Wednesday, August 26, 2020

మాస్క్ మరియు పేస్ షీల్డ్ ధరించడములో గల సూక్ష్మ – స్థూల వైద్య రహస్యం.1.37

 

సూక్ష్మ – స్థూల వైద్య రహస్యం - 1.37


మాస్క్ మరియు పేస్ షీల్డ్ ధరించడములో గల సూక్ష్మ – స్థూల వైద్య రహస్యం.



ఇప్పుడు వున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరము మాస్క్ మరియు పేస్ షీల్డ్ వాడవలసిన అవసరం వచ్చింది. దీనిని మనము సూక్ష్మముగా తీసుకుంటే ఏమి నేర్చుకోవలసిన అవసరము వుంది. మన ఆత్మ కోల్పోయిన సతో ప్రధాన స్థితిని తిరిగి పొందటానికి వ్యర్ద మాటలను మాట్లాడకుండా , నిశ్శబ్దంలోకి వెళ్ళుతూ కాల చక్ర జన్మ రహస్యన్ని తెలుసుకోవడానికి “ స్వదర్శన చక్ర ధారి ఆత్మగా “ మనలను మార్చుకుంటూ మన  అలౌకిక తండ్రి అయిన పరమాత్మ జతలో ఇంటికి ( పరంధామము ) తిరిగి వెళ్ళడానికి తండ్రి ఇస్తున్న స్నేహి హస్తాన్ని పట్టు కోవాలి. స్థూలముగా మాస్క్ ధరించడం వలన కరోనా భారిన నుంచి మనలను కాపాడుకోగలము. మాస్క్ ని అందరూ ఎక్కువగా వున్న ప్రదేశాల్లో పెట్టుకోవాలి. సోషల్ డిస్టెన్స్ ఎక్కవగా వున్నప్పుడు మాస్క్ పెట్టుకో వలసిన అవసరం లేదు. ఆఫీసులో వున్నప్పుడు ప్రతి 30 నిమిషాలకు ఒక 5 నిమిషాలు మాస్క్ని తీసి ఫ్రెష్ గాలిని ఆస్వాదించండి. దాని వలన తలనొప్పి రాకుండా వుంటుంది. బ్రెయిన్ కి కూడా రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇంటిలో వున్నప్పుడు మాస్క్ ధరించ వలసిన అవసరం లేదు. చాలామంది తెలియక పొడుకునే సమయంలో మాస్క్ ధరించి పడుకోకూడదు. అలా చేయటం వలన ప్రాణానికి సమస్యలు వస్తాయి అన్న విషయాలను గమనిచుకోండి. మాస్క్ ధరించిన అంత సేపు కూడా మనం చాల నెమ్మదిగా వుంటాము . పక్కవారితో కూడా తక్కువగా మాట్లాడటం వలన కూడా మనము తెలియకుండానే ఆత్మీక వైద్య సాధన చేసుకుంటాము .  ఆత్మీక వైద్య సాధన అంటే నేను ఎవరు ? అన్న ప్రశ్న వేసుకుంటాము . అసలు ఎందుకు సమస్యలు ? అసలు ఏమిటి ఈ సృష్టి ? జనన – మరణాల ఆట ఏమిటి ? అని ఆలోచిస్తూ సత్యాన్ని గ్రహించి ఆత్మలో సర్దుకునే శక్తిని , ఇముడ్చుకునే శక్తిని నింపుకుంటూ మనోనేత్రంతో నా చుట్టూ వున్న మాయా ప్రపంచంను జయించడానికి తండ్రి చత్ర ఛాయా అనే ఆత్మిక షీల్డ్ ని నేను - నా బాబా అన్న స్థితిలో  శాంతి ప్రకంపనలను వాయుమండలములో వెదజల్లనా ! మాస్క్ ఎదుటి వారి నుంచి తుంపర్లు మీద పడకుండా ఆపడమే కాదు. ఎదుటి వారితో చేసే వికర్మల నుంచి కూడా మనము తప్పించుకోగలo అన్న విషయాన్ని మర్చిపోకండి.

మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు అడగాలి అనుకుంటే పేపర్ వాళ్ళకి ఉత్తరాలు పంపండి.



మీ శ్రేయోభిలాషి , ఉషా రాణి నేచురోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక.లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ మరియు ఆయుర్వేదo – హైదరాబాద్.–7995937939. www.usharaninaturopathyclinic.com

 

No comments: