం జాగృత మవుతుంది .
నాకు ఏ ధ్వని తెలియటం లేదు . కేవలము శాంతి అనుభూతి . శాంతి , శాంతి , శాంతి
అనుభూతి మాత్రమే వుంది . ఇక్కడ నేను ఏ బంధనలోను లేను . నేను శాంతి స్వరూప ఆత్మను
అన్న స్వమనములో నా ఆత్మ సెట్ అయి వుంది . పరమాత్మ నా ఆత్మ
ఫై శాంతి కిరణాలను ప్రసరింప చేస్తున్నారు . నేను అనుభూతి చెందుతునాను . ఆ శాంతి
కిరణాలూ నాలో నిశబ్దంను పెంచుతున్నాయి . నిశబ్ధం అనుభూతి ని పొందుతున్నాను . నేను –
తండ్రి అయిన పరమాత్మ మాత్రమే వున్నాము . తెలియని ప్రశాంత వాతావరణంలో
విహరిస్తున్నాను .
మిగిలిన
విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం ! ఒక ధారణ పాయింట్ ని మీకు అందజేస్తున్నాను
.నచ్చిన వారు ప్రయత్నం చేయవచ్చు లేక పోతే వదిలి వేయండి ?
ప్రశ్న : ఏ శక్తిలతో
ఆత్మ మరియు శరీరము రెండు కాంచనముగా అవుతూ
వున్నాయి ?
సమాధానము : 1 .
జ్ఞానము
2. ప్రేమ
3. పవిత్రత
ఈ మూడు శక్తులతో
ఆత్మ మరియు శరీరము రెండు కంచనముగా అవుతూ వున్నాయి .
జ్ఞానము అంటే
స్వయముగా మన అలౌకిక తండ్రి అయిన పరమాత్మ ఇస్తున్న జ్ఞాన వెలుగును నా ఆత్మలో
వెలిగించుకోవటం . పరమాత్మ యొక్క ప్రకాశంతో నా ఆత్మలో నిండుతున్న ప్రేమను ,
పవిత్రతను నా ఆత్మలో నింపుకుంటూ, విశ్వానికి అంతటికి నా ఆత్మ
నుంచి ప్రేమ , పవిత్రత ప్రకంపనాలను ప్రసరింప చేస్తున్నాను.
పవిత్రత , ప్రేమ అనేది అత్మిక దృషిని కలిగి వుండాలి
. అప్పుడే దాని ప్రభావము మన శరీర అవయవాల ఫై న పడుతుంది . మనము సంపూర్ణ ఆరోగ్యమును
పొందుతాము .
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన
ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
వాళ్ళకి
ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన వాటికీ , అందరికి
ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను . నేను
ఒక ఆక్యూపుంచరిస్ట్ గానే కాదు ,ఒక తత్వవేత్తగా నా
చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు
గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను
మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి .
మిగిలినవి వదిలివేయండి
. ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది .
ఎవరి నిర్ణయం వారిది .
మీ శ్రేయోభిలాషి-------- > అస్త్ర అగ్ని జ్వాలా
ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
No comments:
Post a Comment