ఎపిసోడ్ : 19
"
ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము "
ముందు సంచికలలో మనము మూడు లోకములు వున్నాయి అని అనుకున్నాము
. దానిలో పరంధామము గురించి తెలుసుకున్నాము
. ఇప్పుడు సాకార లోకము మరియు సూక్ష్మ వతనము గురించి తెలుసుకు౦దాము.
ముల్లోకములు
:
1
. సాకార మనుష్య లోకము
2
. సూక్ష్మ లోకము
3
. బ్రహ్మ లోకము / పరంధామము
సాకార మనుష్యలోకము అంటే ఏమిటి ?
సాకారము అంటే ఇప్పుడు మనము నివస్తిస్తున్న భూ ప్రపంచము . ప్రస్తుత మనిషి సామజిక జీవనంలో నివసించటం . దీని అర్ధము రోజు జీవించే సాధారణ జీవనము. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి . ఆత్మ శరీరంలోకి ప్రవేశించగానే మనము వాడుక భాషలో జీవాత్మ అని అంటాము . ఎప్పుడు అయితే ఆత్మ శరీరంలోకి ప్రవేశించగానే
జీవాత్మగా మారిందో అప్పుడు వెంటనే రక్త మాంసములతో కూడిన స్థూల శరీరమును తన రధముగా ( అంటే సేవకుడిగా ) చేసుకుని తమ తమ కర్మలకు తగిన ఫలితములను అనుభవిస్తూ జనన - మరణ వలయములో చిక్కుకుపోతుంది
. ఎప్పుడు అయితే రక్త మాంసములతో కూడిన శరీరాన్ని వస్త్రముగా ధరిస్తాడో మనకు తెలియకుండానే వికారాలకు వశము అవటం జరుగుతుంది
. సత్య యుగములో ఆత్మిక శక్తితో వికారాలను జయించినా కలియుగాంతం లోకి వెళ్ళే సమయానికి ఆత్మ వికారాలు వశము అయిపోతుంది అన్న సత్యాన్ని గుర్తించాలి
. మళ్ళి మనము తిరిగి వికారాల ఫైన విజయం సాధించటము మొదలు పెట్టడానికి ఆత్మలో శక్తిని నింపుకోవటానికి
రాజ యోగ మెడిటేషన్ నేర్చుకోవలసిందే
. సత్యం తెలుసుకోవడానికి అందరూ అనగా ఎవరికైతే ఆత్మలో స్వయముగా పరమాత్మ నుంచి శక్తిని నింపుకోవాలని అనుకుంటారో
నా ఆత్మకు శాంతి కావాలి అనుకుంటారో వారు అందరూ కూడా తప్పక మీకు వున్న ఆధ్యాత్మికత చింతనను సంపూర్ణము చేసుకోవటానికి ప్రజా పిత బ్రహ్మ కుమారీస్ సెంటర్స్ ని సంప్రదించండి
. ఇది మతానికి , కులానికి సంబంధించినది కాదు . ఆత్మకు సంభందించింది
. ఎవరు అయితే మనిషిగా జన్మను తీసుకుంటారో వారు అందరూ పరమాత్మ యొక్క ప్రకాశమును పొందటం వారి జన్మ హక్కు అని మాత్రమూ మర్చిపోకండి
. ఇక్కడ శబ్దము . సంకల్పాలు అని
వుంటాయి .
సూక్ష్మ లోకము అంటే ఏమిటి ?
సాకార మనుష్య లోకాన్ని దాటి సూర్య చంద్ర మండలాలను దాటితే సూక్ష్మ లోకము .
సూక్ష్మ లోక నివాసులు :
1
. బ్రహ్మ
2
. విష్ణు
3
. శంకరుడు
.
ఈ సృష్టి రహస్యము అందరికి తెలిసిందే . పరమాత్మ సృష్టిని
స్థాపన – పాలన – వినాశన కార్యక్రమములో ముగ్గురి స్వరూపంలో నిమిత్తo చేశారు . ఇక్కడ శబ్దం వుండదు . కేవలము
సంకల్పాలు మాత్రమే వుంటాయి .
లౌకికములో వారికి తెలిసిందే బ్రహ్మ కార్యము అంటే సృష్టిని
స్థాపించడానికి నిమిత్తము చేశారు . అలౌకికములో ఇక్కడ చెప్పబడిన నిజము ఏమిటి అంటే
పరమాత్మ జనన – మరణ చక్రాలలోకి రారు . దాని వలన పిల్లులు అయిన మనతో అయిన మాట్లాడాలి
అంటే ఒక మానవుని శరీరములోకి ప్రవేశం చెయ్యాలి . అప్పుడే మనకు అయన మాటలు వినపడతాయి
.దాని కోసమే సంగమ యుగములో ( అంటే కలియుగ అంతిమ సమయము – కలి యుగము 100 సంవత్సరంలో
పూర్తి అవుతుంది అనగా ) స్వయముగా పరమాత్మ పతితులుగా
అయిన మన ఆత్మలను పావనముగా చేయడానికి వృద్ధ మానవుని శరీరములోకి
అనగా లౌకిక పేరు దాదా లేఖ రాజ్ లోకి 1937 వ సంవత్సరం లో ప్రవేశము చేశారు . ఆయన ద్వారా మనకు పరమాత్మ తన
ప్రకాశంను అందిస్తూ ఆత్మ కోల్పోయిన శాంతిని మరియు శక్తులను మనకు అందిస్తున్నారు .
అంతే కాదు మనము ఎక్కడ నుంచి వచ్చాము అన్నది కూడా మనకు తెలియ చేసి మన ఇల్లు అయిన
పరంధామమునకు తిరిగి వెళ్ళటానికి సహయోగము ఇస్తున్నారు . దాదా లేఖ రాజ్ కి స్వయముగా
పరమాత్మ తన వారసత్వమును ముందుగా ఇచ్చి బ్రహ్మ అన్న నామకరణం చేశారు . ఇక్కడ బ్రహ్మ
కార్యము అంటే సత్య యుగ స్థాపనకు ఆత్మలను పరమాత్మ యొక్క ప్రకాశముతో పావనముగా
చేయించడము . బ్రహ్మ అంటే తల్లి అని అర్ధం . బ్రహ్మ నుంచి మనము తండ్రి అయిన పరమాత్మ
యొక్క వారసత్వమును పొందుతున్నాము . పిల్లలకు అలౌకిక అనగా ఆధ్యాత్మిక మరియు ఆత్మిక
దృష్టి వారసత్వమును పరమాత్మ బ్రహ్మ ద్వారా అందరికి అందించటము వలన మనము అందరమూ
బ్రహ్మ యొక్క కుమారి మరియు కుమారుడు అని పిలువబడుతున్నాము. ఇక్కడ కులానికి ,
మతానికి , వర్గానికి తావు లేదు . విశ్వంలోని ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మ యొక్క
పిల్లలే . మతాలు అనే వాటిని మనము సృష్టిoచుకున్నాము కాని భగవంతుడు మతాన్ని
సృష్టిoచలేదు . భగవంతుడు అనే వాడు ఒక్కడే ఆయనే పరమాత్మ . పరమాత్మ అంటేనే ప్రకాశం .
నేను ఆ ప్రకాశమును ఆస్వాదిస్తున్నాను . మరి మీరు ...
నేను పరమాత్మ యొక్క ప్రకాశాన్ని అనుభూతి చెందుతూ , వారసత్వాన్ని
పొందాను మరి మీరు ?
మరొక ముఖ్య విషయము అందరమూ జాగ్రతగా అర్ధం చేసుకోవలసింది
మరియు ధారణ చెయ్యవలసినది ఏమిటి అంటే ఆ బ్రహ్మ స్వరూపాన్ని లేక బ్రహ్మ తత్వాన్ని
ఎలా మన ఆత్మలో నింపుకోవాలి . ఇక్కడ పరమాత్మ రచన చేస్తారు . మన ఆత్మ బ్రహ్మ
తత్వాన్ని కలిగి మన జీవితానికి రచయితగా మారి మన రాతను మనమే వ్రాసుకుంటాము . దీని
అనుసరముగానే మనము వాడుక భాషలో మన జీవితానికి మనమే భాధ్యులము అని అంటాము .మన
శిల్పాన్ని మనమే చెక్కుకుని దేవత స్వరూపములోకి వెళ్ళటానికి అనగా దైవీ గుణములను
ఆత్మలో నింపుకుoటూ మన రాతను మనమే తయారుచేసుకుంటున్నాము . సృష్టి లో జన్మ తీసుకున్న
ప్రతి ఒక్క ఆత్మ బ్రహ్మ తత్వాన్ని కలిగి వుంటుంది .అందుకే అందరము ఆత్మిక దృష్టిని
తయారుచేసుకోవాలి . నేను స్వయము ఆత్మను – నా స్వధర్మము శాంతి అనే విషయాన్ని
ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి .
మిగిలిన విషయాలు మనము వచ్చే సంచికలో చూద్దాం
!
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన
ప్రశ్నలు అడగాలి అనుకుంటే ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
వాళ్ళకి ఉత్తరాలు పంపండి . దానిలో ముఖ్యమైన
వాటికీ , అందరికి ఉపయోగ పడే విధంగా
కొంత మందికి నిమిత్తంగా నేను చేస్తున్న కార్యములో సహయోగంలో వుండి సమాధానం ఇవ్వగలను . నేను ఒక అక్యూపంక్చరిస్ట్ గానే కాదు , ఒక తత్వవేత్తగా నా చిన్నతనము నుంచి నా
గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు గ్రహించిన విషయాలను మీకు
అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను .
దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి . మిగిలినవి వదిలివేయండి . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి
కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది . మీ శ్రేయోభిలాషి-------- > అస్త్ర అగ్ని జ్వాలా
ts 9 ఛానల్ హెల్త్
రిపోర్టర్
No comments:
Post a Comment